ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
24, ఏప్రిల్ 2024, బుధవారం
బాబూజీ మాటల్లో - మన సంస్థ యొక్క ప్రధాన ప్రయోజనం - The main purpose of our Mission in Babuji's Words
బాబూజీ సందేశమాలిక 35 - ప్యారిస్ ప్రకటన - ఆఖరి సందేశం - Paris Declaration - Last Message
బాబూజీ సందేశమాలిక 34 - స్మరణ, శరణాగతి, తీవ్ర తపన - సూరత్ సందేశం - Remembrance, Surrender, Yearning- Message at Surat
23, ఏప్రిల్ 2024, మంగళవారం
బాబూజీ సందేశమాలిక 33 - బసంత పంచమి షాజహాన్ పూర్ 1982 - Basant Panchami Shahajahanpur 1982
బాబూజీ సందేశమాలిక 32 - జీవిత గమ్యం - మలేషియా సందేశం 1981 - The Goal of Life - Message Malaysia 1981
22, ఏప్రిల్ 2024, సోమవారం
బాబూజీ సందేశమాలిక 31 - దక్షిణాఫ్రికా సందేశం - Message at South Africa
బాబూజీ సందేశమాలిక 30 - కేవలం ఒక్కటే మార్గం - మ్యూనిక్ సందేశం, జర్మనీ - Only One Way - Message in Munich , Germany
బాబూజీ సందేశమాలిక 29 - 81 వ జన్మ దినోత్సవం ఢిల్లీ - 81 st Birth Anniversary Delhi
20, ఏప్రిల్ 2024, శనివారం
హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ భండారాలు - ఆధ్యాత్మిక సమావేశాలు
హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ భండారాలు
ఆధ్యాత్మిక సమావేశాలు
భండారా అంటే ఏమిటి?
భండారా అంటే ఆధ్యాత్మిక శక్తితో నిండిన భాండాగారం
అని అర్థం.
ఇందులో పాల్గొన్నవారికి విశేష ఆధ్యాత్మిక కృప
లభించే అవకాశం ఉంటుంది.
సరళంగా చెప్పాలంటే భండారా అంటే పెద్ద ఎత్తున జరిగే
ఒక ఆధ్యాత్మిక సమావేశం
ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి
ఉంది.
సాధారణంగా ఒక మహానీయుడి, అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క జన్మదినోత్సవాన్ని, ఆయన దివ్య స్మరణలో జరుపుకుంటారు.
ఇది సాధారణంగా మూడు రోజుల పాటు ఉంటుంది.
మధ్య రోజున అసలు పుట్టిన దినం ఉంటుంది.
ఈ మూడు
రోజుల్లో ఈ మహానీయుని అనుసరించేవారందరూ సకుటుంబ సమేతంగా భండారా జరిగే చోటకు వచ్చి
వారి స్మరణలో గడుపుతారు.
భండారాల్లో కొంతమంది అన్నదానం చేస్తారు, లంగర్ అంటారు, కలిసి భజనలు, ప్రవచనాలు, ధ్యానాలు చేస్తారు.
హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ భండారాలు
హార్ట్ఫుల్నెస్, శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థల్లో భండారాలు, మన ఆది గురువైనటువంటి పూజ్య లాలాజీ సమయం నుండి జరుగుతూ ఉన్నాయి.
ఆ తరువాత పూజ్య బాబూజీ, ఆ తరువాత పూజ్య చారీజీ, ఇప్పుడు పూజ్య దాజీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం మన సంస్థలో లాలాజీ జయంతి, బాబూజీ జయంతి, చారీజీ జయంతి, దాజీ జన్మదినోత్సవం నాడు ఈ భండారాలు జరుగుతూ ఉంటాయి.
ఇంతకు పూర్వం దేశంలో వివిధ నగరాల్లో జరుగుతూ
ఉండేవి. ఇప్పుడు అన్ని భండారాలు హైదరాబాదులోని, కాన్హా శాంతి వనంలోనే జరుగుతున్నాయి.
