బాబూజీ సుప్రసిద్ధ ప్రత్యేక వాక్యాలు - 2
బాబూజీ, హృదయం అనే సముద్ర అగాథాల్లో దాగి ఉన్న జ్ఞాన మౌక్తికాలను వెలికి తీసి, అస్సలు వ్యక్తం చేయలేని, అస్సలు భాషలో ఇమడని విషయాలను, అవ్యక్తమైనవాటిని కూడా ప్రత్యేక వాక్య నిర్మాణం ద్వారా అభివ్యక్తం చేయడానికి ప్రయత్నించారు; మాటల్లో వీటిని వర్ణించలేము; మాటలు ఇక సరిపోవు; అని అంటూనే ఎన్నో అద్భుతమైన వాక్యాలను, అటువంటి అలౌకిక స్థితులను సూచించేటువంటి వాక్యాలను మనం తీరిక సమయంలో గాని, పనికట్టుకుని గాని మనన-ధ్యానాలు చేసుకునేందుకు వీలుగా, తద్వారా ఆధ్యాత్మిక లోలోతుల్లోకి తేలికగా వెళ్ళడానికి అవసరమైన ప్రేరణ కలిగించేలా మనకు వదిలి వెళ్ళారు. కాబట్టి జిజ్ఞాసువులు ఈ వాక్యాలను తగు విధంగా మననం చేసుకొని, ధ్యానలోలోతుల్లో వీటి యదార్థ తత్త్వాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. బాబూజీ పలికిన మరిన్ని వాక్యాలు:
He alone who has travelled on the path up to the final point can guide others successfully.
ఎవరైతే ఆధ్యాత్మిక పథంలో చిట్టచివరి వరకూ ప్రయాణించారో, అటువంటివారు మాత్రమే ఇతరులకు విజయం చేకూరే విధంగా మార్గదర్శనం చేయగలుగుతారు.
My definition of Mahatma as a 'non-being person' though somewhat peculiar is meaningful.
మహాత్మా అన్న పదానికి నా నిర్వచనం 'అస్తిత్వ-రహిత వ్యక్తి' అని. ఇది కొంత విచిత్రంగా అనిపించినా అర్థంతో కూడుకుని ఉన్నది.
Our final destination is there where neither air nor light has any access. It is a perfectly lightless place without any motion or activity.
I am however taking you all to that sphere of dreary desolateness which is beyond conception, and which is possibly the last limit of human approach.
మన పరమ గమ్యస్థానంలో గాలికి, వెలుతురుకు కూడా అందుబాటులో లేని చోటు; ఇది అస్సలు వెలుతురు లేని ప్రదేశం; ఎటువంటి కదలిక, ఎటువంటి క్రియలూ లేని ప్రదేశం. నేను మిమ్మల్ని అటువంటి నిర్మానుష్యమైన, ఏమీ లేనటువంటి, ఊహకందనటువంటి లోకానికి తీసుకువెడుతున్నాను; బహుశా అదే మనిషి చేరుకోగలిగే అందుబాటులో ఉన్న అత్యున్నత పరిధి.
Powerlessness includes in itself the idea of power which is there in a stagnant state, just as it is at the Centre. Now the Centre is known to be the source of all power. Powerlessness is the root or the source of power or in a sense the greatest, unlimited power in itself.
శక్తిరాహిత్యంలోనే శక్తి అనే భావం ఉన్నది; కేంద్రంలో ఉన్నట్లుగానే నిద్రాణ స్థితిలో ఉంది. కేంద్రమే అన్నీ శక్తులకు మూలస్థానం. శక్తిరాహిత్యమే శక్తికి మూలం, ఉద్గమ స్థానం లేక అదే ఒక రకంగా అతిగొప్ప అపరిమితమైన శక్తి.
అయ్యా వెతికి, వెతికి మాకు అందించారు.
రిప్లయితొలగించండి