హార్ట్ఫుల్నెస్ సంస్థ
సహజమార్గ
ధ్యాన యౌగిక ప్రక్రియలు
ఉచితంగా ధ్యానం
నేర్చుకోండి
రోజురోజుకీ ఒత్తిడి తగ్గించుకుంటూ, రోజురోజుకూ
మనశ్శాంతిని పెంచుకుంటూ, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని జీవన సార్థక్యం సాధించుకునే హార్ట్ఫుల్నెస్ జీవన విధానాన్ని అనుసరించండి. ప్రాపంచిక,
ఆధ్యాత్మిక పార్శ్వాలను మేళవిస్తూ సమర్థవంతంగా జీవించండి.
అంతే కాదు, ఆధ్యాత్మిక చక్రాల ద్వారా జరిగే ఆత్మ యొక్క చైతన్య వికాస యాత్రను, మన మోక్ష యాత్రను అనుభవపూర్వకంగా ఈ సంస్థ అధ్యక్షులు, గురుదేవులైన పూజ్య దాజీ మార్గదర్శనంలో తెలుసుకోండి.
ధ్యానానుభూతి పొందాలనుకున్నవారు, ఎవరి విధిని వారు రూపకల్పన
చేసుకోవాలనుకున్నవారు, పరిపూర్ణత సాధించాలనుకున్నవారు, నిజమైన వ్యక్తిత్వ వికాసం
కావాలనుకున్నవారు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు, అంతరంగ మార్పును శాశ్వతమైన పరివర్తనను
కోరుకునేవారు, ప్రతి రోజూ తమకు
తాము ఒక గంట సేపు ధ్యానానికి వెచ్చించగలవారు, అందరూ ఈ సరళమైన హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతికి
ఆహ్వానితులే .
ధ్యానం ప్రారంభించడానికి గల అర్హతలు: 15
సంవత్సరాల వయసు దాటి, ఎటువంటి మానసిక
రుగ్మతలు లేని వారు, తమనుతాము
మార్చుకోవాలనుకున్నవారు సగటు ఆధ్యాత్మికాభిలాషులెవరైనా సాధన చేయడానికి సంసిద్ధులైతే
చాలు.
సాధన
ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ కరపత్రం చివరనున్న నెంబర్లను సంప్రదించగలరు.
మా ట్రైనర్ల ద్వారా ఇతర వివరాలు తెలుసుకోగలరు. లేక
heartfulnessApp అనే
మొబైల్ ఆప్ ను playstore ద్వారా డౌన్లోడ్ చేసుకుని కూడా సంప్రదించవచ్చు.
శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలు లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థలు. వీటి ఉనికి 160 దేశాలలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 15000 కు పైగా స్వచ్ఛంద సేవగా ఉచితంగా 24 గంటలూ సేవలనందిస్తున్న ట్రైనర్లున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం రంగారెడ్డి జిల్లాలోని, నందిగామ మండలంలో కాన్హా శాంతి వనం అనే పేరుతో లక్ష మంది ఒకేసారి ధ్యానం చేసుకోగలిగే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఉంది. వివరాలకు ఈ క్రింది వెబ్ సైటును కూడా సంప్రదించవచ్చు:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి