31, మార్చి 2024, ఆదివారం

బాబూజీ సందేశమాలిక 4 - నా మాస్టర్ సందేశం - Message of my Master

 


బాబూజీ సందేశం  - నా మాస్టర్ సందేశం 
(సెప్టెంబర్ 1960)
Message of my Master 
(September 1960)

It is a great pleasure to me to deliver to you the message of my Master which is meant for the common good of all humanity. His auspiscious name was Samarth Guru Mahatma Ram Chandraji (of Fatehgarh, UP). He is the adi guru of our Mission. He devoted his whole life to the spiritual service of all mankind. 

The popular belief that the attainment of liberation is not only difficult but also impossible within the span of one life is a mistaken notion. Who knows, this very life of ours might be the last one to bring us to the level of liberation. 
Indeed our great Master has boldly asserted that one can, for sure, attain liberation in this very life, nay,even in a part of it, provided one is really earnest about it and has the fortune of having a proper guide. This he has practically demonstrated in many instances which only direct experience can prove. 

సమస్త మానవాళి యొక్క శ్రేయస్సునుద్దేశించి నా గురుదేవుల సందేశాన్ని మీకందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన శుభనామము సమర్థ గురు మహాత్మా శ్రీరామ చంద్రజీ (ఫతేగఢ్, ఉ. ప్ర.). ఈయన ఈ సంస్థ యొక్క ఆది గురువు. ఆయన జీవితం అంతా సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక సేవకే అంకితం చేశారు. 
మోక్షసాధన చాలా కష్టమని, అదీ ఒక్క జన్మలో సాధించడం అసాధ్యమని ప్రజల్లో ఉన్న నమ్మకం చాలా పొరపాటు. ఎవరికి తెలుసు, మనలను మోక్షస్థాయికి తీసుకురాగలిగేది ఈ జన్మే కావచ్చు, ఇదే ఆఖరి జన్మ కావచ్చును కూడా. 
నిజమైన తపన ఉండి, సరైన మార్గదర్శి లభించినట్లయితే, ఈ జన్మలోనే సాధించగలమని, ఇంకా చెప్పాలంటే ఈ జన్మలో కొంత భాగంలోనే తప్పక సాధించవచ్చని  మహనీయుడైన మన మాస్టరు నొక్కి చెప్పడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా వారు ఎన్నో సందర్భాలలో రుజువు చేయడం జరిగింది; దీనికి ప్రత్యక్షానుభవం మాత్రమే నిదర్శనం కాగలదు.  

బాబూజీ సందేశమాలిక 6 - సహజ మార్గ సారాంశం - The Essence of Sahaj Marg

 


బాబూజీ సందేశమాలిక 6 - సహజ మార్గ సారాంశం 
(మైసూరు 20 డిశంబర్ 1964)
The Essence of Sahaj Marg 
(Mysore 20 December 1964)

Man is a bipolar-being. It has got its root nearest to the Base, and the other end towards the world. If somehow, the individual mind gets moulded towards the cosmic mind, it begins to appear in its true colours. As a matter of fact the human mind is a reflection of the kshobha which set into motion the forces of nature to bring into existence the creation. The action started in clockwise motion; that is why we see everything round in Nature. The individual mind is thus a part of the Godly mind (kshobha). If somehow we turn its downward trend towards the Base, it will become quiet and peaceful. But so far as my personal experience goes, I find that it is only the help of one of Dynamic Personality that can turn towards the Base. It is only the power and the will of such personality that marks in this respect. 

మనిషి రెండు ధృవాలతో కూడిన జీవి. ఈ జీవికి ఒక అంచు అంటే తన మూలం, అధిష్ఠానానికి దగ్గరగా ఉంది; మరో అంచు ప్రపంచం వైపుకు ఉంది. ఎలాగో అలాగా వ్యక్తిగత మనస్సును గనుక విశ్వ మనస్సు వైపుకు మలచగలిగితే, అప్పుడు మనసు యొక్క నిజమైన రంగులు దర్శనమివ్వడం ప్రారంభిస్తాయి.  నిజానికి ప్రకృతిలోని శక్తుల కదళికల వల్ల  సృష్టి ఉనికిలోకి రావడానికి కారణమైన క్షోభ్ యొక్క ప్రతిబింబమే ఈ మానవ మనస్సు. ఈ కదలిక కుడి నుండి ఎడమ వైపుకు (క్లాక్ వైజ్ గా) ప్రారంభమయ్యింది.  అందుకే ప్రకృతిలో అన్నీ గుండ్రంగా కనిపిస్తాయి. కాబట్టి వ్యక్తిగత మనస్సు, ఆ దైవిక మనస్సులో (క్షోభ్ ) భాగమై ఉంది.  యేదో విధంగా క్రీడకు తిరిగి ఉన్న మనస్సును పైకి అధిష్ఠానం వైపు త్రిప్పగలిగితే , మనసు నిశ్శబ్దంగానూ, ప్రశాంతంగానూ తయారవుతుంది. కానీ, ఇప్పటి వరకూ, నా వ్యక్తిగత అనుభవం ప్రకారం, అధిష్ఠానం వైపుకు త్రిప్పగల ఒక ఉతరుష్టమైన వ్యక్తిత్వం  ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అటువంటి వ్యక్తిత్వం యొక్క సంకల్పము, శక్తి వల్లనే ఇది సాధ్యమవుతుంది. 

బాబూజీ సందేశమాలిక 5 - సహజ మార్గ పద్ధతి - The System of Sahaj Marg


బాబూజీ సందేశం - సహజ మార్గ పద్ధతి 
(సంస్థ వార్షికోత్సవ సందర్భంగా - 1963)

The System of Sahaj Marg 
(Message at the Annual Function of the Mission 1963)

I may today present before you some of the important features of our system known as Sahaj Marg, or the Natural Path of realisation. The system runs along simplest and most natural lines which are easily adjustable to the ordinary routine of a worldly life. It admits none of the methods of rigid austerity, penance, or physical mortification undertaken with a view to effect the strangulation of the mind  and indriyas. 

The ideology of Sahaj Marg is so plain that often for this very reason it is not so well understood by people who are under the impression that realisation is the most difficult job which requires persistent labour for lives and ages. It may however be difficult those who proceed on, loaded with their own confused conceptions of Reality, and adopt complicated means for their achievement. As a matter of fact Reality, which one aspires for, is so simple that its very simplicity has become a veil to it. A simple thing can be achieved by simple means alone. Therefore, for the realisation of the simple, It is only the simplest means that can ensure success. 

నేను ఈరోజు సహజ్ మార్గ్ లేక ప్రకృతిసిద్ధమైన సాక్షాత్కార పద్ధతి యొక్క ప్రధాన అంశాలను మీ ముందుంచుతున్నాను. మనం నిత్యం అనుభవించే ప్రాపంచిక జీవనానికి తగినట్లుగా తేలికగా, సహజంగా, సరళంగా సర్దుకోగలిగినటువంటి విధానాలలో నడిచేటువంటి పద్ధతి. ఇందులో, మనసును, ఇంద్రియాలను ఇబ్బందిపెట్టే విధంగా ప్రభావితం చేసే  కఠినమైన నిష్ఠలు గాని, తపస్సులు గాని లేక భౌతికంగా హింసపెట్టుకునే పద్ధతులు గాని వేటినీ అనుమతించడం ఉండదు. 
సహజ మార్గ తత్త్వం ఎంత సరళంగా, ఎంత నిష్కపటంగా ఉంటుందంటే, దాని మూలానే, సాక్షాత్కారం అంటే చాలా కష్టమని, ఎన్నో జన్మలు బాగా కష్టపడితే గాని దాన్ని సాధించలేమని భావించేవారికి ఒక పెద్ద అడ్డు తెరగా నిలుస్తుంది. మనసు నిండా, సత్య తత్త్వాన్ని గురించి వాళ్ళ-వాళ్ళ స్వంత అస్పష్ట సిద్ధాంతాలతో సతమతమవుతూ, వాటిని సాధించే క్రమంలో చాలా జటిలమైన పద్ధతులను అవలంబించేవారికి తప్పక ఈ మార్గం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, అందరూ తపించే సత్య తత్త్వం ఎంత సరళమైనదంటే, దాని సరళత్వమే ఒక అడ్డు తెరగా అయిపోతూ ఉంటుంది. సరళమైన వస్తువును సరళమైన మార్గంలోనే సాధించగలం. కాబట్టి సరళమైనదాన్ని సాక్షాత్కరించుకోవాలంటే అతి సరళమైన మార్గాన్నే అవలంబించాలి, అప్పుడే విజయం తప్పక లభిస్తుంది.  

బాబూజీ సందేశమాలిక 3 - భగవంతుడు సరళుడు - God is Simple

 


బాబూజీ సందేశం - భగవంతుడు సరళుడు 
God is Simple
Message at the Inaugural function of Gulbarga Mission Branch,1957 
1957, గుల్బర్గాలో సంస్థ యొక్క శాఖ ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చిన సందేశం, 

God is simple and extremely subtle. In order to realise this subtlest Being, we must take up means which are equally fine and subtle. The difficulty arises only when intricate methods are applied for the solution of this very simple problem. In other words they apply huge cranes for picking up a smaal sewing needle.

We have set up a tiny creation of our own, in the form of our individual material existence, having layers after layers of grossness and opacity. What is now to be done is to shatter off those layers of opacity one by one and assume the absolute state as we had at the time of creation. This is all the gist of the philosophy of our system Sahaj Marg. We are, so to say, to dissolve this tiny creationof our making or to unfold ourselves.

The easiest and surest means to achieve this end is to surrender yourself to the great Master in true sense and become a "Living Dead" yourself.