పూజ్య దాజీ ఈ మధ్య ఆరునెలలకొక భండారా జరుపుతామని
ప్రకటించడం జరిగింది. మొదటి ఆరు నెలల్లో,
బసంత్
పంచమి నాడు లాలాజీ, బాబూజీల జయంతులు, రెండవ ఆరునెలల్లో, చారీజీ, దాజీ జన్మదినోత్సవాలు సెప్టెంబరులో జరుపబోతున్నారు.
భండారాలో ఏం చేస్తారు?
ఇటువంటి భండారాల్లో ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. దీని ప్రభావం రానున్న రోజుల్లో ప్రతి అభ్యాసి తన జీవితంలో ఆధ్యాత్మిక పరిణతి రూపంలో అనుభవంలోకి రావడం గమనించడం జరుగుతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి.
భండారా అనేది సాధారణంగా ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సుగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.
భండారా ప్రధాన రోజుకు ముందు రోజు సాయంకాలం
ప్రారంభమై, మూడవ రోజు ఉదయంతో ముగించడం
జరుగుతుంది.
ఇక్కడ అభ్యాసీలందరూ కలిసి కూర్చొని నాలుగు పూటలా
ధ్యానం చేసుకుంటారు; ఈ ధ్యానాన్ని పూజ్య
గురుదేవులు దాజీ నిర్వహిస్తారు.
భండారా సందేశాన్ని విడుదల చేయడం జరుగుతుంది.
కొత్త గ్రంథాలు ఏమైనా ఉంటే విడుదల చేయడం
జరుగుతుంది.
సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవచ్చు. ఉదయం
భజనలు కొంత మంది అభ్యాసులు ఆలపించవచ్చు.
భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఈ
మూడు రోజులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
భండారా ప్రాముఖ్యత
భండారా అనేది ప్రతి అభ్యాసికి తన గురువు పట్ల
ప్రత్యేకంగా నిశ్శబ్దంగా తన హృదయంలోనే కృతజ్ఞతను వ్యక్తం చేసే అవకాశం. ప్రత్యేకంగా
ఎవరి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామో,
వారి
జీవితాన్ని నిజంగా తమ హృదయంలో స్మరించుకోవాలసిన సందర్భం.
అభ్యాసి ఇప్పటి వరకూ తన ఆధ్యాత్మిక యాత్ర ఎక్కడి వరకూ వచ్చింది, సాధన యే విధంగా కొనసాగుతున్నది సరి చూసుకోవడం; చేసిన పొరపాట్లను గుర్తించడం; రానున్న రోజుల్లో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడం; శీలనిర్మాణ విషయాన్ని ప్రత్యేకంగా ఏకాంతంగా బేరీజు
వేసుకోవడం; వంటి ఆత్మావలోకనం డైరీలో
వ్రాసుకుంటూ గడపవచ్చు.
స్వచ్ఛంద సేవలనందిస్తూ ఇతరుల సేవలో ఉండటంలో కలిగే ఆనందాన్ని
ఆస్వాదిస్తూ, గురువు పట్ల కృతజ్ఞతను హృదయంలో
అనుభూతి చెందే ప్రయత్నంలో ఉండవచ్చు;
అనుభవజ్ఞులను సంప్రదించి, సూక్ష్మాలు తెలుసుకోవడం; భండారా సందేశాన్ని పదే పదే చదివి, మూడు రోజులూ గురుదేవుల
సందేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయడం.
రకరకాల స్థానాల నుండి, దేశాల నుండి వచ్చిన అభ్యాసులతో కలుసుకుంటూ
సోదరభావాన్ని పెంచుకోవడం చేయవచ్చు.
పైవి గాకుండగా ఆధ్యాత్మిక పురోగతి దిశగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి
తోడ్పడే యే కార్యక్రమాలనైనా అనుసరించవచ్చు.
భండారాల్లో ధ్యానాల ప్రత్యేకత
పూజ్య దాజీ నిర్వహించే యే ఒక్క ధ్యానంలో పాల్గొనడం మానరాడు. అన్నీ ధ్యానాల్లో పాల్గొనాలి.
ఈ ధ్యానాలు చాలా ప్రత్యేకమైనవి; ఈ ధ్యానాలు దైవకృప
అమితంగా వర్షించేటువంటి సందర్భాలు.
కృప అంటే మనకు అర్హత లేకపోయినా కలిగే ఆధ్యాత్మిక
ప్రయోజనం. అటువంటి కృప మెండుగా ఈ మూడు రోజులూ వర్షిస్తుంది. కనుక ఈ ప్రాంగణం వదిలి ఎక్కడికీ వెళ్ళరాదు, ఈ మూడు రోజులూ.
భండారా పూర్తయిన తరువాత నేరుగా ఇంటికి వెళ్ళాలి; వెళ్ళిన తరువాత సాధ్యమైనంత ఎక్కువగా ఇంట్లో ధ్యానించాలి; అప్పుడే భండారాల్లో ధ్యానాల్లో కలిగిన ఆధ్యాత్మిక స్థితులు
జీర్ణమై మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడటం జరగడం, అందరూ అనుభూతి చెందవచ్చు.
భండారాలకు వచ్చే ముందు కూడా ప్రిసెప్టర్ల వద్ద
సాధ్యమైనన్ని ఎక్కువ సిట్టింగులు తీసుకుని రావడం మంచిది; అలాగే రోజూ చేసే సాధన క్రమం తప్పకుండా చేసి రావడం మంచిది. సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయోజనం
పొందాలంటే ఇది చాలా అవసరం.
అభ్యాసిగా భండారాలో యే విధంగా గడపాలి?
పైన చెప్పిన భండారా ప్రాముఖ్యతను దృష్టిలో
పెట్టుకుని మెలగాలి.
క్రమశిక్షణ కలిగి ఉండాలి.
దాజీ కనిపిస్తే దూరం నుండే మనసులో నమస్కారం
చేసుకోవాలి; వారి దృష్టిని ఆకర్షించే
ప్రయత్నం చేయవద్దు.
అక్కడున్న పచ్చదనాన్ని ప్రతి ఒక్కరికీ కాపాడవలసిన బాధ్యత ఉంది.
వలంటీర్లతో సహకరించే ప్రయత్నం చేయాలి.
వాద-వివాదాలు, బిగ్గరగా మాట్లాడటం
మానుకోవాలి; ఎక్కడి పడితే అక్కడ చెత్త పారవేయకుండా
సహకరించాలి. పరిశుభ్రతను సంరక్షించాలి; భోజనం అవసరమైనంత
వేయించుకోవాలి; ఆహారం వృథా చేయరాదు; నీరు పొదుపుగా వాడాలి;
వాష్ రూముల్లో ఎక్కువ సమయం గడపరాడు; బట్టలు ఉతకరాదు; వెనుక చాలా మంది వేచి
ఉన్నారన్న ధ్యాసతో పనులు ముగించుకోవాలి.
అభ్యాసి దృష్టి అంతా కూడా అంతర్ముఖమై ఉండాలి. ఎన్ని
సిట్టింగులు అవసరమైతే అన్ని సిట్టింగులు తీసుకోవచ్చు. సత్సంగాల ముందు, తరువాత కూడా.
అనుభవజ్ఞులతో చర్చించి సందేహ నివృత్తి చేసుకోవచ్చు.
బాబూజీ సందేశమాలిక 28 - జీవితం - 80 వ జయంతి అహమ్మదాబాదు - Life - 80 th Birth Anniversary Ahmedabad
బాబూజీ సందేశమాలిక 27 - 79 వ జన్మదినోత్సవం బెంగుళూరు - 79 th Birth Anniversary Bangalore
19, ఏప్రిల్ 2024, శుక్రవారం
బాబూజీ సందేశమాలిక 26 - సత్సంగ భవన ప్రారంభోత్సవం, టిన్సుకియా - Satsangh Bhavan Inauguration Tinsukia
బాబూజీ ప్రపంచానికిచ్చిన కానుక - దాజీ - బాబూజీ మహాసమాధి రోజు
బాబూజీ మహాసమాధి రోజు
(19 ఏప్రిల్ 2019 )
వీడియో కోసం ఇక్కడ క్రింద క్లిక్ చెయ్యండి 👇
Babuji's Mahasamadhi Day - Babuji's Gift
“This day happens to be our Pujya Babuji’s punya thithi [sacred ceremony]. It is the day he decided to enter the higher worlds. I am not using The Brighter World name deliberately, because there is something higher than The Brighter World, and those are the realms he belongs to.
