8, ఫిబ్రవరి 2024, గురువారం

బాబూజీ - లాలాజీ గురించి - 7

 


బాబూజీ - లాలాజీ గురించి - 7 

లాలాజీలో నిజమైన మహానీయుడి లక్షణాలు, పరిపూర్ణ వ్యక్తిత్వ లక్షణాలున్నాయి. 

కేవలం ఏడు మాసాల స్వల్ప కాలంలోనే లాలాజీ పరిపూర్ణత్వాన్ని సాధించడం మహాద్భుతం కాదా? ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన శరీర వ్యవస్థలో అంతరంగం  మొత్తం అంతా కూడా దివ్యకాంతిగా పరివర్తన చెందింది; ఆయన చేతన,  చేరుకోగలిగిన అన్ని స్థితులనూ చేరుకుంది; అందుకోగలిగిన అన్ని శిఖరాలను  అందుకుని, వాటికి అతీతంగా కూడా దాటి వెళ్ళి, ఏ స్థితీ లేని స్థితికి  చేరుకుంది. 

ఈ విశిష్ఠ వ్యక్తిత్వం (స్పెషల్ పర్సనాలిటీ), ఈ ప్రకృతి వరప్రసాదం, ఈ పరతత్త్వం, మానవాళి ఎప్పుడో మరచిపోయిన ప్రాణాహుతి ప్రసరణ విద్యని, కళను, ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రాణస్య ప్రాణః, అనే విద్యను పునరుద్ధరించి, ఆధ్యాత్మిక శిక్షణలోనే ఒక వినూత్న ఆధ్యాత్మిక పద్ధతిని ఆవిష్కరించారు; ఇందులో ఆధ్యాత్మిక సాధకుల బాధ్యతలన్నీ ఇంచుమించుగా పూర్తిగా తొలగించేయడం జరిగింది. 

కేంద్రము లేక దైవం ఎక్కడున్నదీ, సుప్రా కాస్మిక్ క్షేత్రాన్ని దాటి ఒక క్షేత్రాన్ని, సెంట్రల్ రీజియన్ (కేంద్ర క్షేత్రం) ఆవిష్కరించడం, మనిషి చేరుకోగలిగిన చిట్టచివరి స్థితియైన తమ్ ను కనుగొనడం, ఇదంతా కూడా ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతకు పూర్వం అందుబాటులో లేని జ్ఞానం. ఈ ఆవిష్కరణలు, అటు మేధావులకు, ఇటు ఆధ్యాత్మిక సాధకులకు కూడా ఒకేలా మెదడుకు మేత వలె  పరిణమించాయి.

 దైవసంకల్పానికి అనుగుణంగా జీవించగలిగే సామర్థ్యం లాలాజీలో ఎలా ఉండేదో ఒక ఉదాహరణ. ఆయన చివరి రోజుల్లో కాలేయంలో ఒక వ్రణంతో బాధపడుతూ ఉండేవారు. ప్రకృతి వైద్యం తీసుకుంటూ ఉండేవారు. ఆయన శిష్యులలో ఒకరైన శ్రీ పండిత్ రామేశ్వర ప్రసాద్ మిశ్రా గారు కాలేయంపై బాహ్యంగా మట్టితో పిండికట్టు కట్టేవారు. లాలాజీ అంత తీవ్రమైన బాధకు లోనవుతూ ఉంటే చూడలేక, కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన కన్నీరు చూసి, లాలాజీ, "నేను తలచుకుంటే ఈ బాధను క్షణాల్లో తొలగించేసుకోగలను, కానీ ఇది దైవసంకల్పం, కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి" అన్నారు. 

లాలాజీ మితానికి, సహనానికి, భక్తికి మూర్తీభవించిన వ్యక్తిత్వం; అస్సలు అహం అనేది ఉండేది కాదు. వారితో ఒక నూతన శకం ప్రారంభమయ్యింది, యౌగిక ప్రాణాహుతితో కూడిన ఆధ్యాత్మిక శిక్షణ ప్రారంభమయ్యింది; అందులో వారు దిట్ట. ఒక్క చూపుతోనే ఎవరినైనా పరిపూర్ణంగా మార్చగలిగేవారు. మనిషి ఒక్క జన్మలోనే పరిపూర్ణతను సాధించవచ్చన్న పరిస్థితిని సాధ్యం చేసింది ఆయనే - ఇంకా చెప్పాలంటే ఒక్క జన్మలో కొంత భాగంలోనే సాధ్యం అన్నారు, సాధారణ గృహస్త జీవనం గడుపుతూ. ఆధ్యాత్మిక శిక్షణను కాలం యొక్క అవసరాలకు అనుగుణంగా, చాలా మేరకు సరళీకరించడం చేశారు లాలాజీ. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...