బాబూజీ చెప్పిన గాడిద కథ
బాబూజీ ఒకసారి అభ్యాసులతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు మీ గుమ్మంలోకి కూడా చాలా మంది గాడిదలు వస్తూండవచ్చు కదా?" అని అంటే దానికి బాబూజీ, "ఆ, వస్తూ ఉంటారు కానీ వాళ్ళని మనుషులుగా మార్చి తిరిగి వెనక్కి పంపుతూ ఉంటాను" అన్నారు. ఆ తరువాత మాట్లాడుతూ "గాడిదను గాడిద అని ఎందుకంటారో మీకు తెలుసా?" అని అడిగారు. దానికి వారే సమాధానం చెప్తూ, "ఒక లక్షణం ఏమిటంటే, గాడిద తన ఇంటి దారిని మరచిపోతుంది అందుకే తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతుంది. రెండవ లక్షణం ఏమిటంటే డానిది, పచ్చదనం చూసి బాధపడుతుంది; ఎండిపోయిన భూమిని చూసి ఆనందిస్తుంది; పచ్చదనం చూసి నేనేమీ అసలు తినలేదే అనుకుంటుంది; ఎండుభూమిని చూసి మొత్తం తినేశాను అనుకుంటుంది." (నవ్వులు)
"బాబూజీ నా మనసులో అనేక ప్రశ్నలు వస్తూంటాయి" అన్నాడు ఒక అభ్యాసి. దానికి బాబూజీ, "నాకు తెలుసు మీ మనసులో ఎందుకు అన్నీ ఆలోచనలు వస్తాయో చెప్పమంటావా?" "చెప్పండి బాబూజీ."పని చేసేదేమి లేకపోవడం వల్లే ఈ ఆలోచనలు వస్తూంటాయి. నిజానికి నేను కూడా యే పనీ చేయననుకోండి. చూశారా, ఒక దొంగ మరొక దొంగను ఎలా పట్టుకున్నాడో!" అన్నారు బాబూజీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి