20, ఏప్రిల్ 2024, శనివారం

బాబూజీ సందేశమాలిక 28 - జీవితం - 80 వ జయంతి అహమ్మదాబాదు - Life - 80 th Birth Anniversary Ahmedabad

 


బాబూజీ సందేశమాలిక 28 - జీవితం  
(30 ఏప్రిల్ 1979 )
80 వ జయంతి అహమ్మదాబాదు 
80 th Birth Anniversary Ahmedabad  - Life 
(30 April 1979 )

Life is not life we are living. There is something beyond and beyond. I hope all of us will see the better days, if we devoted to Him and Him alone. 

We should not dwell in thought that God does not exist. It is the place where we should stay, and that is the main goal of life. All of us are proceeding towards Divinty or the goal of life - some consciously and some unconsciously. They who proceed consciously, are as if swimming in calm waters. Those who are proceeding unconsciously, are beating their hands and feet in the sand of the desert. Master, of course, is the medium between the two, and he tries to create relationship of the abhyasi with God. When that is done, a part of His duty is over.

మనం జీవిస్తున్న జీవితం, జీవితం కాదు. దీన్ని ఎంతో, ఎంతో దాటి జీవించవలసి ఉంది. మనం గనుక కేవలం ఆ భగవంతుని పట్ల మాత్రమే అంకితభావంతో ఉండగలిగినట్లయితే మనందరమూ మరింత మెరుగైన మంచి రోజులు చూస్తామని ఆశిస్తున్నాను. 

భగవంతునికి అస్తిత్వం లేదన్న ఆలోచనలో ఉండకూడదు మనం. మనం ఉండవలసిన స్థానం అది, అదే జీవితం యొక్క ప్రధాన లక్ష్యం. మనందరమూ కూడా ఆ దివ్యత్వం లేక జీవిత గమ్యం దిశగానే ప్రయాణిస్తున్నాం -  కొంతమంది స్పృహతో(ఎరుకతో) ప్రయాణిస్తున్నారు, కొంతమంది స్పృహలేకుండా (ఎరుక లేకుండా) ప్రయాణిస్తున్నారు. తెలిసి ప్రయాణిస్తున్నవారు, అలల్లేని నీటిలో ఈదుతున్నవాళ్ళలా ఉంటారు. తెలియకుండా ప్రయాణించేవాళ్ళు, ఎడారిలోని ఇసుకలో  కాళ్ళు-చేతులు కొట్టుకుంటున్నవాళ్ళలా ఉంటారు. ఈ ఇరువురి మధ్య మధ్యవర్తిగా ఉండేది మాస్టరేననుకోండి;  ఆయన అభ్యాసికి భగవంతునితో సంబంధాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది జరిగిందంటే, ఆయన నిర్వర్తించవలసిన ధర్మంలో సగం పూర్తయినట్లే. 



1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...