20, మార్చి 2024, బుధవారం

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - మూడవ రోజు 16.3.2024

 



గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం - మూడవ రోజు  16.3.2024

ఉదయం ప్లీనరీ సెషన్ లో ఆరుగురు ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది - డా. ఇమామ్ ఉమేర్ అహమద్ ఇలియాసి, ఆల్ ఇండియా ఇమామ్ కాన్ఫెడరేషన్ అధ్యక్షులు, శ్రీ అభిజీత్ హల్దార్ జీ, ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బుద్ధిస్టస్  అధ్యక్షులు, సద్గురు శ్రీ రితేశ్వర్ జీ మహారాజ్, ఆనంద్ ధామ్  ట్రస్ట్, బృందావన్ వ్యవస్థాపకులు. ఫాదర్ ఆంథోనీ పూలా, కార్డినల్, ఆర్చ్ బిషప్ హైదరాబాద్, వెనరబుల్ భిక్కూ సంఘసేన, వ్యవస్థాపక అధ్యక్షులు, మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, లద్దాఖ్, ఆదరణీయ ఆత్మప్రీత్  విధీజీ, శ్రీమద్ రాజచంద్ర మిషన్, ధరంపూర్, అడ్వైజర్ టు ఇంటర్ ఫెయిత్ ఆర్గనైజేషన్స్. వారు పలికిన కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:  

ఆత్మ శుద్ధి జరిగితేనే తప్ప శాంతి సిద్ధించదు.

 స్ఫర్ధలు తొలగిస్తే శాంతి రాదు; స్ఫర్ధలు తొలగించలేము; గనుక స్ఫర్ధలతో యే  విధంగా వ్యవహరించాలన్నది నేర్చుకోవాలి.

మతం మనలను ఏకం చేస్తే ఉపయోగం; మతం మనలను విడదీస్తే దాని వల్ల ఉపయోగం లేదు.

- శ్రీ అభిజీత్ హల్దార్ జీ, ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బుద్ధిస్టస్  అధ్యక్షులు.

 జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండదు; జీవితమే ఒక లక్ష్యం అని నమ్ముతాను; జీవితానికి లక్ష్యం ఏర్పరచుకుంటే అశాంతి వచ్చేస్తుంది.

అంతరంగ శాంతి అన్నారు; బాహ్య శాంతి సాధించాలనుకోవడం ఇంచుమించు అసంభవం; 800 కోట్ల జనాభా ఉంది భూమ్మీద, అనేక రకాల స్వభావాలు; అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక సంస్కృతులు, సాంప్రదాయాలు, ఇన్ని ఉన్నప్పుడు బాహ్య శాంతి అసంభవం; కానీ బాహ్యంగా అస్సలు శాంతి లేకపోయినప్పటికీ మనసులో శాంతి కలిగి ఉండవచ్చు, ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండవచ్చు; దీనికి శ్రీకృష్ణుడే ఉదాహరణ. అటువంటి అంతరంగ శాంతి సంభవం.

సూర్యుడొచ్చాడంటే, ఆయనతోపాటు ప్రకాశం కూడా దానంతట అదే వస్తుంది; అలాగే అంతరంగ శాంతి వచ్చిందంటే ప్రపంచ శాంతి తనంతట అదే వస్తుంది.

- సద్గురు శ్రీ రితేశ్వర్ జీ మహారాజ్  , ఆనంద్ ధామ్  ట్రస్ట్, బృందావన్ వ్యవస్థాపకులు

 అంతరంగ శాంతి ఉన్న వ్యక్తి మాత్రమే ఒక శాంతియుతమైన కుటుంబాన్ని ఇవ్వగలడు. కేవలం మానసిక ప్రశాంతత ఉన్న వ్యక్తి మాత్రమే కరుణ చూపించగలుగుతాడు, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికీ అత్యున్నత సేవలను అందించగలుగుతాడు. 

కానీ ఈ అంతరంగ శాంతి మూలం ఎక్కడున్నదన్నది అతి పెద్ద ప్రశ్న. క్రైస్తవ మతం ప్రకారం ఈ అంతరంగ శాంతి విశ్వాసం ద్వారా కలుగుతుంది. అంతరంగ శాంతి భగవంతునితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా కలుగుతుంది; ఏసు పట్ల విశ్వాసం ద్వారా.

