బాబూజీ సందేశమాలిక 20
మద్రాసు సందేశం
(పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత, 9 జూలై 1972)
Message at Madras
(On return from Western Countries, 9 July 1972)
God is simple, and the method followed to achieve Him is also simple and straight. Man, technically named homo sapiens, i.e., wise man, has tried to seek God. Thought, when purely Divine, can reach the Source without fail. If corrupted with attributes and qualities, Realisation also becomes corrupted and degraded. Gross methods give gross results.
Meditation on the simple, pure and Ultimate alone can save man in his crisis. This surely makes him more and more simple, bringing him closer and closer to the Original Home. As you think, so you become.
There should be the subtlest method to realise the Subtlest Being. There should be one method, one Master and one God. Of course, selection you will have to do yourself.
The density of the thought can only be removed if we take to the sebtle method. My experience in this field is that if you want Divinity, the method should be easy, smooth and natural.
భగవంతుడు సరళుడు, ఆయన్ని పొందడానికి అనుసరించే మార్గం కూడా సరళంగా, తిన్నగా ఉంది. మనిషిని, సాంకేతికంగా హోమో సాపియన్స్ అంటారు, అంటే విజ్ఞత కలిగినవాడని అర్థం, ఇతను భగవంతుని అన్వేషించే ప్రయత్నం చేశాడు. ఆలోచన గనుక పరిశుద్ధంగా, దివ్యంగా ఉంటే మూలాన్ని తప్పక అందుకుంటుంది. ఆలోచన అలాగాక గుణస్వభావాలతో కలుషితమైనట్లయితే, సాక్షాత్కారం కూడా కలుషితమై, దిగజారుతుంది కూడా. స్థూల పద్ధతులు స్థూల ఫలితాలనే ఇస్తాయి.
కేవలం సరళమైన, శుద్ధమైన పరతత్త్వంపై ధ్యానించడం వల్ల మాత్రమే మనిషి ప్రస్తుతం ఉన్న విషమస్థితి నుండి బయట పడగలిగేది. దీని వల్ల కచ్చితంగా మనిషి మరింత సరళంగా తయారై, దైవాన్ని మరింత సామీప్యంగా అనుభూతి చెందుతాడు; మూల నివాసానికి మరింత చేరువవుతాడు. యద్భావం, తద్భవతి - ఎలా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతాడు మనిషి.
అతిసూక్ష్మ అస్తిత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి అతిసూక్ష్మ పద్ధతిని అవలంబించాలి. ఒకే పద్ధతి, ఒకే మాస్టర్, ఒకే దైవం ఉండాలి. ఆ ఎంపిక మాత్రం మీరే స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది.
సూక్ష్మ పద్ధతిని అనుసరించినట్లయితే ఆలోచనలోని సాంద్రతను తొలగించవచ్చు. ఈ రంగంలో నాకున్న అనుభవం ఏమిటంటే, మీకు దివ్యత్వం కావాలంటే, పద్ధతి తేలికగా, సున్నితంగా, సహజంగా ఉండాలి.
పూజ్య దాజీ గారు ఇందుకోసం స్పిరిచ్యుఅల్ అనాటమీ పుస్తకం రాసారా !! గురు పరంపర ద్వారా మానవాళి కి ఒక్కొక్కటిగా అందిస్తున్నారా !
రిప్లయితొలగించండి