బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 2
The end of spirituality is the begining of Reality.
ఆధ్యాత్మికత అంతమైన చోట యదార్థం ప్రారంభమవుతుంది.
అంతర్ముఖమై ధ్యానం ద్వారా దైవసాక్షాత్కారం లేక ఆత్మసాక్షాత్కారం సాధించే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికం అంతరంగ యాత్ర జరుగుతున్న కొద్దీ వివిధ రకాల అనుభూతులను కలిగిస్తుంది. ఆధ్యాత్మికత అనుభూతులతో కూడుకున్నది. అనుభూతి ఆలోచన కంటే అతీతమైనది. రకరకాల దశలలో రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని ఒక్కోసారి మాటల్లో పెట్టడం అసాధ్యమనిపిస్తుంది. అనుభవించినవారికి మాత్రమే తెలుసుతుమది. అనుభవాలు కూడా మరింత మరింత సూక్ష్మంగా తయారవుతూ ఉంటాయి. అనుభవాలు యాత్ర ముందుకు సాగుతున్నదనడానికి సంకేతాలు. కొంత కాలం సాధన చేసిన తరువాత ఈ అనుభవాలంటే కూడా విసుగు పుడుతుండంటారు దాజీ. అంటే ఈ అనుభవాలు కూడా ఆగిపోయి మరో ఉన్నత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికత అంతమవడం అంటే. ఇప్పుడు యదార్థం అంటే ఏమిటో దానికి సాక్షిగా ఉండటం ప్రారంభమవుతుంది. ఇదే ఈ వాక్యానికి అర్థం. ఈ ఆధ్యాత్మిక లోకం సూక్ష్మాతిసూక్ష్మ స్థితి. అందుకే సాధకుడు అనుభవాలను డైరీలో వ్రాసుకుని మరచిపొమ్మనడం జరుగుతుంది సహజ మార్గ పద్ధతిలో. ఎంత అద్భుతమైన అనుభవాలైనా వాటి కోసం వెంపర్లాడకూడదు; ఎంత భయంకర అనుభవాలైనా సరే భయపడి విరమించుకోకూడదు సాధనను. మనలను ముందుకు నడిపించేది మన తీవ్ర తపన మాత్రమే. అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి, మన తపన ఎప్పుడూ అతీతంగా, మరింత అతీతంగా ముందుకు సాగేలని ఉండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి