4, మార్చి 2024, సోమవారం

బాబూజీ స్పష్టీకరణలు - 12

అభ్యాసుల గురించి బాబూజీ పడే ఆవేదన  

I regret to find that some of you do not try to overcome your lazy habits, which is a clear indication of the fact that the ideal has not yet been firmly fixed in your mind. If it is foremost in your view, it can never be that you would shirk or neglect your duty in this respect.

మీలో కొంతమంది మీ బద్ధకపు అలవాట్లను అధిగమించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనించి బాధపడుతున్నాను. అంటే, మీ మనసుల్లో లక్ష్యం లేక ఆశయం ఇంకా సుస్థిరం కాలేదని సూచిస్తున్నది. మీ దృష్టిలో గనుక ఇది ప్రప్రథమమైన ధర్మం అయి ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటూ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించకుండా ఉండేవారు కాదు. 


 Some of the obstacles on the path are exclusively those which have been created by your own miscreated actions. But if you are sincerely attentive to your ideal, these things are sure to melt away automatically. I may also be helpful to you in this respect provided you impel me to it by the force of your sincere earnestness.

మార్గంలో ఉండే కొన్ని అవరోధాలు ప్రత్యేకంగా మీ అకృత్యాల వల్ల సృష్టింపబడ్డవే. కాని మీరు గనుక ఏర్పరచుకున్న ఆశయం పట్ల చిత్తశుద్ధి కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ వాటంతట అవే కరిగిపోతాయి. ఇందులో నా సహాయం కూడా మీకు తప్పక అందుతుంది, కాని ఎప్పుడు? మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో నన్ను తప్పనిసరిగా సహాయపడేలా చేసినప్పుడు. 


People do not try to overcome their wrong habits because they would then have to put themselves to effort or a bit of inconvenience. Never mind be it so. But if they only adopt the right course for the realisation of their object and are prompted by intense longing for it, none of these things shall stand in their way, but shall drop down like dead leaves.

జనం తమ చెడు అలవాట్లను అధిగమించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రయత్నించాలంటే కొంత శ్రమ అవసరం, కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి. అయినా ఫర్వాలేదు. వాళ్ళ లక్ష్య సిద్ధికి సరైన మార్గాన్ని తీవ్రమైన తపనతో అవలంబించినట్లయితే ఇవేవీ కూడా మార్గంలో అడ్డు పడవు, ఎండుటాకుల్లా వాటంతటవే రాలిపోతాయి. 


Often people expect me to look to their physical ailments and to apply my thought-force for their cure. Not only this, they also induce me to take up cases of their friends and relations, and I, being over-courteous and obliging by nature, undertake them, not minding my own difficulties and exertion.

తరచూ జనం వాళ్ళ శారీరక రుగ్మతలపై కూడా నా ఆలోచనాశక్తిని ఉపయోగించి నయం చేయాలనుకుంటారు. అంటే కాదు, వాళ్ళ స్నేహితుల బాధలు, బంధువుల బాధలు కూడా నయం చేయాలని కోరతారు; నాకు మొహమాటం ఎక్కువగా ఉండటం వల్ల, కాదనే అలవాటు లేకపోవడం వల్ల, నాకుండే ఇబ్బందులు పట్టించుకోకుండా, ఎంతో శ్రమకోర్చి  వీటిని చేపడుతూ ఉంటాను.  


 When I happen to hear of the physical trouble of any of my associates, I naturally get attentive for a while at least for their relief. But when anyone approaches me with a direct request for his cure, I feel myself bound to help him to my best, not minding over-exertion and strain.

నా సహచరుల్లో ఎవరికైనా భౌతికంగా ఇబ్బంది వస్తే నా దృష్టి అప్రయత్నంగానే వాళ్ళ మీదకు వెడుతుంది, కనీసం ఉపశమనం కోసమైనా నా దృష్టి వెడుతుంది. కానీ ఎవరైనా నేరుగా నయం చేయమని వస్తే, నా ఇబ్బందులను, నేను అధికంగా పడే శ్రమను పట్టించుకోకుండా నేను చేయగలిగినంత మంచి చేయడానికి బద్ధుడై ప్రయత్నిస్తాను. 




1 కామెంట్‌:

  1. బద్ధకపు అలవాట్లు, అక్రుత్యాలే ఇప్పుడు దర్శనం అవుతున్నాయి... వాటిని పోగొట్టుకోవడం కోసమే తపన... అయితే పరమపూజ్య బాబూజీ గారు చెప్పినట్లు ఆయన మీదే ధ్యాస పెట్టుకుంటే మిగతావి అంతగా బాధించక ఉంటున్నాయి.

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...