ఆత్మ సాక్షాత్కారం - బాబూజీ
అభ్యాసి: ఆత్మ సాక్షాత్కార అనుభూతి ఎలా ఉంటుంది బాబూజీ? దాని అనుభవం మాకు మీరు ఇవ్వగలరా బాబూజీ?
బాబూజీ: ఎవరో ఒకసారి మా వద్దకు వచ్చి సవాలు చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఒక్క నిమషంలోనే ఆత్మ సాక్షాత్కారంలో ఆఖరి స్థితి వరకూ అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నా శక్తులన్నీ వెంటనే ఉపసంహరించుకోవడం జరిగింది. ఆతని పరిస్థితి అంతకు ముందులాగే తయారయ్యింది. ఈ సంఘటన 1957 లో అనుకుంటాను జరిగింది. ఆ సమయంలో నన్ను కలవడానికి షాహాజహానుపూర్ రావడం జరిగింది. వాళ్ళల్లో ఒకరు, "ప్రాచీన కాలంలో ఋషులు, మునులు నిముషాల్లో సాక్షాత్కారం చేయించేసేవారట" అన్నాడు. "కావచ్చు, బహుశా చేయించేవారేమో. మన దగ్గర మాత్రాం సమయం పడుతుంది మరి" అన్నాను. ఇలా మాట్లాడుతూనే అతన్ని ఆత్మసాక్షాత్కారం యొక్క ఆఖరి స్థితి వరకూ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఈ ప్రశ్నలు అతన్ని అడిగాను:
"నీ శరీరం ఉందా?" "లేదు" అన్నాడు.
"నీ ఆత్మ ఉందా?" అని అడిగాను. "లేదు" అన్నాడు.
"మరేముంది?" అని అడిగాను. "యేమీ లేదు బాబూజీ" అన్నాడు.
"ఇదే సాక్షాత్కారం యొక్క ఆఖరి స్థితి" అని చెప్పాను.
ఆ తరువాత నా శక్తులన్నీ పూర్తిగా ఉపసంహరించుకున్నాను. అతనున్న పూర్వ స్థితికి తిరిగి వచ్చేశాడు. ఆ స్థితిని శాశ్వతంగా ఉండేట్టు చేయమని ఎంతో బ్రతిమాలాడు. "చూడు నాయనా! మేమెప్పుడూ ఎవరితోనూ వాగ్దానాలు చెయ్యం. కానీ నేను నీకు మాట ఇస్తున్నాను ఇచ్చేస్తాను, కానీ ముందు నువ్వు ఎమ్. ఎ. పూర్తి చేసిరా" అని చెప్పాను.
అభ్యాసి: బాబూజీ అతను వస్తే ఆయనకు సాక్షాత్కార అనుభవం ఇచ్చేస్తారా?
బాబూజీ: వాగ్దానం చేశాను కదా. తప్పక ఇస్తాను. కానీ ముందు అతను ఎం. ఎ. పూర్తి చేసి రానీ. నేను కూడా నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
కొంతమంది ఎలాంటి ప్రశ్నలు వేస్తారంటే వాటికి జవాబు చెప్పడం అసాధ్యమవుతుంది. ఒకవేళ జవాబు ఇస్తే అది వాళ్ళకు అర్థం కాదు.
ఒకసారి ఒక సజ్జనుడు లాలాజీని, భగవంతుడు సృష్టిని ఎందుకని సృష్టించాడంటారు? అని అడిగాడు.
దానికి లాలాజీ: ఆ సమయంలో నువ్వు గాని నేను గాని లేము అక్కడ, లేకపోతే అక్కడే ఆపేసి ఉండేవాళ్ళం, అని సమాధానాం ఇచ్చారట.
అలాగే మరొక వ్యక్తి లాలాజీని "భగవంతుడు మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?" అని అడిగాడు. దానికి లాలాజీ మౌనంగా ఉండిపోయారు. కాస్సేపు తరువాత ఆ వ్యక్తి మళ్ళీ ఆ ప్రశ్నను అడిగాడు. దానికి లాలాజీ, "మీకు ఇప్పటికే సమాధానం చెప్పానని అనుకుంటున్నాను." అని అన్నారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి