గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - నాల్గవ రోజు ఆదివారం 17.3.2024
ఈ చారిత్రాత్మక గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం, ఆదివారం, నాల్గవ రోజు 17.3.2024 తేదీన చివరి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వేదికపై ఆశీనులైన గురువులు, ప్రతినిధులు ఇలా ఉన్నారు:
శ్రీ బాబా జైన్, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రెలీజియస్ లీడర్స్, శ్రీమతి మీనాక్షీ రాజకోవాజీ, బహాయ్ ఫైత్. పీర్-ఇనాయత్-ఖాన్, ఇనాయత్ ఆర్డర్ , జ్యోతేంద్ర ఎమ్ దవే జి, బి. ఎ. బి. ఎస్., వెనెరబుల్ డేషే డాంగ్రూజీ, తిబ్బట్ హౌస్ నుండి, శ్రీ జోవేస్ పెంటల్ హావెల్, కాన్షియస్ బీయింగ్ నుండి, శ్రీ దిల్షాద్ సింగ్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నుండి, శ్రీ సత్బీర్ సింగ్ ఖాల్సా జి, హార్వార్డ్ యూనివర్సిటీ నుండి, శ్రీ డీవోన్ మాక్రోసీ ఆస్ట్రేలియా నుండి, టోనీ నాడార్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నుండి, ఆత్మప్రీత్ విధీజీ, శ్రీ రాజచంద్ర మిషన్ నుండి, డా. భవానీ రావ్, అమృతా విశ్వపీఠం నుండి, మాస్టర్ జి, గాడ్ హోమ్ జర్నీ నుండి, మాస్టర్ మేనూద్, టెంపుల్ ఆఫ్ కాన్షియస్ నెస్ నుండి ఆసీనులయ్యారు. ఆ తరువాత భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకర్ గారు, శ్రీమతి సుధేష్ణ ధనకర్ గారు, కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్, పూజ్య దాజీ వేదికను అలంకరించడం జరిగింది. ఉపరాష్ట్రపతి తనకు వేసిన ప్రత్యేక ఆసనం తీయించేసి, మామూలు కుర్చీ వేయించుకున్నారు ఆసీనులవడానికి.
ఈ చారిత్రాత్మక గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం కేవలం ప్రారంభం మాత్రమే. ఇది సాకారమవ్వాలంటే, దీన్ని నిజంగా నమ్ముతున్న ప్రతి వ్యక్తీ త్రికరణశుద్ధిగా ప్రార్థించవలసి ఉంది. పరిశుద్ధ హృదయంతో, స్పష్టమైన ఉద్దేశంతోనూ, ప్రయోజనంతోనూ, ఈ సంకల్పాన్ని ప్రార్థనాపూర్వకంగా మన మనసులో ధారణ చేసినట్లయితే తప్పక సాకారమవుతుంది. అలాగే దీని వెనుక ఉంది నడిపిస్తున్న మన గురుపరంపరకు ఈ అవార్డు దక్కుతుందన్నారు.
ఆ తరువాత మన ఇతివృత్తం అయిన - అంతరంగ శాంతి నుండి విశ్వ శాంతికి అనేది సిద్ధించడం కోసం, సాకారమవడం కోసం, పూజ్య దాజీ ఆధ్వర్యంలో అందరూ ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయడం జరిగింది. ధ్యానం తరువాత కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్, ప్రసంగిస్తూ ఒక ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఆమె ఆంగ్లంలో అన్న మాటలు ఈ విధంగా ఉన్నాయి:
"Your Excellency, Vice-President Shri Jagdeep, distinguished guests, partners, colleagues, friends, my heartfelt greetings to you all. It is a genuine honour to return to this magnificient place. Vision, ingenuity and labour has transformed what was once harsh, and a depleted land into a lush green campus with rain-forests full of thriving endemic and endangered species, medicinal and edible plants and organic farms. This site has become the testament to harmony with Nature. Every step one takes through the Yatra Garden and these hallowed hoards is an encounter with tranquility and renewal. We stand today in the physical representation of the heartfulness you have been practising and sharing for so many years. And as we gather here, in the month before the 125th birthday of Babuji, it is a fitting monument to his lasting legacy. The imprint of his life, humble service, devotion and love is unmistakable. It echoes in the demeanour of everyone present here. And since reflected constantly in the vision and leadership offered by our dear friend and brother Daaji, who has once again welcomed us, so gracefully to this wonderful place.
