5, ఏప్రిల్ 2024, శుక్రవారం

బాబూజీ సందేశమాలిక 16 - మూలానికి తిరుగు ప్రయాణం - To return to the Source

 

బాబూజీ సందేశమాలిక 16 
మూలానికి తిరుగు ప్రయాణం 
To return to the Source 
(జనవరి 1970 సందేశం, January  1970, Message )

When we were born into this world for the first time we were pure, because the source from which we have descended or come down is purity. The time went on, and in our innumerable births we have gathered around us different types of grossness by our actions. 

The only way out of this existence is to return to the source. To find the way back by unravelling the strands binding us may not be possible except with the help of a guide who has connected himself to the Source, and who can therefore loosen the knots binding us by the power of his transmission of the highest consciousness.

The first and almost immediate effect of the transmission is to give peace and calmness which can hardly be expressed in words. This experience in meditation helps to gently remind us of the source to which we must return and repeated experience strengthens the remembrance of our original home, and so loosens the bondage of the present life. As the transmission takes us to deeper and deeper levels of remembrance, our journey to the source becomes firmly established.

I pray that all of you may be granted this experience to see the ight of the day.

మనం మొట్టమొదటసారి ఈ ప్రపంచంలో జన్మించినప్పుడు, చాలా పవిత్రంగా స్వచ్ఛంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే మనం యే మూలం నుండి అయితే వచ్చామో, దిగి వచ్చామో అది చాలా పవిత్రతకు మారుపేరు. కాలం గడుస్తున్నా కొద్దీ, అనేక జన్మలు తీసుకుంటూ, మనం మన చేతల వల్ల రకరకాల జడతవాన్ని, స్థౌల్యాన్ని ఏర్పరచుకుంటూ వచ్చాం. 

ఇటువంటి ఈ ఆస్తిత్వంలో నుండి బయటపడాలంటే ఒకటే మార్గం, మూలానికి తిరుగు ప్రయాణం చేయడమే. తిరిగి మూలాన్ని చేరే దారిని కనుక్కోవడం, మనం ఏర్పరచుకున్న బంధాలనే దారాలను విప్పడం సాధ్యం కాకపోవచ్చు, కేవలం ఆ మూల్యంతో అనుసంధానమై యున్న మార్గదర్శి ఎవరైనా ఉంటే తప్ప; ఆయన తనకున్న అత్యున్నత చేతనను ప్రసరించేటువంటి శక్తి ద్వారా అప్పుడు మనం ఇరుక్కున్న ముడులన్నీ వదులుగా చేయగలుగుతాడు. 

ఈ ప్రాణాహుతి ప్రసరణ యొక్క మొట్టమొదటి ప్రభావం, వెంటనే కలిగేటువంటి ప్రభావం ఏమిటంటే, శాంతి-ప్రశాంతతలు; ఈ ప్రభావాలను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ధ్యానంలో మనకు కలిగే ఈ అనుభూతి మనం తిరిగి చేరుకోవలసిన  మూలాన్ని గుర్తు చేస్తుంది; పడే పడే కలిగిన అనుభూతి మన ఈ మూలనివాసం యొక్క స్మరణను తీవ్రతరం చేస్తుంది; అలాగే మన ప్రస్తుత జీవితంతో ఉన్న బంధాలను వదులుగా అయ్యేలా చేస్తుంది. ఈ ప్రాణాహుతి ప్రసరణ మనలను మరింత మరింత స్మరణ యొక్క లోలోతుల్లోకి తీసుకువెళ్ళిన కొద్దీ, మూలం వైపు మన ప్రయాణం పటిష్ఠంగా స్థాపింపబడుతుంది. 

మీ అమదరికీ ఇటువంటి అనుభూతి కలగాలని, ఈరోజున్న  వెలుగును గుర్తించాలని ప్రార్థిస్తున్నాను. 

1 కామెంట్‌:

  1. అవును... మనందరం ఇప్పుడు అనుభూతి చెందుతున్నాం... మనం మన సోదరీ సోదరులను కూడా మార్గదర్శనం చేసి ఈ పధ్ధతి లో అడుగు పెట్టిస్తే మనం కల లు గంటున్న ఆ ప్రపంచ శాంతి రాక మానదు... అవునా ! మన పని సంకల్పిచి మొదలుపెత్తడమే

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...