బాబూజీ సందేశమాలిక 32
జీవిత గమ్యం - మలేషియా సందేశం
(30 ఏప్రిల్ 1981)
The Goal of Life - Message Malaysia
(30 April 1981)
The goal of life is easily reached if we are devoted to it, having idea of our Master all the way through. There are different ways of remembering Him constantly. By devotion to the Highest, we make a channel from us to Him that serves as a path to Him. When the way is cleaned of all dirt and refuse, there will be no difficulty to tread on it. The path is cleaner in proportion to our devotion. You receive a push from the heart, while meditating on Him, to impel you on the way. The dirt and refuse are our conflicting ideas. While meditating, if you secure even a temporary lull, that means you have gone a step further on the path. You will find the conflicting ideas disappearing, when you are on your way on the path. When you acquire a state of permanency in your meditation, touching the innermost plane, the idea of the Ultimate or God becomes near you.
మార్గం అంతా కూడా మన మాస్టర్ దృష్టిలో ఉంచుకుంటూ, భక్తిశ్రద్ధలుంటే జీవిత గమ్యాన్ని తేలికగా చేరుకోవచ్చు. ఆయనను నిరంతరంగా స్మరించడానికి అనేక మార్గాలున్నాయి. అత్యున్నతమైనదాని పట్ల భక్తి ద్వారా, మన నుండి ఆయన వరకూ ఒక దారి ఏర్పరచుకోవచ్చు, అదే ఆయనను చేరడానికి మన మార్గం అవుతుంది. దారిలో ఉన్న మురికిని, చెత్తాచెదారాన్ని తీసేసి శుభ్రం చేస్తే, ఆ దారిలో నడవడానికి కష్టపడక్కర్లేదు. మనకున్న భక్తి మేరకు దారి శుభ్రంగా ఉంటుంది. ఆయనపై ధ్యానిస్తున్నప్పుడు, ఆ మార్గంలో నడవటానికి పురికొల్పినట్లుగా తోసినట్లుగా, ఒక అనుభూతి కలుగుతుంది. మురికి, చెత్తాచెదారం అనేవి మనలో ఉండే పరస్పర విరుద్ధమైన ఆలోచనలే. ధ్యానిస్తున్నప్పుడు తాత్కాలికంగానైనా, క్షణికశాంతి అయినా సరే, కలిగిందంటే, ఆధ్యాత్మిక పథంలో ముందుకు ఒక అడుగు వేసినట్లే. ఆధ్యాత్మిక పథం దిశగా ప్రయాణిస్తూన్నప్పుడు ఈ పరస్పర విరుద్ధ ఆలోచనలు అదృశ్యమైపోతాయి. ధ్యానంలో, లోలోపల ఉండే లోకాన్ని స్పృశిస్తూ ఒక విధమైన శాశ్వతత్వం సాధించిన తరువాత, ఆ పరతత్వం లేక భగవంతుడు చాలా చేరువగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
ఇంత సులువా అనిపిస్తుంది.
రిప్లయితొలగించండి