బాబూజీ సందేశం - నా మాస్టర్ సందేశం
(సెప్టెంబర్ 1960)
Message of my Master
(September 1960)
It is a great pleasure to me to deliver to you the message of my Master which is meant for the common good of all humanity. His auspiscious name was Samarth Guru Mahatma Ram Chandraji (of Fatehgarh, UP). He is the adi guru of our Mission. He devoted his whole life to the spiritual service of all mankind.
The popular belief that the attainment of liberation is not only difficult but also impossible within the span of one life is a mistaken notion. Who knows, this very life of ours might be the last one to bring us to the level of liberation.
Indeed our great Master has boldly asserted that one can, for sure, attain liberation in this very life, nay,even in a part of it, provided one is really earnest about it and has the fortune of having a proper guide. This he has practically demonstrated in many instances which only direct experience can prove.
సమస్త మానవాళి యొక్క శ్రేయస్సునుద్దేశించి నా గురుదేవుల సందేశాన్ని మీకందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన శుభనామము సమర్థ గురు మహాత్మా శ్రీరామ చంద్రజీ (ఫతేగఢ్, ఉ. ప్ర.). ఈయన ఈ సంస్థ యొక్క ఆది గురువు. ఆయన జీవితం అంతా సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక సేవకే అంకితం చేశారు.
మోక్షసాధన చాలా కష్టమని, అదీ ఒక్క జన్మలో సాధించడం అసాధ్యమని ప్రజల్లో ఉన్న నమ్మకం చాలా పొరపాటు. ఎవరికి తెలుసు, మనలను మోక్షస్థాయికి తీసుకురాగలిగేది ఈ జన్మే కావచ్చు, ఇదే ఆఖరి జన్మ కావచ్చును కూడా.
నిజమైన తపన ఉండి, సరైన మార్గదర్శి లభించినట్లయితే, ఈ జన్మలోనే సాధించగలమని, ఇంకా చెప్పాలంటే ఈ జన్మలో కొంత భాగంలోనే తప్పక సాధించవచ్చని మహనీయుడైన మన మాస్టరు నొక్కి చెప్పడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా వారు ఎన్నో సందర్భాలలో రుజువు చేయడం జరిగింది; దీనికి ప్రత్యక్షానుభవం మాత్రమే నిదర్శనం కాగలదు.
మనిషి లక్ష్యం గురించి చెపుతూ దానిని సులభతరం చేసారు. సామాన్యుడు కూడా దానిని సాధించగలమని మనకు అందించారు.
రిప్లయితొలగించండి