28, మార్చి 2024, గురువారం

బాబూజీ పలికిన ప్రసిద్ధ వాక్యాల మననం

 


బాబూజీ పలికిన  ప్రసిద్ధ వాక్యాల మననం 

God is Simple - భగవంతుడు సరళుడు.
మననం: భగవంతుడు సరళుడు, మనిషి జటిలుడు. భగవంతునిలో లయమవ్వాలంటే భగవంతునిలా సరళంగా తయారవ్వాలి. మనిషిలోని జటిలత్వం పోయి సరళంగా మారాలి. భగవంతునిలా సరళంగా మారితే తప్ప మనిషి, ఆయనలో లయం కాలేడు, సముద్రంలో నీటి చుక్కలా. సముద్రంలో నూనె చుక్క కాలవలేదు. ఈ జటిల్యతవాన్ని వదిలించేదే గురువు నిర్దేశించిన సాధన. సాధన లేకుండా మనిషి సరయాళుడుగా మారే అవకాశమే లేదు. 

End of religion is the beginning of spirituality - మతం అంతమైన చోట ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. 
మననం: మతం అంతమైతే కాని ఆధ్యాత్మికత ప్రారంభం కాదు. మతం అంటే భగవంతుని బాహ్యంగా అన్వేషించడం, క్రతువుల ద్వారా, పూజలు ద్వారా, ఆచారాల ద్వారా, నమ్మకాల ద్వారా, యజ్ఞాల ద్వారా, వగైరా విధానాల ద్వారా అన్వేషించడం. మతం బాహ్యోన్ముఖ అన్వేషణను ప్రోత్సహిస్తుంది. మతం ద్వారా భగవంతుడు అంటే ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ అనుభూతి కలుగదు. ఎప్పటికీ మతానికే కట్టుబడి ఉండకూడదు, దానిని, మతానికి అతీతంగా  దాటవలసి ఉంది. మతాన్ని తిరస్కరించడం కాదు, నిరాకరించడం కాదు, ఆ పరిధిని దాటి ముందుకు సాగడం అవసరం. అదే ఆధ్యాత్మికత. 
 ఆధ్యాత్మికత అంతర్ముఖంగా చేసే అన్వేషణ. అంతర్యామిగా ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందే ప్రయత్నం. కాబట్టి ఆధ్యాత్మికత అంతరంగ అనుభూతిని ప్రోత్సహిస్తుంది.     
  
Freedom from freedom is real freedom - స్వేచ్ఛ నుండి స్వేఛ్ఛే అసలైన స్వేచ్ఛ.
 మననం: స్వేచ్ఛ అంటే బంధాల నుండి విముక్తి పొందినటువంటి ఆత్మ అనుభూతి చెందేటువంటి ఆధ్యాత్మిక స్థితి.  కాని స్వేచ్ఛను గురించి ఆలోచించినప్పుడల్లా బంధాల్లో ఉన్న భావన కూడా తప్పక ఉంటుంది; ఆ భావనలో చిక్కుకుని ఉంటాం. ఈ భావనలో నుండి కూడా విముక్తిని పొందడమే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ. అదే అసలైన స్వేచ్ఛ. స్వేచ్ఛ అనే భావం నుండి కూడా విముక్తి కావడమే నిజమైన స్వేచ్ఛ అంటారు బాబూజీ. 

More and more of less and less - తక్కువ తక్కువగా అవడం అనేది ఎక్కువ ఎక్కువ అవ్వాలి. 
మననం: ఇది చాలా సుప్రసిద్ధ వాక్యం. దీన్ని గురించి ధ్యానించినప్పుడు, జీవితంలో అనేక సందర్భాలలో అనేక అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అంతా మర్మగర్భమైన వాక్యం ఇది. ముఖ్యంగా మనలో ఉండే నకారాత్మకమైన విషయాలు గాని, భయాలు గాని, చింతలు గాని, మలినాలు గాని, కోరికలు గాని, అహంకారం గాని రోజురోజుకూ తగ్గుతూ ఉండటం ఎక్కువవుతూ ఉండాలి. 

Books do not help in realization; after realization is achieved books are useless - సాక్షాత్కారానికి పుస్తకాలు సహాయపడవు; సాక్షాత్కారం వచ్చిన తరువాత పుస్తకాలతో పని లేదు. 
మననం: పుస్తకాల ద్వారా సాక్షాత్కారం సిద్ధించదు, సందేహం లేదు. అలాగే సాక్షాత్కారం సిద్ధించిన తరువాత పుస్తకాలతో పని లేదు ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞానం లభించడం వల్ల. కానీ పుస్తకాలు సాధనకు ప్రేరణ కలిగించడానికి ఉపయోగపడతాయని పూజ్య దాజీ అంటూంటారు. గ్రంథ పఠనం, అభ్యాసం రెండూ ప్రక్కప్రక్కనే జరుగుతూ ఉండాలంటారు బాబూజీ. అభ్యాసమే గ్రంథాల్లోని అంశాలను అవసరమైన విధంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. కేవలం పుస్తకపఠనం పనికి రాదు.

1 కామెంట్‌:

  1. కృష్ణా రావు గారు ఎంత గొప్ప పని చేసారు. పరం పూజ్య బాబూజీ గారి ఈ వాక్యాలు ఆయన భాష చాలా లోతుగా మనం అర్థం చేసుకో వలసి ఉంది.. మోర్ అండ్ మోర్ ఆఫ్ లెస్ అండ్ లెస్ అనే వాక్య ఫోర్గేట్ యౌర్సెల్ఫ్ వలే ఎప్పటికీ మననం చేసుకోవలసిన వాక్యం ... మహా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.. దయచేసి ఇలా కొనసాగండి. నమస్తే !

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...