What makes his life so special, at least for us? What do we learn from his life? Can we reflect on his life? When we read some of his literature, his autobiography, it reflects total dedication, single-pointed dedication to his Master. He did not crave for liberation; he did not crave for anything else. He had a single focus. His life also exemplifies absolute surrender, resulting in merger and perfect identicality with his Guru. Often it is misunderstood that merger is everything. But his life shows there is something beyond merger – attaining perfect identicality and still going further. No words can describe the states coming after total identicality.”
ఈ రోజు బాబూజీ మహారాజ్ పుణ్యతిథి. ఆయన ఉన్నత లోకాలకు తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్న రోజు. నేను బ్రైటర్ వరల్డ్ అనే పదం కావాలనే ఉపయోగించడం లేదు, ఎందుకంటే బ్రైటర్ వరల్డ్ కంటే ఉన్నత లోకాలున్నాయి గనుక. ఆయన ఆ లోకాలకు చెందినవాడు.
ఆయన జీవితం మనకు కనీసం, ఎందుకు అంత ప్రత్యేకమైనది? మనం ఆయన జీవితం నుండి ఏమిటి నేర్చుకోవాలి? ఆయన జీవితం గురించి మనం మననం చేసుకోగలమా? ఆయన సాహిత్యం కొంతవరకూ చదివినట్లయితే, ఉదాహరణకు ఆయన స్వీయ చరిత్ర చదివితే ఆయన తన మాస్టర్ పట్ల పూర్తి అంకితభావంతో, ఏకాగ్ర చిత్తంతో జీవించినట్లు తెలుస్తుంది. ఆయన మోక్షం కోసం తపించలేదు; మరి దేని కోసమూ ఆయన తపించలేదు. ఆయన దృష్టి అంతా ఒకే ఒక్క విషయంపై కేంద్రీకృతమై ఉండేది. ఆయన జీవితం సంపూర్ణ సమర్పణభావాన్ని ప్రతిబింబిస్తుంది; ఫలితంగా తన గురువుతో సంపూర్ణంగా లయమైపోయి, ఐక్యం సాధించడం జరిగింది. సాధారణంగా లయావస్థ సర్వస్వం అనుకుంటారు. కానీ ఆయన జీవితం లయావస్థను దాటి కూడా యేదో ఉందనిపిస్తుంది. గురువుతో సంపూర్ణ ఐక్యం పొందిన తరువాత కూడా ఇంకా ముందుకు సాగడం. సంపూర్ణ ఐక్యం తరువాత కూడా ఉన్న ఆధ్యాత్మిక స్థితులను మాటల్లో అసలు వర్ణించలేం.
18, ఏప్రిల్ 2024, గురువారం
బాబూజీ సందేశమాలిక 25 - 78 వ జన్మదినోత్సవం మదురై - 78 th Birthday Celebrations Madurai
17, ఏప్రిల్ 2024, బుధవారం
బాబూజీ సందేశమాలిక 24 - బెంగుళూరు యోగాశ్రమ ప్రారంభం - Inauguration of Yogashram at Bagalore
16, ఏప్రిల్ 2024, మంగళవారం
బాబూజీ సందేశమాలిక 23 - షాజహానుపూర్ ఆశ్రమ ప్రారంభం - Shajahanpur Ashram Inauguration
బాబూజీ సందేశమాలిక 22 - 75 వ జన్మదినోత్సవం హైదరాబాద్ - 75 th Birthday Celebrations Hyderabad
బాబూజీ సందేశమాలిక 21 - లాలాజీ మహారాజ్ శతజయంతి - Birth Centenary of Laalaji Maharaj
15, ఏప్రిల్ 2024, సోమవారం
బాబూజీ సందేశమాలిక 20 - మద్రాసు సందేశం - Message at Madras
బాబూజీ సందేశమాలిక 19 - యోగాశ్రమ ప్రారంభం - చెన్నపట్టణ - Opening of Yogashram Chennapatna
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...