      - ఫాదర్ ఆంథోనీ పూలా, కార్డినల్, ఆర్చ్ బిషప్ హైదరాబాద్

 మనందరికీ ఖరీదైన రిస్ట్ వాచీలున్నాయి గాని, ఎవరికీ సమయం లేదు. మీకు ఇక్కడ వాచీలున్నాయి గాని సమయం లేదు, మా హిమాలయాలకు రండి, మా వద్ద వాచీలు లేవుగాని సమయం చాలా ఉంది. తీరికగా ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు.

మనందరికీ 2 జి, 3 జి, 4 జి, 5 జి, 6 జీలున్నాయి గాని గురూజీ లేరు.

యునెస్కో వాళ్ళు కూడా చెప్తారు: యుద్ధం మనసులోనే మొదలవుతుంది; అలాగే శాంతి కూడా మనసులోనే మొదలవ్వాలి; గనుక ఈ సమావేశం చాలా ముఖ్యం.

సైన్స్, ఆధ్యాత్మికత కలవాలి; సైంటిస్టులు ధ్యానం నేర్చుకుని వాళ్ళ జ్ఞానాన్ని మానవాళి సేవకు వినియోగించాలి; ఆధ్యాత్మిక వేత్తలు కూడా గ్రుడ్డి విశ్వాసంతో గాకుండగా, సైంటిఫిక్  దృక్పథంతో అన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడే శాంతి సంభవమవుతుంది.

ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటే, ఇందరు ఆధ్యాత్మిక గురువులు, ఇక ప్రేక్షక పాత్ర వహించడానికి లేదు.

-  వెనరబుల్ భిక్కూ సంఘసేన, వ్యవస్థాపక అధ్యక్షులు, మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, లద్దాఖ్

ఎప్పుడైతే ప్రేమ అనే శక్తి, శక్తి (అధికారం, శక్తుల) పట్ల ప్రేమను అధిగమిస్తుందో అప్పుడు ప్రపంచం అంతరంగ శాంతిని అనుభూతి చెందుతుందన్నారు మా గురుదేవులు. శక్తుల, అధికారాల కోసం వెంపరలాడినప్పుడు మనం శాంతిని కోల్పోతాం.

నిత్య దైనందిక జీవనంలో చిన్ని-చిన్ని విషయాల్లో కూడా మనం ప్రేమను వదిలేసి అధికారాలకే ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. మనం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ కూడా ప్రేమకు అధిక ప్రాధాన్యతనిస్తే అంతరంగ శాంతి వస్తుంది ప్రపంచంలో. కానీ మీరు శాంతిని కాక్షయించినట్లయితే, మీకు రెండూ సిద్ధిస్తాయి. 

ఆదరణీయ ఆత్మప్రీత్  విధీజీ, శ్రీమద్ రాజచంద్ర మిషన్, ధరంపూర్, అడ్వైజర్ టు ఇంటర్ ఫెయిత్ ఆర్గనైజేషన్స్

సిఖ్ మతం ప్రకారం అంతరంగ శాంతికి  మూడు మూలస్తంభాలు ఆధారంగా ఉన్నాయి:  1) నామ్  జప్  నా 2)  కిత్ కరణీ ఔర్ 3) వన్ ఛకణా  

మన అంతరంగ శాంతికి శత్రువులు – కామం, క్రోధం, లోభం, మొహం, అహంకారం. వీటిని భగవన్నామ జపంతో జయించి అంతరంగశాంతిని పెంపొందించుకోవచ్చు.

రెండవది, నిజాయితీయైన సంపాదన వల్ల అంతరంగ శాంతి పెరుగుతుంది.

వన్ ఛకణా అంటే మన సంపాదనలో పదవ వంతు సమాజానికి ఖర్చు పెట్టడం, అప్పుడే అంతరంగ శాంతి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అహంకారం తగ్గుతుంది.

డా. దిల్ షా సింగ్ ఆనంద్, శిరోమణి, గురుద్వారా ప్రబంధక కమిటీ 

1 కామెంట్‌:

  1. పరపరమార్త నికేతన్ నుండి కూడా ఎవరో మాట్లాడినట్లు ఉంది. ఆయన కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా అద్భుతంగా వివరించారు, వర్ణించారు కృష్ణా రావ్ గారు. ఇది బ్లాగులో మనకు ఎప్పటికీ ఉంటుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...