సహజ మార్గ ప్రార్థనలోని 2 వ వాక్యం:
యదార్థ లక్ష్యానికి అవరోధాలు
సహజ మార్గ ప్రార్థనలోని రెండవ వాక్యం ఈ విధంగా ఉంది: "మేమింకనూ కోరికలకు బానిసలమై యుండుట, మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది."
"We are yet but slaves of wishes putting bar to our advancement."
ఇక్కడ పూజ్య చారీజీ వివరించిన అర్థం: కోరికలకు బానిసలమై యుండుట మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగా ఉంది. అంటే కోరికలుండటం తప్పా? కాదు. కోరికలకు బానిసలుగా ఉండటం అడ్డు అవుతుంది. 'ఐస్ క్రీమ్ తినాలని ఉంది' - అది కోరిక. 'ఐస్ క్రీమ్ తినకపోతే నేనుండలేను' - అది కోరికకు బానిసత్వం. అది కూడదు. ఇలా బానిసలమైపోయిన కోరికలు మనిషిలో లెక్కలేనన్ని ఉంటాయి, తరచి చూచుకుంటే. బానిస గాకుండగా ఉండటం మనిషి చేతిలో ఉంది.
ఇక్కడ పూజ్య దాజీ ఇచ్చిన వివరణ: ఆంగ్లంలో wishes అనే పదానికి ఈ విధంగా అర్థం చెప్పడం జరిగింది. Wish అంటే ఆశ. ప్రతీ కోరిక ఆశతో ప్రారంభమవుతుందంటారు దాజీ. ఆశ కోరికకు బీజం అంటారు. ఆశ తీవ్రతరం అయినప్పుడు అది కోరికగా మారుతుంది. అటువంటి ఆశలే మన ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలు అని అంటారు దాజీ.
కాబట్టి ఆశలను/కోరికలను పోగొట్టుకోవడం అనేది మనిషి చేతిలో ఉంది. ఆశలు/కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత గమ్యానికి చేరువవుతాం అంటుంది ఆధ్యాత్మికత. అందులో కోరికల బానిసత్వం మరిన్ని వికారాలకు దారి తీస్తుంది. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా కోరికలు తగ్గించుకుంటూ, అవసరాలకు పరిమితమవ్వాలి. దైవసాక్షాత్కారం పొందాలనుకున్నవారికి, ఆ అవసరాలు కూడా తగ్గిపోవాలి. అతి తక్కువ అవసరాల స్థాయికి రావాలి. అప్పుడే సూక్ష్మాతి సూక్ష్ముడైన దైవత్వాన్ని దర్శించగలుగుతాడు మనిషి, అంటుంది సహజ మార్గం.
అవును కదా !
రిప్లయితొలగించండి