మహిళల పట్ల బాబూజీ హృదయం
పైన చిత్రం పూజ్య బాబూజీ మహారాజ్ అభ్యాసి సోదరీమణులతో తిరుపతిలో తీసుకున్న చిత్రం. వారి ప్రక్కనే తిరుపతికి చెందిన మన సంస్థలో అందరూ గౌరవించే, మహాజ్ఞాని, బాబూజీ శిష్యులు, సీనియర్ ప్రిసెప్టర్ ప్రొఫెసర్ డా. కె. సి. వరదాచారి గారు కనిపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బాబూజీ మహిళలను గురించిన వారి భావాలను గుర్తు చేసుకుందాం.
మొట్టమొదటగా, పూజ్య లాలాజీ మార్గదర్శనంలో వారు రూపొందించిన సహజ్ మార్గ్ ధ్యాన పద్ధతిని మానవాళికి అందించడంలో, దాన్ని అనుసరించడంలో, మహిళలకు ఒక ప్రత్యేక మినహాయింపునిచ్చారు. ఉదయం ధ్యానం అందరికీ సూర్యోదయానికి పూర్వమే పూర్తి చేసుకోవాలని, శుద్ధీకరణ సూర్యాస్తమయానికి పూర్వమే చేసుకోమని, సూచించడం జరిగింది. కానీ స్త్రీలకు మాత్రం, ముఖ్యంగా గృహిణులకు మాత్రం వాళ్ళకు అనువైన సమయంలో చేసుకోమన్నారు. దానికి కారణం ఆడువారు ఇంట్లో అందరికంటే ఆలస్యంగా పడుకొని, అందరికంటే ముందు నిద్రలేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ మినహాయింపు ఉందన్నారు బాబూజీ. ఈ ఒక్క అంశం ధ్యాన పద్ధతిని రూపకల్పన స్థాయిలోనే బాబూజీకి ఎంత కరుణతో కూడిన దృష్టి, హృదయం ఉండిందో మనం అర్థం చేసుకోవచచ్చు.
మరో సందర్భంలో, "భగవంతుడు ఒక్కటి సరిపోయినట్లయితే, ఆడ, మగ అని రెండు లింగాలను సృష్టించవలసిన అవసరం లేదు" అన్నారు. వివాహానికి ఒక పవిత్రమైన ప్రయోజనం ఉందని, మనిషి మరో మనిషికి జన్మనిచ్చి పునరుత్పత్తి చేయడం మానవాళి పట్ల ప్రతి మనిషి నిర్వర్తించవలసిన ధర్మమని, దైవాన్ని తెలుసుకోటానికి బ్రహ్మచారిగా లేక బ్రహ్మచారిణిగా లేక సన్న్యాసిగా ఉండవలసిన అవసరం లేదని, భగవంతుడు ఆడ, మగలు సృష్టించడానికి ఆయనేమీ మూర్ఖుడు కాదని బోధించేవారు.
ప్రపంచంలో ఉన్న సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నమస్సులు; మీరు అందిస్తున్న సేవలకు సర్వదా కృతజ్ఞతలు; భూమీద జీవితం అంతా నిస్స్వార్థంగా జీవించేటువంటి, నిత్యం దైవత్వాన్ని తలపించేటువంటి మాతృమూర్తులకు ఆశ్రుపూరిత కృతజ్ఞతలు.
ఎక్కడి నుండో ఒక మాణిక్యం తెచ్చారు సార్ ! ఆశ్రుపూరిత కృతజ్ఞతలు అంటూ ఎంత అర్థం వచ్చే విధంగా చెప్పారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండి