బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 25
సహజమార్గ యాత్ర - క్షేత్రాలు, వలయాలు, బిందువులు
పూజ్య బాబూజీ 5 ప్రధాన గ్రంథాల్లో 3 గ్రంథాల్లో ఈ యాత్రను గురించి ఉల్లేఖించడం జరిగింది - Reality at Dawn (సత్యోదయం), Efficacy of Raja Yoga in the light of Sahaj Marg (సహజ మార్గ దృష్ట్యా రాజ యోగ ప్రభావం), Towards Infinity (అనంతం వైపు).
సత్యోదయంలో కేంద్రాన్ని చేరడానికి 23 వలయాలు దాటాలని; రాజయోగ ప్రభావంలో గమ్యాన్ని చేరుకోవడానికి 3 క్షేత్రాలు దాటాలని, అనంతం వైపు గ్రంథంలో లక్ష్యాన్ని చేరుకోడానికి 13 బిందువుల గురించి వివరించడం జరిగింది.
23 వలయాల్లో మొదటి 5 వలయాలు, 3 క్షేత్రాలలో హృదయ క్షేత్రం, 13 బిందువుల్లో మొదటి 5 బిందువులు సూచించేది ఒకే చేతనాన్ని, హృదయక్షేత్ర చేతనం. హృదయ క్షేత్రం దాటితే మోక్షం లభిస్తుంది, బాబూజీ యోగశాస్త్రం ప్రకారం.
23 వలయాల్లో 6 నుండి 16 వలయాలు అంటే మనోక్షేత్రం, అంటే 6 నుండి 12 బిందువులన్నమాట. ఈ మనోక్షేత్రాన్ని దాటినప్పుడు భగవత్సాక్షాత్కారం, శరణాగతి స్థితి పరాకాష్ఠకు చేరుకుని భగవంతునిలో లయావస్థ ప్రారంభమవుతుంది.
23 వలయాల్లో 17 నుండి 23 వలయాలు, అంటే 13 వ బిందువు అంటే కేంద్ర క్షేత్రంలోకి అడుగు పెడతాం. అంటే కేంద్ర క్షేత్రం దాటినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం జరుగుతుంది.
పూజ్య దాజీ 13 వ బిందువు తరువాత కూడా యాత్ర కొనసాగుతూనే ఉంటుంది అంటారు. అసలు యాత్ర ఇప్పుడే ప్రారంభమవుతుందంటారు. వివాహం తరువాత ప్రేమ-యాత్ర అంటే హనీమూన్ తరువాత అసలు సంసారం ప్రారంభమైనట్లే, 13 వ బిందువు తరువాత అనంతం వైపు యాత్ర ఎప్పటికీ అనంతంగా మహాప్రళయం వరకూ కొనసాగుతూనే ఉంటుందంటారు దాజీ.
Lovely explanation.
రిప్లయితొలగించండి