ధ్యానం అవసరమా?
ఎన్ని సంవత్సరాలు ధ్యానించినా కొన్ని మౌలిక ప్రశ్నలు అప్పుడప్పుడు మన హృదయ తలుపులను తడుతూ ఉంటాయి. మరింత స్పష్టమైన లోతైన అవగాహనను కలిగిస్తాయి. పటిష్ఠమైన సమాధానాలను హృదయాన్ని స్పృశించగలిగే సమాధానాలు కలుగుతాయి. ముఖ్యంగా బాహ్య ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు, బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పుడు ఇటువంటి ప్రశ్నలకు నూతన సమాధానాలను మనసు వెతుక్కుంటూ ఉంటుంది. అటువంటి కొన్ని ప్రశ్నలకు ఆలోచించగా-ఆలోచించగా వచ్చిన సమాధానాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇవి మీకు కూడా ఆసక్తికరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ధ్యానం అంటే ఏమిటో అసలేమీ తెలియని వారికి ధ్యానాన్ని మామూలు భాషలో పరిచయం చేసే సందర్భాలలో తీక్షణంగా ఆలోచించినప్పుడు కలిగిన సమాధానాలు.
ధ్యానం అవసరమా? అని అడిగితే భారత దేశంలో కనీసం అందరూ అవసరమనే చెప్తారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ? అని అడిగితే కూడా ఏదొక సమాధానం ఆత్మవిశ్వాసంతో చెప్పని భారతీయులుండరు - మనశ్శాంతి వస్తుందని, ఏకాగ్రత వస్తుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆలోచనలో స్పష్టత వస్తుందని, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని ఇలా ఎన్నో ప్రయోజనాలను చెప్తూంటారు. అది పిల్లలైనా, పెద్దలైనా. ప్రయోజనాలున్నాయని తెలిసినా కూడా ధ్యానం మన దినచర్యలో ఎందుకు భాగం కాలేదంటే సమాధానం ఉండదు.
ధ్యానం భారతీయ మానసంలో ముఖ్యంగా అంతర్లీనంగా పని చేస్తూనే ఉన్నది. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చేసేదని అందరికీ పుట్టుకతోనే తెలుసు. ఉదాహరణకు, యేదైనా సుదీర్ఘంగా ఆలోచిస్తూంటే కళ్ళు మూసుకుంటాం; ఎ ఆలయానికి వెళ్ళినా దైవాన్ని దర్శించడానికని వెళ్ళి కళ్ళు తెరచి చూడకుండా కళ్ళు మూసేస్తాం; భరించలేని ఒత్తిడితో ఉన్నప్పుడు కూడా, ఉపశమనం కోసం కళ్ళు మూసుకుంటాం; యేదైనా జ్ఞాపకం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుంటాం; యేదైనా ఆస్వాదించాలంటే కూడా కళ్ళు మూస్తాం; బాగా నొప్పి కలిగితే కూడా కళ్ళు మూసేస్తాం; భయం వేస్తే కూడా కళ్ళు మూసుకుంటాం; ఇలా ఇంకా ఎన్నో సందర్భాలలో ప్రతి మనిషి కళ్ళు సహజంగానే మూసుకుంటూ ఉంటాడు. ఇది ఎవరూ మనకు నేర్పించినది కాదు. ప్రకృతే మనకు నేర్పింది. ఇది అందరికీ తెలియకుండానే జరిగిపోయే ప్రక్రియ. ఇలా చేయడం వల్ల మనకు ఒత్తిడి నుండి ఉపశమనం, భయం నుండి ఉపశమనం, మనశ్శాంతి, ఆలోచనలో స్పష్టత, మనసుకు హాయి వంటివి అనుభవంలోకి వస్తాయి. ఇది తెలియకుండా జరిగిపోయే ధ్యానం. ధ్యానం వల్ల తెలియకనే అంతరాత్మతో అనుసంధానం కలగడం వల్ల ఆత్మ గుణమైన శాంతి-ప్రశాంతతలు మనకు కలుగుతున్నాయి.
ప్రస్తుతం మనం ప్రయత్నిస్తున్నది తెలిసి చేసే ధ్యానం.
కృష్ణారావు గారు చక్కగా విశదీకరించారు... అలా కళ్ళు మూసుకోగానే మనం అత్మగతంగా అయి మనకు తెలియకుండానే బిడ్డ తల్లి చాటుకు వెళ్లినట్లుగానే అక్కడే బిడ్డకు సంరక్షణ కలుగుతుంది ఇది సహజంగానే జరిగిపోతుంది అలాగే మనం మన అంతరాత్మ తో మనకు తెలియకుండానే దాని ని చుట్టుకుంటాం. అప్పటికి బయట పడతాం. అబ్బ ! ధన్యవాదాలు... ఇలా మీ అనుభవాలను పంచ్కొవాలని కోరుతూ
రిప్లయితొలగించండి