31, మార్చి 2024, ఆదివారం

బాబూజీ సందేశమాలిక 5 - సహజ మార్గ పద్ధతి - The System of Sahaj Marg


బాబూజీ సందేశం - సహజ మార్గ పద్ధతి 
(సంస్థ వార్షికోత్సవ సందర్భంగా - 1963)

The System of Sahaj Marg 
(Message at the Annual Function of the Mission 1963)

I may today present before you some of the important features of our system known as Sahaj Marg, or the Natural Path of realisation. The system runs along simplest and most natural lines which are easily adjustable to the ordinary routine of a worldly life. It admits none of the methods of rigid austerity, penance, or physical mortification undertaken with a view to effect the strangulation of the mind  and indriyas. 

The ideology of Sahaj Marg is so plain that often for this very reason it is not so well understood by people who are under the impression that realisation is the most difficult job which requires persistent labour for lives and ages. It may however be difficult those who proceed on, loaded with their own confused conceptions of Reality, and adopt complicated means for their achievement. As a matter of fact Reality, which one aspires for, is so simple that its very simplicity has become a veil to it. A simple thing can be achieved by simple means alone. Therefore, for the realisation of the simple, It is only the simplest means that can ensure success. 

నేను ఈరోజు సహజ్ మార్గ్ లేక ప్రకృతిసిద్ధమైన సాక్షాత్కార పద్ధతి యొక్క ప్రధాన అంశాలను మీ ముందుంచుతున్నాను. మనం నిత్యం అనుభవించే ప్రాపంచిక జీవనానికి తగినట్లుగా తేలికగా, సహజంగా, సరళంగా సర్దుకోగలిగినటువంటి విధానాలలో నడిచేటువంటి పద్ధతి. ఇందులో, మనసును, ఇంద్రియాలను ఇబ్బందిపెట్టే విధంగా ప్రభావితం చేసే  కఠినమైన నిష్ఠలు గాని, తపస్సులు గాని లేక భౌతికంగా హింసపెట్టుకునే పద్ధతులు గాని వేటినీ అనుమతించడం ఉండదు. 
సహజ మార్గ తత్త్వం ఎంత సరళంగా, ఎంత నిష్కపటంగా ఉంటుందంటే, దాని మూలానే, సాక్షాత్కారం అంటే చాలా కష్టమని, ఎన్నో జన్మలు బాగా కష్టపడితే గాని దాన్ని సాధించలేమని భావించేవారికి ఒక పెద్ద అడ్డు తెరగా నిలుస్తుంది. మనసు నిండా, సత్య తత్త్వాన్ని గురించి వాళ్ళ-వాళ్ళ స్వంత అస్పష్ట సిద్ధాంతాలతో సతమతమవుతూ, వాటిని సాధించే క్రమంలో చాలా జటిలమైన పద్ధతులను అవలంబించేవారికి తప్పక ఈ మార్గం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, అందరూ తపించే సత్య తత్త్వం ఎంత సరళమైనదంటే, దాని సరళత్వమే ఒక అడ్డు తెరగా అయిపోతూ ఉంటుంది. సరళమైన వస్తువును సరళమైన మార్గంలోనే సాధించగలం. కాబట్టి సరళమైనదాన్ని సాక్షాత్కరించుకోవాలంటే అతి సరళమైన మార్గాన్నే అవలంబించాలి, అప్పుడే విజయం తప్పక లభిస్తుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...