31, మార్చి 2024, ఆదివారం

బాబూజీ సందేశమాలిక 3 - భగవంతుడు సరళుడు - God is Simple

 


బాబూజీ సందేశం - భగవంతుడు సరళుడు 
God is Simple
Message at the Inaugural function of Gulbarga Mission Branch,1957 
1957, గుల్బర్గాలో సంస్థ యొక్క శాఖ ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చిన సందేశం, 

God is simple and extremely subtle. In order to realise this subtlest Being, we must take up means which are equally fine and subtle. The difficulty arises only when intricate methods are applied for the solution of this very simple problem. In other words they apply huge cranes for picking up a smaal sewing needle.

We have set up a tiny creation of our own, in the form of our individual material existence, having layers after layers of grossness and opacity. What is now to be done is to shatter off those layers of opacity one by one and assume the absolute state as we had at the time of creation. This is all the gist of the philosophy of our system Sahaj Marg. We are, so to say, to dissolve this tiny creationof our making or to unfold ourselves.

The easiest and surest means to achieve this end is to surrender yourself to the great Master in true sense and become a "Living Dead" yourself.

భగవంతుడు సరళుడు, అతి సూక్ష్ముడు.  ఈ అతి సూక్ష్మ అస్తిత్వాన్ని సాక్షాత్కరించుకోవాలంటే, మనం చేపట్టే మార్గం కూడా అంత సూక్ష్మంగానూ, అంత నాజూకుగానూ ఉండాలి. సమస్యలు ఎప్పుడొస్తాయంటే, ఈ సరళమైన సమస్యకు జటిలమైన పద్ధతులు వినియోగించినప్పుడు వస్తాయి. మరోలా చెప్పాలంటే, క్రింద పడిన కుట్టే సూదిని క్రేనుతో ఎత్టడానికి ప్రయత్నించినట్లుంటుంది. 

మనం మనదంటూ ఒక స్వంత భౌతిక అస్తిత్వాన్ని, ఒక చిన్ని సృష్టిని ఏర్పరచుకున్నాం; ఇందులో జడత్వం, అంధకారం పొరలుపొరలుగా ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు మనం చేయవలసిందేమిటంటే, ఈ చీకటి పొరలను  ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ చివరికి సృష్టి జరిగినప్పుడు ఉన్న మన మూల స్థితికి చేరుకోవాలి. ఇదే క్లుప్తంగా మన సహజమార్గ పద్ధతి యొక్క తత్త్వసారాంశము. మనం కేవలం మనం సృష్టించుకున్న ఈ చిన్ని సృష్టిని లయం చేసుకోవాలి లేక మనలను మనం వికసించేలా చేసుకోవాలి. 

ఈ గమ్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితమైన మార్గం, తేలికైన మార్గం, ఏమిటంటే, నిజమైన అర్థంలో ఆ మహానీయుడైన మాస్టరుకు సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవడమే,  మీరు స్వయంగా "జీవన్మృతుడిగా" మారిపోవడమే.  

1 కామెంట్‌:

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...