6, మార్చి 2024, బుధవారం

మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభూతులు - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ




మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభూతులు 
 
ఈ క్రింది విస్పర్ సందేశంలో బాబూజీ, మన యాత్ర ఏ  విధంగా భక్తితో ప్రారంభమై, నిజమైన ప్రేమ పట్ల సంపూర్ణ సమర్పణతో ఏ  విధంగా తేలికదనంతో, ఆనందంతో, అలౌకిక మదురానుభూతిలో లీనమైపోతామో తెలియజేస్తున్నారు. 

… Devotion boils down to what is essential: you love without asking yourself questions. That is the path to wisdom. Some need to lean on bookish knowledge – then one day all that seems superfluous. Knowledge comes from within; it seeps its way into every cell of the body, and there the spiritual being is fulfilled. It no longer cares about scientific or philosophical aspects of the method.

The intellect is at rest and the heart delights in the divine presence that resides in it. It tastes the pure nectar; it humbly gives thanks for this grace bestowed upon it – to go to the source within itself.

The principle is so simple: it is enough to surrender, to love truly; more than that, to adore, since only God can be adored. You will then feel light, happy, in a kind of beatitude. May you all get there! 

 

... భక్తి చివరికి అత్యవసరమైనవాటినే మిగులుస్తుంది; ఇక మిమ్మల్ని మీరు ప్రశ్నల్లేకుండా ప్రేమించడం ప్రారంభిస్తారు. ఇదే విజ్ఞతకు మార్గం. కొంతమంది పుస్తకజ్ఞానంపై ఆధారపడవలసిన అవసరం ఉంటుంది - ఒకరోజు అదంతా అనవసరం అనిపిస్తుంది. జ్ఞానం లోపలి నుండి ఉద్భవిస్తుంది. అది ప్రతీ కణంలోకి ఇంకుతుంది ; అప్పుడే ఆధ్యాత్మిక జీవికి సంపూర్ణ సంతృప్తి కలుగుతుంది. ఇక ధ్యానపద్ధతిని గురించిన శాస్త్రపరమైన, దార్శనికపరమైన వివరణలు అవసరం ఉండదు. 

బుద్ధి విశ్రమిస్తుంది, హృదయం తనలో నివసిస్తున్న దివ్యత్వంతో రమిస్తుంది. శుద్ధమైన అమృతాన్ని ఆస్వాదిస్తుంది. ఆత్మ తనపై వర్షింపబడుతున్న ఈ అనుగ్రహానికి - తనలోనే ఉన్న తన మూలానికి చేరుకోగలిగినందుకు కృతజ్ఞతతో నిండి ఉంటుంది. 

సూత్రం చాలా సరళమైనది: శరణాగతి చాలు. నిజంగా ప్రేమించడం చాలు. అంతకంటే మించి ఆరాధించడం చాలు, ఎందుకంటే ఆరాధించదగ్గవాడు కేవలం భగవంతుడు మాత్రమే గనుక. అప్పుడే మీరు ఆనందాన్ని, తేలికదనాన్ని, ఒకరకమైన అలౌకిక మాధుర్యాన్ని అనుభూతి చెందుతారు.  

1 కామెంట్‌:

  1. క్ల్రిష్ణారావు గారు చాలా గొప్ప ప్రయత్నం, యజ్ఞం వంటిది మొదలుపెట్టారు... మా అందరి కోసం వెతికి ఇలాంటి చక్కని పరమ పూజ్య బాబూజీ గారి విస్పర్స్ సందేశాల నుండి ఏమి జరుగుతుందో, లేదా ఏమి జరగవలసి ఉంది మనలో అన్నవి అందిస్తున్నారు. మీ ప్రయత్నానికి జోహార్లు. వెతికి పంచిపెట్టండి అందరికోసం !!

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...