శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థాపన,
షాజహానుపూర్ - సహజమార్గ పద్ధతి జన్మస్థలి,
- బాబూజీ మాటల్లో
శ్రీరామచంద్ర మిషన్ మార్చ్ 31, 1945 న సహాజహానుపూర్ లో పూజ్య లాలాజీ పేరున (శ్రీరామ చంద్ర), నా ద్వారా, ఆయన అనుగ్రహం వల్ల, స్థాపించడం జరిగింది. నెమ్మదీనెమ్మడిగా అన్నీ వైపుల నుండి యదార్థ సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసువులు ఆకర్శింపబడుతూ ఉన్నారు. మాస్టర్ కృప ఈ విషయంలో బాగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. జనం వారి అనుగ్రహం నుండి ప్రయోజనం పొందడానికి ఆకర్షితులవుతున్నారు.
సంస్థలో ప్రస్తుతం అనుసరింపబడే ఈ సహజ మార్గ ధ్యాన పద్ధతి ఆ పరతత్త్వాన్ని చేరుకోడానికి తేలికైన, సరళమైన ఆధ్యాత్మిక పథాన్ని అందిస్తున్నది. నిత్యజీవితంలో మనిషి ప్రత్యక్షంగా అవలంబించలేని పచ్చి పద్ధతులను సూచించకుండా సరళమైన మార్గాన్ని సూచిస్తున్నది. సహజ మార్గ ఆధ్యాత్మిక శిక్షణలో ఇంద్రియాలను సహజమైన రీతిలో క్రమబద్ధం చేసి మూల పరిశుద్ధ స్థితికి తీసుకువస్తుంది; అంటే మొట్టమొదటిసారి మానవ రూపం సృష్టింపబడినప్పుడు ఎలా ఉండేవాడో మనిషి, సరిగ్గా అటువంటి మూలస్థితికి తీసుకువస్తుంది సహజ మార్గం. అంతే కాదు, స్వతంత్రంగా వ్యవహరించే నీచ వృత్తులను అధిచేతన నియంత్రణలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి విపరీత చర్యలు ఆగిపోతాయి. ఉన్నత కేంద్రాలు దివ్య కేంద్రాల అధీనంలోకి వచ్చేస్తాయి, ఈ విధంగా మొత్తం శరీర వ్యవస్థ అంతా దివ్యీకరింపబడటం ప్రారంభమవుతుంది.
ఈ సాధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, మనిషి సాధారణ జీవన గడుపుతూ కూడా, తన విధులను, బాధ్యతలను తగిన విధంగా నిర్వహిస్తూ కూడా - తన జజీవితంలోని రెండు పార్శ్వాలను - ప్రాపంచిన, పారమార్థిక పార్శ్వాలను సమానంగా ప్రకాశించేలా పెంపొందించుకోవచ్చు. మహానీయుడైన మాస్టర్ ముందుంచిన ఈ ఆదర్షాన్ని, కొత్తగా పరిచయమైన సహజ మార్గ పద్ధతి ద్వారా వ్యాపింపజేయడం, నిద్రావస్థలో ఉన్న మానవాళిలో దివ్యచేతనాన్ని జాగృతం చేసి, తద్వారా వారిని ఆధ్యాత్మిక ప్రగతిపథం వైపుకు నడిపించడమే ఈ సంస్థ ఆశయం. ఈ ప్రయోజనం సిద్ధించాలంటే, బలవంతంగా కఠినంగా చేసే తపస్సులతో కూడిన, పాత యాంత్రిక పద్ధతులను, ఆధునిక సమయానికి అస్సలు అనుకూలంగా లేనటువంటి పద్ధతులను విడనాడి, తప్పనిసరిగా ప్రక్కన పెట్టి, వాటి స్థానంలో సరళమైన, సహజమైన మార్గాలను అనుసరించడం అత్యవసరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి