15, మార్చి 2024, శుక్రవారం

షికాగో - పార్లమెంట్ ఆపఫ్ రెలీజియన్స్ - సర్వమత సమ్మేళనం 1893

 



                షికాగో - పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్                     సర్వమత సమ్మేళనం 1893 

ప్రపంచంలో మొట్టమొదటి సర్వమత సమ్మేళనం 1893 లో అమెరికాలోని షికాగో నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనం జగద్విదితం కావడానికి హిందూమతం తరఫున, భారతదేశ సంస్కృతికి ప్రతినిధిగా స్వామి వివేకానంద వెళ్ళి మొత్తం విశ్వాన్నే ఆలోచింపజేసే ప్రసంగాలు ఇవ్వడం మనందరికీ తెలిసినదే. 

ఈ 1893 సమ్మేళనంలో స్వామీజీ మతమౌఢ్యాన్ని అంతం చేయాలని, ప్రతీ మతం, ప్రతీ ఆధ్యాత్మిక పథమూ, బావిలో కప్పలా తానే గొప్పదన్న భావనలను వీడాలని, ఒకర్నొకరు భరించడం గాక, ఒకర్నొకరు మనస్ఫూర్తిగా స్వీకరించగలగాలని గొప్ప పిలుపునివ్వడం జరిగింది. 

స్వామీజీ అందించిన ఆలోచనలను ఇప్పటికీ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం; ఇంకా మతయుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి; అశాంతి పెరుగుతూనే ఉంది. మనశ్శాంతి లేకుండా సామరస్యం ఎలా ఉంటుంది? 

ఈ నేపథ్యంలో 130 సంవత్సరాల తరువాత మరల ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి సమావేశం జరగడం కొనియాడదగ్గది. ఇప్పటికైనా అర్థం చేసుకుని, జీర్ణించుకుని, ప్రతీ మానవుడు తన వ్యక్తిగత మనశ్శాంతి ద్వారా ప్రపంచశాంతికి తోడ్పడాలని ప్రార్థిద్దాం, కలిసి కృషి చేద్దాం. పరస్పరం గౌరవించుకుందాం, పరస్పరం ఒకర్నొకరం భరించడం కాదు, అంగీకరిద్దాం. 

1 కామెంట్‌:

  1. తప్పకుండా ! ఇప్పుడున్న తరం, రాబోయే తరాలు ఇదే విషయం మీద తర్జన భర్జనలు చేసుకుంటున్నాయి. ఏవిధంగా శాంతియుతమైన, సామరస్యపూరితమైన ఒ క కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలం అని ? ఈ పిలుపు అందుకు నాంది అవు గాక !

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...