16, ఏప్రిల్ 2024, మంగళవారం

బాబూజీ సందేశమాలిక 21 - లాలాజీ మహారాజ్ శతజయంతి - Birth Centenary of Laalaji Maharaj



బాబూజీ సందేశమాలిక 21 
లాలాజీ మహారాజ్ శతజయంతి - అంతఃకరణ 
(24, ఫిబ్రవరి 1973 )
Birth  Centenary of Laalaji Maharaj - Conscience 
(24 February 1973 )

Some also say they have made their conscience as Guru or Master. But I am sure, they have not made conscience as their Guru but their own ego. The conscience, as described in the Shastras, is made of four things - manas(mind), chit(deeper conscience), buddhi(cognition) and ahamkara(ego). If all these become perfectly purified, conscience will give you only correct signals.

After the purification of these things there come the higher powers. And at the same time purity has begun all round. I hope people will excuse if I add a little more in the context that incorrect way of worship will lead to the incorrect result.

We all desire for realisation, but we have no yearning for it. I pray that we all return to our original condition and see the difference between the earthly and the heavenly life!

కొంత మంది తమ అంతఃకరణనే గురువుగా లేక మాస్టరుగా భావిస్తామంటూంటారు. కానీ వాళ్ళు గురువుగా భావిస్తున్నది తమ అంతఃకరణను కాదు, తమ అహంకారాన్ని అని నాకు కచ్చితంగా తెలుసు. మనశాస్త్రాల్లో చెప్పినట్లుగా, అంతఃకరణ నాలుగు అంశాలతో తయారై ఉన్నది - మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము అని నాలుగు. వీటి శుద్ధి సంపూర్ణంగా జరిగినప్పుడు, అప్పుడు సరైన సూచనలొస్తాయి దీని నుండి. 

వీటి పూర్తి శుద్ధి జరిగిన తరువాత అప్పుడు ఉన్నత శక్తులు వస్తాయి. అలాగే అదే సమయంలో చుట్టూ అంతటా శుద్ధత్త్వమే ఆవరించడం ప్రారంభిస్తుంది. ఈ సందర్భంలో ఒక విషయం మరి కొంచెం అదనంగా చెప్తే జనం ఏమీ అనుకోరని ఆశిస్తున్నాను, ఏమిటంటే, ఆరాధనా విధానం సక్రమంగా లేకపోయినట్లయితే, ఫలితాలు కూడా సక్రమంగా ఉండవు. 

మనందరమూ సాక్షాత్కారం కోరుకుంటాం గాని, దాని కోసం మనలో తీవ్రతపన ఉండదు. అందరూ ఆ మూలస్థితికి తిరుగు ప్రయాణం చేసి చేరుకుని, భూమ్మీద జీవించడానికి, దివ్యంగా జీవించడానికి మధ్య గల తేడా ఏమిటో చూడాలని ప్రార్థిస్తున్నాను. 

1 కామెంట్‌:

  1. అబ్బ ! ఎంత పోరపాటు చేస్తున్నాం !! పూజ్య దాజీ గారు అందుకేనేమో విధిని రూపుదిద్దేది స్వచ్చతే అంటారు.. ప్యూరిటీ వీవ్స్ డెస్టినీ !! మనం స్వచ్చత, శుద్ధత గురించి మరిచేపోయాం !!

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...