బాబూజీ - లాలాజీ గురించి - 2
అలవాట్లు
ఖరీదైన దుస్తులు వేసుకోవడం వారికిష్టం ఉండేది కాదు; పట్టు బట్టలు చాలా అరుదుగా వాడేవారు. కానీ వారు వేసుకునే దుస్తులు మాత్రం ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి. సాధారణంగా కుర్తాలు, చిక్కాలు, పైజామాలు, ధోవతులు వేసుకునేవారు. అప్పుడప్పుడు కుర్తా మీద ఒక చిన్న కోటు, మోకాళ్ళ వరకూ బొత్తాలున్న కోటు వేసుకునేవారు. రంగు-రంగుల టోపీ పెట్టుకునేవారు; చలికాలం భుజాలపై శాలువా కప్పుకునేవారు. ఆయన ఆభరణాలేవీ ధరించేవారు కాదు.
చిరు తిండ్లంటే వారికి చాలా ఇష్టం ఉండేది. ఉదయం భోజనంలో సాధారణంగా రొట్టెలు, పప్పు, పచ్చడి; రాత్రి భోజనంలో రోట్టేలు, కూర, ఊరగాయ తినేవారు. ఆయన మాంసం గాని, ఐసు గాని, టీ గాని తీసుకునేవారు కాదు. కచోరీ, అరవీ అంటే బాగా ఇష్టపడేవారు.
ఆయన దినచర్య ఎప్పుడూ ఖాళీ లేకుండా ఉండేది. వారెప్పుడూ సూర్యోదయం తరువాత నిద్రపోలేదు. ఆయన అవసరాలు తీర్చుకున్న తరువాత, శుభ్రమైన దుస్తులు ధరించి, తన ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నులైపోయేవారు. అలాగే ఇతరులకు శిక్షణనివ్వడంలో కాలం గడిపేవారు. ఆ తరువాత ఆఫీసుకు వెళ్ళేవారు, ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తరువాత మరలా శిక్షణనిస్తూండేవారు. ప్రతీ రోజూ సాయంకాలం 7, 8 గంటల మధ్య భోజనం చేసేవారు. ఆ తరువాత కొంత సమయం నడకకు వెచ్చించేవారు. తిరిగి వచ్చిన తరువాత మరలా శిష్యులకు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చేవారు. రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమించేవారు. కానీ నిద్ర పోయేవారు కాదు. ఉదయం 2 గంటల వరకూ అందరికీ ప్రాణాహుతి ప్రసరణ చేసేవారు. ఆయన విడిగా వేరే గదిలో పడుకునేవారు; తోటిసాధకులు ఎవరైనా ఉంటే, వాళ్ళను కూడా ఆ గదిలో పడుకోనిచ్చేవారు. అప్పుడప్పుడు గంగా నాడీ తీరాన నడక కోసం వేళ్ళేవారు; తనతో పాటు వారి అతిత్తులను కూడా తీసుకువెళ్ళేవారు. ఒక్కోసారి వాళ్ళను, మార్పు కోసం తీర్థాలకు కూడా తీసుకువెడుతూ ఉండేవారు.
ప్రకృతి, స్వభావం
స్వాభావికంగా ప్రశాంతచిత్తం గలవారు, కానీ ఇతరుల కష్టసుఖాలకు తేలికగా స్పందించేవారు. మధురమైన కంఠస్వరం గలవారు. తన ఆలోచనలను తెలియజేయడానికి తియ్యని భాషను ఉపయోగించి తన శ్రోతల మనసులను గెలుచుకోవడంలో నిష్ణాతులు. కోపం చాలా అరుదుగా వచ్చేది. అనవసరంగా మాట్లాడేవారు కాదు; చాలా తక్కువగా మాట్లాడేవారు; కానీ ఎవరైనా ప్రశ్నలు వేస్తే మాత్రం క్షుణ్ణంగా సంపూర్ణంగా సమాధానాలు చెప్పేవారు; మళ్ళీ వాళ్ళ మనసుల్లో ఆ ప్రశ్నలుండేవి కావు, సందేహాలుండేవి కావు. ఎవరైనా ఆయన చెప్పినది అర్థంచేసుకోలేకపోతే, ఆ వ్యక్తిలో అవసరమైన ఆధ్యాత్మిక స్థితిని, చర్చించుకుంటున్న విషయ జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకువచ్చేవారు.
సాధారణంగా లాలాజీ సాహెబ్ కళ్ళు క్రీడకే దించుకొని ఉండేవారు; బిగ్గరగా నవవేవారు కాదు; కేవలం చిరునవ్వు మాత్రమే ఉండేది. ఆయన చిరునవ్వు మంచితనాన్ని, తియ్యదనాన్ని ప్రకటించేది, వారి ఆధ్యాత్మిక చురుకుదనం వల్ల ఇతరుల ముఖాల్లో వెలుగును నింపేది. మానవాళిని గొప్పగా ప్రేమించే వ్యక్తిత్వం, ప్రేమతో వారికి ఎవరైనా ఇచ్చిన వస్తువులను తరచూ ఉపయోగిస్తూ ఉండేవారు, వారికి వ్యక్తిగతంగా వాటి పట్ల అయిష్టత ఉన్నా లేకున్నా కూడా. ముఖాస్తుతిని ద్వేషించేవారాయన. ఆయన అనుచరులందరినీ వాళ్ళల్లో ఉన్న దోషాలతో సహా స్వీకరించినా కూడా, క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవారు. లాలాజీ కఠినమైన క్రమశిక్షణను ప్రేమతో అమలుపరచడంలో ఎప్పుడూ విఫలమవలేదు.
తన సోదరులకు, శిష్యులకు శిక్షణనివ్వడం కోసం తన గృహస్థ ధర్మాలను చాలా బాగా నిర్వర్తించేవారు. పెద్దలను గౌరవించేవారు, నమస్కరించేవారు, తన వేయసువారి పట్ల చిన్నబుచ్చకుండా వినమ్రంగా ఉండేవారు, తన కంటే చిన్నవారి పట్ల ప్రేమతో మెలగేవారు.
అల్పాహారం ఆయనకు అలవాటు ఉండేది కాదు, పొగతరాగేవారు కాదు. జూదం గాని పేకాట గాని ఆడటం ఆయనకిష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు హార్మోనియం వాయించేవారు.
(సశేషం ... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి