గురువు లేక మాస్టర్ - 1
బాబూజీ ప్రకారం నిజమైన మాస్టర్ అంటే ఆ పరతతత్వమే, ఆపరమాత్మే. భూమిపై అవతరించిన మాస్టర్లందరూ ఆ పరతత్త్వం యొక్క ప్రతినిధులు మాత్రమే.
దుర్లభం త్రయం యేవ యేతద్ దేవానుగ్రహ హేతుకమ్ |
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః ||
- వివేకచూడామణిలో ఆదిశంకరులు
తాత్పర్యం:
మానవ జన్మ, మోక్షం కోసం తపన, మహాపురుషుడు, అంటే సమర్థుడైన గురువు యొక్క ఆశ్రయం - ఈ మూడూ చాలా దుర్లభం అంటారు ఆదిశంకరులవారు.
సంస్కృత భాషలో 'గు' అంటే అంధకారం, ఆవిద్యా, అజ్ఞానం. 'రు' అంటే ఆధ్యాత్మిక ప్రకాశంతో అంధకారాన్ని పోగొట్టేవాడు. కాబట్టి 'గురు' అంటే ఆధ్యాత్మిక వెలుగుతో అజ్ఞానాన్ని పోగొట్టేవాడని అర్థం.
సహజమార్గంలో గురువు ప్రాముఖ్యత
సహజ మార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతిలో గురువును మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే కేవలం ఆచార్యుడో లేక బోధించేవాడో మాత్రమే కాదు. మాస్టర్ అంటే కేవలం మార్గదర్శకుడు మాత్రమే కాదు. భగవంతునికి, మనిషికీ మధ్య వారధి గురువు అంటే.
మాస్టర్ అంటే గమ్యాన్ని చేరుకునున్నవాడు; ఆ మార్గం గుండా పైకి-క్రిందకీ ఎన్నో మార్లు ప్రయాణించినవాడు; మన చేయిపట్టుకుని మనం ప్రస్తుత స్థితి నుండి చేరవలసిన గమ్యం వరకూ తీసుకు వెళ్ళగలిగే సమర్థుడు. మాస్టర్ అంటే ఉదాహరణగా జీవించేవాడు; మాస్టర్ అంటే ప్రాణాహుతి ప్రసరణ చేయగలిగినవాడు. మాస్టర్ అంటే మనలో క్రమశిక్షణ పెంపొందించగలిగేవాడు; మాస్టర్ అంటే పరిపూర్ణతను సిద్ధించుకున్న మహనీయుడు; మాస్టర్ అంటే మానవ స్థాయి నుండి అతీతంగా దైవిక స్థాయికి చేరుకున్న మహానుభావుడు; పరిశుద్ధ హృదయుడు.
సహజ మార్గ పద్ధతిలో మాస్టర్ తమలాగే ఇతరులను కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. మాస్టర్ అంటే అన్నీ విధాలా తనపై తాను పట్టు సంపాదించుకున్నవాడు; మాస్టర్ అంటే స్వచ్ఛమైన ప్రేమ తత్త్వము, ప్రేమ స్వరూపుడు; మాస్టర్ నిస్వార్థ సేవకుడు, తనను తాను పట్టించుకోకుండా ఆవిశ్రాంతంగా నిరంతరమూ సేవలనందించేవాడు. మాస్టర్ లేనిదే సాధకునిలో ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవడమే సాధ్యం కాదు. సహజ మార్గంలో అభ్యాసి పాత్ర కంటే మాస్టర్ పాత్రే అధికం; కానీ అభ్యాసి సహకారం లేనిదే వారి ప్రయత్నం సరిగ్గా నెరవేరదు. సహజ మార్గ మాస్టర్లు తయారు చేసేది శిష్యులను కాదు, తమ వంటి మాస్టర్లను తయారు చేస్తారు.
Beautiful. (Master also adds the real Master is God alone.)
రిప్లయితొలగించండిగూగులమ్మ కామెంట్ అంటుంది.... కాని ఇంకా నే నే మి చెప్పను ! అంతా చెప్పేశారు. తరువాతి బ్లాగు కోసం ఉత్ఖంతటతో వేచిఉండడం తప్ప ! మరో ముత్యం కోసం !!
రిప్లయితొలగించండి