The Commonwealth is a family and we are 56 nations and 2.5 billion people stretched across five continents and six oceans. And our collective heart beats with the shared values of peace, understanding and mutual respect. Daaji as the guiding force behind the heartfulness, you embody these values. Your wisdom, your compassion and your unwavering commitment to the spiritual well-being of humanity shines through you and through this movement. Your leadership has nurtured the growth of heartfulness and in doing so, you have touched the lives of countless people across the globe, across a hundred and sixty countries and more than 5 million practitioners with the dedicated support of 16000 volunteer trainers operating in over 5000 centres worldwide. Your impact extends far and wide. Heartfulness has become a global force for inner transformation creating ripples which transcend continents and cultures sowing seeds of mindfulness, compassion and spiritual well-being across the world. Your teachings resonate deeply offering a pathway to peace and self-discovery. And your approach to meditation and spirituality is both profound and accessible, guiding seekers on a journey towards a harmonious existence. This vision has cultivated a heartfulness community centred around love, unity and mindfulness offering solace and spiritual nourishment to seekers from diverse backgrounds in an increasingly chaotic world. Your unwavering commitment to service coupled with your profound understanding of the human heart creates a legacy of grace, humility, inspiration and boundless compassion. In our life we all try to create and send out our own positive ripples of change; the ripples you have created are fast and lasting. They can build a current which can sweep down even the mightiest wall of resistance and provide us all the constant inspiration. In your honour and in the honour of your vision and leadership, and your unwavering commitment to service, as Secretary-General of the Commonwealth of Nations, I am proud and honoured to bestow on you the title - The Global Ambassador for Peace-building and Faith in the Commonwealth."
కామన్ వెల్త్ జెనరల్ సెక్రటరీ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్ ఈ అద్భుతమైన ప్రసంగం చేసిన తరువాత సభలో ఉన్నవారంతా ఆనందాశ్రువులతో కరతాళ ధ్వనులు చేశారు. ఆ పిదప ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఆశ్చర్యమే కాదు; సరైన స్థానం నుండి యోగ్యత కలిగిన వ్యక్తికి, సరైన గుర్తింపు లభించిందన్నారు. పూజ్య దాజీని హృదయపూర్వకంగా అభినందించారు. శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్ మాట్లాడిన ప్రతీ మాట పరమ సత్యము, గోడ మీద వ్రాయదగ్గ మాటలన్నారు. మేడమ్ సరైన సమయంలో సరైన దిశలో నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యంగా ప్రస్తుతం మనం అనుభవిస్తున్న భీకర పరిస్థితుల్లో పరిష్కారాలు వెతుకుతున్న సమయంలో ఇది చాలా గొప్ప నిర్ణయం. పరిష్కారాలు ఈ పుణ్యస్థలి నుండే వస్తాయి. గాంధీని మహాత్ముడు చేసిందెవరు, సుభాస్ చంద్ర బోస్ ని నేతాజీ చేసిందెవరు? ప్రజలు. ఇక్కడ ఆలోచనా విధానానికి, అకుంఠిత సేవకు, గుర్తింపునిస్తున్నది కూడా ప్రజలేనన్నారు ఉపరాష్ట్రపతి. ఇది నన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నప్పటికంటే చాలా ఆనందకరమైన వార్త నాకు, అని తన ప్రసంగాన్ని ముగించారు.
ఆ తరువాత పూజ్య దాజీ పురస్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డు వ్యక్తిగతమైనది కాదని, ఇది హార్ట్ఫుల్నెస్ సంస్థను గుర్తించడమని, కాబట్టి ఈ పురస్కారం హార్ట్ఫుల్నెస్ కి దక్కిందని, శిరస్సు వంచి అభివాదం చేశారు. ఇక్కడున్న 300 కు పైగా సంస్థలన్నీ మనందరమూ కలిసికట్టుగా పని చేస్తే ఈ భువిని స్వర్గంగా మార్చేయవచ్చు; దేవతలు పై నుండి చూసి మనుషులు భూమ్మీద స్వర్గం సృష్టించారని సంతోషిస్తారు. కష్టం కాదు, తలచుకుంటే. కాస్త ఆసక్తి కావాలంతే. ఉదయం 5 నిముషాలు, సాయంకాలం 5 నిముషాలు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఆ భగవంతుని ధ్యానిస్తే ఆయన మన ద్వారా ఎన్ని పనులు చేయించుకుంటాడో చూడండి. ధన్యవాదాలు అని తన ప్రసంగాన్ని ముగించారు.
అబ్బ ! అద్భుఇతమ్ పాత్రిశియా ప్రసంగం. పూజ్య దాజీ మాటలు నిజమవాలి గాక ! ఎంత చక్కగా ముగించారు... తలచుకుంటే వర్ణించడానికి మాటలు చాలడం లేదు.
రిప్లయితొలగించండి