శ్రీ రాధాకృష్ణుల అమర - అలౌకిక ప్రేమ
శ్రీరాధాకృష్ణుల మధ్య ప్రేమ అలౌకికమైనది, అనంతం నుండి అనంతం వరకూ ఉండేది, సమస్త జన్మలలోనూ, సమస్త యుగాల్లోనూ కొనసాగేది, ఊహకందనిది. అర్థనారీశ్వర తత్త్వం రాధాకృష్ణుల ప్రేమ. ఈ ప్రేమ ప్రకృతి-పురుషుల ప్రేమ; కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకతీతమైన ప్రేమ; అందుకే ఈ ప్రేమ అతిశక్తివంతమైనది; వాళ్ళ పట్ల కీడు తలపెట్టినవారి పట్ల కూడా ఎటువంటి వికారాలూ లేకుండా ప్రేమతోనే వ్యవవహరించే ప్రేమ. ఇటువంటి ప్రేమను మూర్తీభవించిన తత్త్వం రాధాకృష్ణుల ప్రేమ తత్త్వం.
ప్రేమ అంటే స్వామిత్వం కాదు; ప్రేమ అంటే ఆత్మ సమర్పణ. ప్రేమ అంటే తన ప్రేముకుడిని కోల్పోతానన్న భయం కాదు; సంపూర్ణ స్వేచ్ఛనిచ్చే ఉదారత. మిమ్మల్ని బంధించని ప్రేమే సత్యమైన ప్రేమ అవుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించేలా చేసినప్పుడే ప్రేమ సత్యమైనదవుతుంది.
ఇటువంటి ప్రేమను బోధించడానికే శ్రీ రాధాకృష్ణులు అవతరించడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అరిష్ఠాలు వచ్చినా, ఎంత మంది దాడి చేసినా, ఎన్ని కుట్రలు జరిగినా చెక్కు చెదరకుండా ఉన్న ప్రేమ శ్రీరాధాకృష్ణుల ప్రేమ. అన్ని బంధాలకు అతీతమైన ప్రేమ, అందరి శ్రేయస్సును సమానంగా ఆలోచించే ప్రేమ. అటువంటి ప్రేమే ఈ సృష్టిని నడిపిస్తున్నది. అందుకే శ్రీరాధాకృష్ణుల ప్రేమ ఆదర్శ ప్రేమ. ఈ ప్రేమను పెంపొందించుకోవడమే ప్రతీ ఆధ్యాత్మిక పథం యొక్క పరమ లక్ష్యము, ఆదర్శమూ కూడా.
కృష్ణా రావు గారు ఎంత చక్కగా, మృదు మధురంగా చెప్పారు.... ఇంతకన్నా మరింకేమీ లేదు అన్నట్లుగా చెప్పారు. అమోఘం. అద్భుతం. భా రతం లో ఎక్కడ మనకు రాధ గురించి కనపడదు. అలాంటిది మీరు పదాలు ప్రయోగం అతీతంగా చేసి దీనిని అర్ధనారీస్వరత్వం గా పోల్చి చెప్పడం గొప్పగా ఉంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.