7, మార్చి 2024, గురువారం

సరైన ధ్యానపద్ధతిని అనుసరిస్తే ఏమి జరుగుతుంది?


హార్ట్ఫుల్నెస్ వంటి ధ్యానపద్ధతిని అనుసరిస్తే ఏమి జరుగుతుంది?

యేదైనా ధ్యానపద్ధతిని, పద్ధతిగా అనుసరించడం అంటే ప్రయత్నపూర్వకంగా ఒక జీవన విధానాన్ని అవలంబిస్తున్నట్లు, ఒక జీవన శైలిని అనుసరిస్తున్నట్లు. జీవిత దృక్పథంలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్లు. రోజు-రోజుకూ మరింత మెరుగైన మానవుడుగా తయారవడానికి ప్రయత్నించడం; జీవిత ప్రయోజనాన్ని తెలుసుకోవడం, అది సిద్ధించడం కోసం తగినటువంటి కృషి చేయడం; మనిషి జన్మను సార్థకం చేసుకోవడం; స్వార్థం తగ్గించుకుంటూ ఇతరులకు ఉపయోగపడేలా జీవించడానికి ప్రయత్నించడం. 

అంతేగాక ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే, మన అస్తిత్వానికి, మన చుట్టూ ఉన్న అస్తిత్వానికి గల మూల కారణాన్ని తెలుసుకోవడం; ఆ పరమాత్మను సాక్షాత్కరించుకోవడం; ఆ మూల తత్త్వంలో లయమైపోవడం. ఇవన్నీ కేవలం నమ్మకాలు, విశ్వాసాలే గాకుండగా, ప్రత్యక్షానుభవం ద్వారా నిజమైన జ్ఞానాన్ని సంతరింపజేసుకోవడం. జీవిత పరమార్థాన్ని ఎవరికి వారు నిజంగా అర్థం చేసుకోవడం, తద్వారా మెరుగైన సమాజానికి దోహదపడటం.
 
కాబట్టి ధ్యానం అనేది కేవలం ఏకాంతంగా చేసే ప్రక్రియ కాదు. ఒక్కరూ చేస్తే, అది కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటే,  సమాజానికి ఏమిటి ప్రయోజనం? అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. గోడలో ఒక్క ఇటుక సరిగ్గా లేకపోయినా గోడ పాడవుతుంది; ఆ ఒక్క ఇటుకను సర్డితే మొత్తం గోడను సరిదిద్దినట్లవుతుంది. అలాగే ఒక్క మానవుడిలో సరైన మార్పు వచ్చినా, దాని ప్రభావం ఆ వ్యక్తిలోనే గాక,  మొత్తం సమాజంలో మనకు తెలియకుండా ఉండి తీరుతుంది.

కాబట్టి ఇటువంటి ధ్యాన పద్ధతిని అనుసరించడం వ్యక్తిగత మానవ కళ్యాణానికి, మానవాళి శ్రేయస్సు మొత్తానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సమూలంగా మారే దిశలో ఉంటేనే సమాజం మొత్తంగా మారే దిశలో ప్రయాణిస్తుంది. 
 


2 కామెంట్‌లు:

  1. మనలో ప్రతి ఒక్కరం ప్రశాంతమైన మనుగడ కొనసాగిస్తూ మన చుట్టూ అటువంటి వాతావరణాన్ని సృష్టించుకో గలుగుతాం.

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...