గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవ్, 2024
కాన్హా శాంతి వనం
పూజ్య దాజీ ఈ మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తూ, దీనికి సంబంధించి, పూజ్య బాబూజీ నుండి అందుకున్న దివ్య సందేశాల్లో కొన్ని అంశాలను ఉటంకించడం జరిగింది. వీటిపై ప్రతి అభ్యాసి ధ్యానించాలని మనవి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
"Was it not said that In the future, our way will be at the heart of a great unifying movementfor the good of all humanity? The saying goes that unity is strength. The forces of good will have to unite beyond any kind of prejudice, and see only the best in every one in the face of critical situation which cannot be handled in the human level. The divine power will see to it; that is the way it goes."
- Wednesday, October 5, 2011 - 10:00 a.m.
"భవిష్యత్తులో మన మార్గం, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం, అందరినీ ఒక్కటిగా చేసే ఉద్యమానికి కేంద్రంగా ఉంటుందని చెప్పడం జరగలేదా? ఐక్యతే బలం అన్న నానుడి ఒకటుంది. మంచి కోసం పాటుపడే శక్తులన్నీ ఎటువంటి అభిప్రాయాబేధాలూ లేకుండా ఐక్యమవ్వలసిన అవసరం ఉంది; మానవ స్థాయిలో నియంత్రించలేని ఈ కీలక పరిస్థితిలో అందరూ ప్రతి ఒక్కరిలోనూ కేవలం మంచిని మాత్రమే చూడవలసిన అవసరం ఉంది. దివ్య శక్తి దీన్ని చూసుకుంటుంది; ఇది ఇలాగే జరుగుతుంది."
- బుధవారం, అక్టోబర్ 5, 2011 - ఉదయం 10:00 గంటలు
"India has always been a beacon of spirituality; this is how it is, one might say. In the future, this country will become the centre of an unprecedented action of this kind. A land of refuge it will be, after many upheavals. An important action will unfold there, promoting an expansion of consciousness that has been long planned and wanted. The high places of Sahaj Marg will have a major importance and play an unprecedented role in our history. The current Master will be inspired accordingly and everything will take place naturally."
- Wednesday, May 20, 2015 - 10:00 a.m.
"భారతదేశం ఎప్పుడూ ప్రపంచానికి దారి చూపే వెలుతురుగానే ఉండింది; ఎప్పుడూ అలాగే ఉందని ఎవరైనా అనవచ్చు. భవిష్యత్తులో ఈ దేశం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ రకమైన కార్యాచరణకు కేంద్రంగా ఉండబోతోంది. ఎన్నో ఉపద్రవాల తరువాత ఈ భూమి ఆశ్రయం ఇచ్చే భూమిగా తయారవుతుంది. ఎంతో కాలంగా ప్రణాళికలు వేస్తున్న, చాలా అవసరమైన చైతన్య వికాసం అనే ముఖ్య కార్యావిష్కరణ జరగబోతోంది. సహజ మార్గ ఉన్నత ప్రదేశాలకు చరిత్రలో ఈ విషయమై ఇంతకు ముందెన్నడూ లేని ప్రముఖ పాత్ర వహించవలసి ఉంటుంది. ప్రస్తుత మాస్టరుకు తగిన విధంగా స్ఫూర్తి కలుగుతుంది. అంతా సహజంగా జరిగిపోతుంది కూడా."
- బుధవారం, మే 20, 2015 - ఉదయం 10:00 గంటలు
ఎంత సుస్పష్టమైన సందేశాలు. మంచి సమయంలో, సదర్భానికి తగిన విధంగా అందించారు కృష్ణారావు గారు. మనందరి సహృదయంతో నిండిన ప్రార్థనలు కూడా ఈ యజ్న ప్రయత్నానికి జత కలవాలి గాక !
రిప్లయితొలగించండితప్పక అవసరం రాము భయ్యా!
రిప్లయితొలగించండి