12, జూన్ 2024, బుధవారం

సహజ మార్గ ప్రార్థనలోని 3 వ వాక్యం: ఆ దశకు జేర్చు ఏకైక స్వామి, శక్తి

 


సహజ మార్గ ప్రార్థనలోని 3 వ వాక్యం:
 ఆ దశకు జేర్చు ఏకైక స్వామి, శక్తి 

సహజ మార్గ ప్రార్థనలోని 3 వ వాక్యం ఇలా ఉండి: "మమ్ము ఆ దశకు జేర్చు ఏకైక స్వామివీ, శక్తివీ నీవే."
"Thou art the Only God and Power to bring us up to that stage."

మొదటి వాక్యం మన జీవిత యదార్థ లక్ష్యాన్ని మన ముందుంచుతున్నది. 
రెండవ వాక్యం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉండే అవరోధాలేమిటో గుర్తిస్తున్నది. ఉన్న వాస్తవాన్ని ఆ మాస్టరుకు విన్నవించుకోవడం జరుగుతున్నది. 
మూడవ వాక్యం ఇటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోయి, విముక్తి కోసం, సాధకుడు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ మొరపెట్టుకుంటున్న సందర్భం ఈ మూడవ వాక్యం. 
మరొక ముఖ్య అంశం ఈ ప్రార్థనలో గమనించినట్లయితే, 'మేమింకనూ', 'మా', 'మమ్ము' అనే పదాలు గమనార్హాలు.  ఈ ప్రార్థనలో ఎక్కడా భగవంతుని యాచిస్తున్న దాఖలాలు లేవు. కేవలం ఉన్న యదార్థాన్ని వారి ముందుంచడం జరుగుతోంది. అలాగే ఈ ప్రార్థన కేవలం వ్యక్తిగతంగా గాకుండగా అందరినీ కలుపుకుని చేసే ప్రార్థనగా ఉంది. పైన చెప్పిన పదాలే వీటికి నిదర్శనం. అంతేగాక ఈ 3 వ వాక్యం, ఆ సర్వశక్తిమంతుడైన పరమాత్మపై  ఎంతగా  ఆధారపడి ఉన్నామో అన్న వాస్తవాన్ని గుర్తించడం జరుగుతున్నది.  
వెరసి ప్రేమతోనూ, భక్తితోనూ నిండిన హృదయంతో ఈ ప్రార్థన యొక్క భావాన్ని మనసులో ఉంచుకుని నివేదించినప్పుడు, హృదయం లోలోతుల్లో నుండి ఒక ఆర్తి పెల్లుబుకినప్పుడు భగవంతుని పట్ల ఒక అనూహ్య బాంధవ్యం ఏర్పడుతుంది; అనుబంధం ఏర్పడటం ప్రారంభిస్తుంది. శరణాగతి భావాన్ని కలుగజేస్తుంది. 
ఈ విధంగా ప్రార్థన వల్ల మనలో నిస్స్వార్థ  భావం, వినమ్ర భావం, శరణాగతి భావం, భక్తి భావం, వంటి ఉదాత్త భావాలు కలిగి మనలో జరుగవలసిన పరివర్తనకు ఎంతగానో దోహదం చేస్తుంది, ఈ ప్రార్థన. 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...