భగవంతుడు సరళుడు, అతి సూక్ష్ముడు.  ఈ అతి సూక్ష్మ అస్తిత్వాన్ని సాక్షాత్కరించుకోవాలంటే, మనం చేపట్టే మార్గం కూడా అంత సూక్ష్మంగానూ, అంత నాజూకుగానూ ఉండాలి. సమస్యలు ఎప్పుడొస్తాయంటే, ఈ సరళమైన సమస్యకు జటిలమైన పద్ధతులు వినియోగించినప్పుడు వస్తాయి. మరోలా చెప్పాలంటే, క్రింద పడిన కుట్టే సూదిని క్రేనుతో ఎత్టడానికి ప్రయత్నించినట్లుంటుంది. 

మనం మనదంటూ ఒక స్వంత భౌతిక అస్తిత్వాన్ని, ఒక చిన్ని సృష్టిని ఏర్పరచుకున్నాం; ఇందులో జడత్వం, అంధకారం పొరలుపొరలుగా ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు మనం చేయవలసిందేమిటంటే, ఈ చీకటి పొరలను  ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ చివరికి సృష్టి జరిగినప్పుడు ఉన్న మన మూల స్థితికి చేరుకోవాలి. ఇదే క్లుప్తంగా మన సహజమార్గ పద్ధతి యొక్క తత్త్వసారాంశము. మనం కేవలం మనం సృష్టించుకున్న ఈ చిన్ని సృష్టిని లయం చేసుకోవాలి లేక మనలను మనం వికసించేలా చేసుకోవాలి. 

ఈ గమ్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితమైన మార్గం, తేలికైన మార్గం, ఏమిటంటే, నిజమైన అర్థంలో ఆ మహానీయుడైన మాస్టరుకు సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవడమే,  మీరు స్వయంగా "జీవన్మృతుడిగా" మారిపోవడమే.  

బాబూజీ సందేశమాలిక 2 - భగవత్సాక్షాత్కారానికి అతి తేలికైన మార్గం - Easiest Way to God Realization

 


భగవత్సాక్షాత్కారానికి అతి తేలికైన మార్గం 
Easiest Way to God  Realization 

What else except a tiny heart can be the fittest offering for the achievement of the dearest object of life?
One thing more: To effect the surrender of heart in the easiest way, only an act of will is required. But the lighter and finer the will, the more effective shall be its working. An act of will lying in the form of seed of an insignificant volume in the deeper cores of conscioudness, shall soon develop into full-fledged tree stretching its branches all over. 

జీవితం యొక్క ప్రియాతిప్రియమైన లక్ష్యాన్ని సాధించడానికి సమర్పించగలిగే అతి యోగ్యమైన వస్తువు ఈ చిన్ని హృదయం గాక మరేదైనా ఉన్నదా?
మరొక్క విషయం: హృదయాన్ని అతి తేలికైన విధంగా సమర్పించాలంటే, కావాలసినది కేవలం ఒక సూక్ష్మ సంకల్పం మాత్రమే. సంకల్పం ఎంత తేలికగా, ఎంత సూక్ష్మంగా ఉంటుందో, దాని ప్రభావం అంత ఎక్కువగా ఉండేలా పని చేస్తుంది. చేతన యొక్క అంతరాళంలో చెప్పుకోదగ్గ పరిమాణం లేని ఒక బీజరూపంలో ఉండే ఈ సంకల్పం, త్వరలోనే  అంతటా కొమ్మలు వ్యాపించిన  ఒక పెద్ద మహావృక్షంలా వృద్ధి చెందుతుంది.  
- బాబూజీ సందేశం, సందేశమాలిక, డిశంబర్ 15, 1957, గుల్బర్గా 

30, మార్చి 2024, శనివారం

బాబూజీ సందేశమాలిక 1 - నిజమైన శిష్యుడి ప్రధాన కర్తవ్యం - the primary duty of a true disciple


నిజమైన శిష్యుడి ప్రధాన కర్తవ్యం 
The primary duty of a true disciple

I took him (my Master, Lalaji) into my heart as an object of worship and never took, nor do I take even now, anyone else into my view.....

It is, as a general rule, the primary duty of a true disciple and the only key to success. That is the only means which helps removing of impurities from the heart and overcoming of all obstructions on the path. It effects the unfoldment of the knots. It is in fact the real essence of all Sadhanas. One who has tasted it once, shall never part with it in life nor lean towards any other side. This is the unfailing process which our revered Master and all the sages of eminence had followed.

- Babuji, Messages Universal, First Message

నేను నా గురుదేవులను ఆరాధనా వస్తువుగా నా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను. అప్పటి నుండి మరెవ్వరినీ, ఎప్పుడూ, ఈ క్షణం వరకూ నా దృష్టిలోకి రానివ్వలేదు... 

ఇది ఒక సాధారణ నియమం, నిజమైన శిష్యుని యొక్క ప్రధాన కర్తవ్యం, విజయానికి ఏకైక కీలకమైన అంశం. హృదయంలో నుండి అశుద్ధాలు తొలగించడానికి, మార్గంలో వచ్చే అన్నీ అవరోధాలను అధిగమించడానికి ఒకే ఒక మార్గం. గ్రంథులు విచ్చుకునేలా ప్రభావితం చేస్తుంది. నిజానికిది అన్ని సాధనల అసలైన సారాంశం. దీన్ని ఒక్కసారి రుచి చూసినవాడు, జీవితంలో దాన్ని విడిచిపెట్టి ఉండలేడు, మరే ప్రక్కకు మొగ్గు చూపడు కూడా. మన పూజ్య గురుదేవులు, పరిపూర్ణులైన మన మహర్షులందరూ అనుసరించిన పద్ధతి ఇదే. 

- బాబూజీ, మొదటి సందేశం, సందేశ మాలిక 





 

29, మార్చి 2024, శుక్రవారం

బాబూజీ గురించి చారీజీ వద్ద విన్న కొన్ని సన్నివేశాలు

బాబూజీ గురించి చారీజీ వద్ద విన్న కొన్ని సన్నివేశాలు 

*

నా హాస్యంలో కూడా ఒక సందేశం ఉంటుంది - బాబూజీ 

*

బాబూజీ వద్దకు ఒక వ్యక్తి వచ్చి, "బాబూజీ అసలు దేవుడున్నాడా?" అని అడిగాడు. దానికి బాబూజీ సమాధానం చెప్పకుండా కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయారు. ఆయన వెనుకే చారీజీ కూడా వెళ్ళి, "అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా వచ్చేశారేంటి?" అని అడిగారట. దానికి బాబూజీ,"చూడు ఆ ప్రశ్న వేసిన వ్యక్తికి, దేవుడున్నాడు అని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా ఉపయోగం లేదు", అందుకే లేచి చక్కా వచ్చాను అన్నారట. ఇదే ప్రశ్న మరో సందర్భంలో అడిగినప్పుడు, "నేను దేవుడిని చూపించాననుకో, నువ్వెలా గుర్తు పడతావు?" అని అడిగారట.

*

మరో వ్యక్తి బాబూజీ వద్దకు వచ్చి, "బాబూజీ నాకు మీ విశ్వరూపదర్శనం చేసుకోవాలనుంది, దర్శనం కలిగిస్తారా?" అని అడిగాడట. దానికి బాబూజీ, "సోదరా, నువ్వు అర్జునుడివి కావచ్చునేమో గాని, నేను శ్రీకృష్ణుడిని కాను" అన్నారట. 

*

మరో సందర్భంలో ఒక వ్యక్తి బాబూజీ దగ్గరకొచ్చి, "బాబూజీ మీరు మహాత్ములు కదా, గురువులు కదా, ఆధ్యాత్మిక ఎత్తులకు ఎదిగినవారు కదా, మరి మీరు హుక్కా పీలుస్తున్నారేమిటి? పొగ త్రాగుతున్నారేమిటి?" అని అడిగాడట. దానికి బాబూజీ, "నేను విషాన్ని తీసుకుని, మీకు అమృతాన్ని ఇస్తూ ఉంటే, నీకు అభ్యంతరం ఏమిటి?" అని అడిగారట. ఇదే ప్రశ్నకు మరో సందర్భంలో మరొక వ్యక్తితో, "నిజమే ఒప్పుకుంటాను. కానీ నేను పొగ త్రాగుతూ ఈ స్థితికి చేరుకున్నాను, నువ్వు పొగ త్రాగకుండా ఈ స్థితికి చేరుకోగలవా?" అని ప్రశ్నించారట.

*

మరో సందర్భంలో బాబూజీ కుర్చీలో హుక్కా త్రాగుతూ కూర్చున్నప్పుడు, తన ముందు కొంతమంది అభ్యాసులు దశనియమాలను గురించి చర్చించుకుంటున్నారట. ఆ సంభాషణలో, ఒక అభ్యాసి మరొక అభ్యాసిని 5 వ నియమం ఏమిటని అడిగాడు; ఆ తరువాత ఆ అభ్యాసి 8 వ నియమం ఏమిటని అడిగాడు. ఇలా చర్చ కొనసాగుతూ ఉండగా, బాబూజీ కుర్చీలో నుండి లేచి వెళ్లిపోయారట. చారీజీ, "ఎందుకని అలా వచ్చేశారు బాబూజీ?" అని అడిగినప్పుడు, బాబూజీ, ఆ చర్చలో నన్ను కూడా ఫలానా నియమం ఏమిటి అని నన్నడిగితే నా పరిస్థితేమిటి? నేను చెప్పలేకపోతే.. . ఏమి గురువు, ఈయనకే తెలియదా అని అనుకోరూ? అందుకే వచ్చేశాను" అన్నారట.   

*

ఒకసారి బాబూజీ తన ఇంట్లో ఎన్నో యేళ్ళుగా పని చేసే "మాలిన్" ను తనకున్న చనువుతో హాయిగా దేశవాళీ తిట్లు హిందీలో తిడుతున్నారట. అక్కడే కొంతమంది విదేశీ అభ్యాసీలు నిలబడి ఉన్నారట. అకస్మాత్తుగా వాళ్ళున్నారని గుర్తించి, చారీజీతో, "మంచిదయ్యింది, వీళ్ళకు భాష అర్థంకాడు, లేకపోతే, ఈయనేం గురువు, ఇలా బూతులు తిడుతున్నాడు? అని అనుకోరూ?" అని అన్నారట బాబూజీ. అంతా పసి మనసు బాబూజీది. 

*

28, మార్చి 2024, గురువారం

బాబూజీ పలికిన ప్రసిద్ధ వాక్యాల మననం

 


బాబూజీ పలికిన  ప్రసిద్ధ వాక్యాల మననం 

God is Simple - భగవంతుడు సరళుడు.
మననం: భగవంతుడు సరళుడు, మనిషి జటిలుడు. భగవంతునిలో లయమవ్వాలంటే భగవంతునిలా సరళంగా తయారవ్వాలి. మనిషిలోని జటిలత్వం పోయి సరళంగా మారాలి. భగవంతునిలా సరళంగా మారితే తప్ప మనిషి, ఆయనలో లయం కాలేడు, సముద్రంలో నీటి చుక్కలా. సముద్రంలో నూనె చుక్క కాలవలేదు. ఈ జటిల్యతవాన్ని వదిలించేదే గురువు నిర్దేశించిన సాధన. సాధన లేకుండా మనిషి సరయాళుడుగా మారే అవకాశమే లేదు. 

End of religion is the beginning of spirituality - మతం అంతమైన చోట ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. 
మననం: మతం అంతమైతే కాని ఆధ్యాత్మికత ప్రారంభం కాదు. మతం అంటే భగవంతుని బాహ్యంగా అన్వేషించడం, క్రతువుల ద్వారా, పూజలు ద్వారా, ఆచారాల ద్వారా, నమ్మకాల ద్వారా, యజ్ఞాల ద్వారా, వగైరా విధానాల ద్వారా అన్వేషించడం. మతం బాహ్యోన్ముఖ అన్వేషణను ప్రోత్సహిస్తుంది. మతం ద్వారా భగవంతుడు అంటే ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ అనుభూతి కలుగదు. ఎప్పటికీ మతానికే కట్టుబడి ఉండకూడదు, దానిని, మతానికి అతీతంగా  దాటవలసి ఉంది. మతాన్ని తిరస్కరించడం కాదు, నిరాకరించడం కాదు, ఆ పరిధిని దాటి ముందుకు సాగడం అవసరం. అదే ఆధ్యాత్మికత. 
 ఆధ్యాత్మికత అంతర్ముఖంగా చేసే అన్వేషణ. అంతర్యామిగా ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందే ప్రయత్నం. కాబట్టి ఆధ్యాత్మికత అంతరంగ అనుభూతిని ప్రోత్సహిస్తుంది.     
  
Freedom from freedom is real freedom - స్వేచ్ఛ నుండి స్వేఛ్ఛే అసలైన స్వేచ్ఛ.
 మననం: స్వేచ్ఛ అంటే బంధాల నుండి విముక్తి పొందినటువంటి ఆత్మ అనుభూతి చెందేటువంటి ఆధ్యాత్మిక స్థితి.  కాని స్వేచ్ఛను గురించి ఆలోచించినప్పుడల్లా బంధాల్లో ఉన్న భావన కూడా తప్పక ఉంటుంది; ఆ భావనలో చిక్కుకుని ఉంటాం. ఈ భావనలో నుండి కూడా విముక్తిని పొందడమే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ. అదే అసలైన స్వేచ్ఛ. స్వేచ్ఛ అనే భావం నుండి కూడా విముక్తి కావడమే నిజమైన స్వేచ్ఛ అంటారు బాబూజీ. 

More and more of less and less - తక్కువ తక్కువగా అవడం అనేది ఎక్కువ ఎక్కువ అవ్వాలి. 
మననం: ఇది చాలా సుప్రసిద్ధ వాక్యం. దీన్ని గురించి ధ్యానించినప్పుడు, జీవితంలో అనేక సందర్భాలలో అనేక అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అంతా మర్మగర్భమైన వాక్యం ఇది. ముఖ్యంగా మనలో ఉండే నకారాత్మకమైన విషయాలు గాని, భయాలు గాని, చింతలు గాని, మలినాలు గాని, కోరికలు గాని, అహంకారం గాని రోజురోజుకూ తగ్గుతూ ఉండటం ఎక్కువవుతూ ఉండాలి. 

Books do not help in realization; after realization is achieved books are useless - సాక్షాత్కారానికి పుస్తకాలు సహాయపడవు; సాక్షాత్కారం వచ్చిన తరువాత పుస్తకాలతో పని లేదు. 
మననం: పుస్తకాల ద్వారా సాక్షాత్కారం సిద్ధించదు, సందేహం లేదు. అలాగే సాక్షాత్కారం సిద్ధించిన తరువాత పుస్తకాలతో పని లేదు ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞానం లభించడం వల్ల. కానీ పుస్తకాలు సాధనకు ప్రేరణ కలిగించడానికి ఉపయోగపడతాయని పూజ్య దాజీ అంటూంటారు. గ్రంథ పఠనం, అభ్యాసం రెండూ ప్రక్కప్రక్కనే జరుగుతూ ఉండాలంటారు బాబూజీ. అభ్యాసమే గ్రంథాల్లోని అంశాలను అవసరమైన విధంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. కేవలం పుస్తకపఠనం పనికి రాదు.

Forget Thyself and Remember Him - నిన్ను నువ్వు మరచి ఆయన్ని స్మరించు


Forget Thyself and Remember Him  

నిన్ను నువ్వు మరచి ఆయన్ని స్మరించు 

Forget Thyself అనేది బాబూజీ మహారాజ్ ఇచ్చిన సందేశం. అంటే నిన్ను నువ్వు మరచిపో అని అర్థం. అంతకు  పూర్వం బుద్ధ భగవానుడు, ఆదిశంకరులవారు, అందరూ "నిన్ను నువ్వు తెలుసుకో" అని బోధించడం జరిగింది. కాని బాబూజీ "నిన్ను నువ్వు మరచిపో" అన్నారు. ఇది నా దృష్టిలో బాబూజీ అందించిన మహావాక్యాల్లో ఒకటి. దీనిపై కాస్త ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 

ఈ వాక్యానికి అనేక అర్థాలు స్ఫురిస్తున్నాయి: 1) "నేను" అనే స్పృహ లేకుండా జీవించు, అంటే అహం లేకుండా జీవించు, అని.  2) శారీరక స్పృహ లేకుండా, మానసిక స్పృహ లేకుండా, కర్తృత్వ భావం లేకుండా, నేను అనే స్పృహ లేకుండా జీవించు, అని. 3) నిరంతరమూ "ఆయన" స్పృహలో, ఆ భగవంతుని స్పృహలో జీవించు అని. 4) నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే కూడా నిన్ను నువ్వు మరచిపోయి జీవిస్తేనే సాధ్యం. 5) నిన్ను నువ్వు మరచిపోయి జీవించినప్పుడే యదార్థ సత్యం బోధపడుతుందని ఒక అర్థం. 6) అసలు జీవించే విధానమే,  మనలను మనం మరచిపోయి జీవించడం అని మరో అర్థం. 7) నిన్ను నువ్వు సంపూర్ణంగా మరచిపోవడమే బహుశా ఆత్మసాక్షాత్కారం అంటే. 

ఒక పుస్తకం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనలను మనం మరచిపోయి, మయిమరచి చదివినప్పుడే సాధ్యపడుతుందని మన అనుభవం చెబుతున్నది. అలాగే యే పనైనా సరే, నృత్యసంగీతాల వంటి కళలు కూడా మయిమరచి చేసినప్పుడే శ్రోతలను, ప్రేక్షకులను పరవశింపజేయగలిగేది; యే విద్యలోనైనా పరాకాష్ఠకు చేరుకోవాలంటే రహస్యం ఇదే. అంటే "నేను" లేక ఆహాన్ని మరచిపోయినప్పుడే మనం చేసే పనికి పరిపూర్ణత,  సార్థకత సిద్ధిస్తాయి. 

కానీ ఈ స్థితి సిద్ధించాలంటే  ఎలా? సాధన ద్వారా. యే విద్యలోనైనా సరే, అభ్యాసం వల్ల, సాధన వల్ల మాత్రమే ఆ విద్యలో నైపుణ్యం, మెళకువలు, ప్రావీణ్యం సాధించడం వల్ల ఆయా విద్యల ద్వారా ఇతరులను పరవశింపజేసే విధంగా మనం చేసే పనుల్లో కౌశల్యం సంపాదించవచ్చు. యోగః కర్మసు కౌశలం అన్నాడు పతంజలి మహర్షి. 


అలాగే మానవ జీవితం యొక్క సంపూర్ణ సార్థకత సిద్ధించాలంటే నన్ను నేను సంపూర్ణంగా మరచిపోవాలి. అయితే ఇది అనుకున్నంత తేలికైన పని కాదు. అందుకే బాబూజీ నేర్పించే ధ్యానం ద్వారా సాధకుడికి మొట్టమొదటి సిట్టింగు నుండే ఈ శిక్షణ ప్రారంభమైపోతుంది. సాధకుడు "ఆయన" స్పృహలో జీవించే కళను బోధించకుండా బోధిస్తారు బాబూజీ. నిరంతర స్మరణను, సాధనా పరికరంగా బోధించడం చేస్తారు.  క్రమక్రమంగా సాధకుడు, శారీరక స్పృహ నుండి, మానసిక స్పృహ నుండి, చివరికి ఆత్మ యొక్క స్పృహ నుండి కూడా విముక్తుడై ఒక అనూహ్యమైన దివ్యస్పృహలో జీవించడం జరుగుతుంది. అటువంటి జీవనమే పరిపూర్ణ జీవనం. ఈ స్పృహలోనే బాబూజీ జీవించారనడానికి వారి జీవితమే గాక, వారు పలికిన మరో వాక్యం కూడా నిదర్శనమే -  " నేను నేను అన్నప్పుడు, అది నన్ను సూచిస్తున్నడో, లేక నా మాస్టరును సూచిస్తున్నదో లేక ఆ భగవంతుని సూచిస్తున్నదో  నాకు తెలియదు" అన్న వారి వాక్యం. 

ప్రతీ సాధకుడూ ధ్యానించి తెలుసుకోవలసిన వాక్యాలివి. 


గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవంలో వినిపించిన శాంతి మంత్రాలు

 





గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవంలో వినిపించిన  
శాంతి మంత్రాలు 


ఓం ధ్యౌ: శాంతిః | అంతరిక్ష శాంతిః | పృథ్వీ శాంతిః | ఆపః శాంతిః | ఓషధయః శాంతిః | వనస్పతయః శాంతిః | విశ్వేదేవాః శాంతిః | బ్రహ్మ శాంతిః | సర్వం శాంతిః |శాంతి రేవ శాంతిః | సా మా శాంతి రేధిః |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||  

సర్వేషాం స్వస్తిర్భవతు | సర్వేషాం శాంతిర్భవతు  | సర్వేషాం పూర్ణం భవతు | సర్వేషాం మంగళం భవతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||  

సర్వే భవంతు సుఖినః | సర్వే సంతు నిరామయ | సర్వే భద్రాణి పశ్యంతు  | మా కశ్చిద్ | దుఃఖ భాగ్భవేత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||  

ఓం సహనా వవతు సహనౌ భునక్తు  సహ వీర్యం కరవావహైః |
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహైః ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||  

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - నాల్గవ రోజు ఆదివారం 17.3.2024

 


గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - నాల్గవ రోజు  ఆదివారం 17.3.2024

ఈ చారిత్రాత్మక గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం, ఆదివారం, నాల్గవ రోజు 17.3.2024 తేదీన చివరి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వేదికపై ఆశీనులైన గురువులు, ప్రతినిధులు ఇలా ఉన్నారు:
శ్రీ బాబా జైన్, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రెలీజియస్ లీడర్స్,  శ్రీమతి మీనాక్షీ  రాజకోవాజీ, బహాయ్ ఫైత్.      పీర్-ఇనాయత్-ఖాన్, ఇనాయత్ ఆర్డర్ , జ్యోతేంద్ర ఎమ్ దవే జి, బి. ఎ. బి. ఎస్., వెనెరబుల్ డేషే డాంగ్రూజీ, తిబ్బట్ హౌస్ నుండి, శ్రీ జోవేస్ పెంటల్ హావెల్, కాన్షియస్ బీయింగ్ నుండి, శ్రీ దిల్షాద్ సింగ్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నుండి, శ్రీ సత్బీర్  సింగ్ ఖాల్సా జి, హార్వార్డ్ యూనివర్సిటీ నుండి, శ్రీ డీవోన్ మాక్రోసీ ఆస్ట్రేలియా నుండి, టోనీ నాడార్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నుండి, ఆత్మప్రీత్ విధీజీ, శ్రీ రాజచంద్ర మిషన్ నుండి, డా. భవానీ రావ్, అమృతా విశ్వపీఠం నుండి, మాస్టర్ జి, గాడ్ హోమ్ జర్నీ నుండి, మాస్టర్ మేనూద్, టెంపుల్ ఆఫ్ కాన్షియస్ నెస్ నుండి ఆసీనులయ్యారు.  ఆ తరువాత భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకర్ గారు, శ్రీమతి సుధేష్ణ ధనకర్ గారు, కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్,  పూజ్య దాజీ వేదికను అలంకరించడం జరిగింది. ఉపరాష్ట్రపతి తనకు వేసిన ప్రత్యేక ఆసనం తీయించేసి, మామూలు కుర్చీ వేయించుకున్నారు ఆసీనులవడానికి. 
ఈ చారిత్రాత్మక గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం కేవలం ప్రారంభం మాత్రమే. ఇది సాకారమవ్వాలంటే, దీన్ని నిజంగా నమ్ముతున్న ప్రతి వ్యక్తీ త్రికరణశుద్ధిగా ప్రార్థించవలసి ఉంది.  పరిశుద్ధ హృదయంతో, స్పష్టమైన ఉద్దేశంతోనూ, ప్రయోజనంతోనూ, ఈ సంకల్పాన్ని ప్రార్థనాపూర్వకంగా మన మనసులో ధారణ చేసినట్లయితే తప్పక సాకారమవుతుంది. అలాగే దీని వెనుక ఉంది నడిపిస్తున్న మన గురుపరంపరకు ఈ అవార్డు దక్కుతుందన్నారు. 

ఆ తరువాత మన ఇతివృత్తం అయిన - అంతరంగ శాంతి నుండి విశ్వ శాంతికి అనేది సిద్ధించడం కోసం, సాకారమవడం కోసం, పూజ్య దాజీ ఆధ్వర్యంలో అందరూ ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయడం జరిగింది. ధ్యానం తరువాత కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్, ప్రసంగిస్తూ ఒక ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఆమె ఆంగ్లంలో అన్న మాటలు ఈ విధంగా ఉన్నాయి: 

"Your Excellency, Vice-President Shri Jagdeep, distinguished guests, partners, colleagues, friends, my heartfelt greetings to you all. It is a genuine honour to return to this magnificient place. Vision, ingenuity and labour has transformed what was once harsh, and a depleted land into a lush green campus with rain-forests full of thriving endemic and endangered species, medicinal and edible plants and organic farms. This site has become the testament to harmony with Nature. Every step one takes through the Yatra Garden and these hallowed hoards is an encounter with tranquility and renewal. We stand today in the physical representation of the heartfulness you have been practising and sharing for so many years. And as we gather here, in the month before the 125th birthday  of Babuji, it is a fitting monument to his lasting legacy. The imprint of his life, humble service, devotion and love is unmistakable. It echoes in the demeanour of everyone present here. And since reflected constantly in the vision and leadership offered by our dear friend and brother Daaji, who has once again welcomed us, so gracefully to this wonderful place. 
The Commonwealth is a family and we are 56 nations and 2.5 billion people stretched across five continents and six oceans. And our collective heart beats with the shared values of peace, understanding and mutual respect. Daaji as the guiding force behind the heartfulness, you embody these values. Your wisdom, your compassion and your unwavering commitment to the spiritual well-being of humanity shines through you and through this movement. Your leadership has nurtured the growth of heartfulness and in doing so, you have touched the lives of countless people across the globe, across a hundred and sixty countries and more than 5 million practitioners with the dedicated support of 16000 volunteer trainers operating in over 5000 centres worldwide. Your impact extends far and wide. Heartfulness has become a global force for inner transformation creating ripples which transcend continents and cultures sowing seeds of mindfulness, compassion and spiritual well-being across the world. Your teachings resonate deeply offering a pathway to peace and self-discovery. And your approach to meditation and spirituality is both profound and accessible, guiding seekers on a journey towards a harmonious existence. This vision has cultivated a heartfulness community centred around love, unity and mindfulness offering solace and spiritual nourishment to seekers from diverse backgrounds in an increasingly chaotic world. Your unwavering commitment to service coupled with your profound understanding of the human heart creates a legacy of grace, humility, inspiration and boundless compassion. In our life we all try to create and send out our own positive ripples of change; the ripples you have created are fast and lasting. They can build a current which can sweep down even the mightiest wall of resistance and provide us all the constant inspiration. In your honour and in the honour of your vision and leadership, and your unwavering commitment to service, as Secretary-General of the Commonwealth of Nations, I am proud and honoured to bestow on you the title - The Global Ambassador for Peace-building and Faith in the Commonwealth." 


కామన్ వెల్త్ జెనరల్ సెక్రటరీ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్  ఈ అద్భుతమైన ప్రసంగం చేసిన తరువాత సభలో ఉన్నవారంతా ఆనందాశ్రువులతో కరతాళ ధ్వనులు చేశారు. ఆ పిదప ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఆశ్చర్యమే కాదు; సరైన స్థానం నుండి యోగ్యత కలిగిన వ్యక్తికి, సరైన గుర్తింపు లభించిందన్నారు. పూజ్య దాజీని హృదయపూర్వకంగా అభినందించారు. శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్ మాట్లాడిన ప్రతీ మాట పరమ సత్యము, గోడ మీద వ్రాయదగ్గ మాటలన్నారు. మేడమ్ సరైన సమయంలో సరైన దిశలో నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యంగా ప్రస్తుతం మనం అనుభవిస్తున్న భీకర పరిస్థితుల్లో పరిష్కారాలు వెతుకుతున్న సమయంలో ఇది చాలా గొప్ప నిర్ణయం. పరిష్కారాలు ఈ పుణ్యస్థలి నుండే వస్తాయి. గాంధీని మహాత్ముడు చేసిందెవరు, సుభాస్ చంద్ర బోస్ ని నేతాజీ చేసిందెవరు? ప్రజలు. ఇక్కడ ఆలోచనా విధానానికి, అకుంఠిత సేవకు, గుర్తింపునిస్తున్నది కూడా ప్రజలేనన్నారు ఉపరాష్ట్రపతి. ఇది నన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నప్పటికంటే చాలా ఆనందకరమైన వార్త నాకు, అని తన ప్రసంగాన్ని ముగించారు. 

ఆ తరువాత పూజ్య దాజీ పురస్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డు వ్యక్తిగతమైనది కాదని, ఇది హార్ట్ఫుల్నెస్ సంస్థను గుర్తించడమని, కాబట్టి ఈ పురస్కారం హార్ట్ఫుల్నెస్ కి దక్కిందని, శిరస్సు వంచి అభివాదం చేశారు. ఇక్కడున్న 300 కు పైగా సంస్థలన్నీ మనందరమూ కలిసికట్టుగా పని చేస్తే ఈ భువిని స్వర్గంగా మార్చేయవచ్చు; దేవతలు పై నుండి చూసి మనుషులు భూమ్మీద స్వర్గం సృష్టించారని సంతోషిస్తారు. కష్టం కాదు, తలచుకుంటే. కాస్త ఆసక్తి కావాలంతే. ఉదయం 5 నిముషాలు, సాయంకాలం 5 నిముషాలు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఆ భగవంతుని ధ్యానిస్తే ఆయన మన ద్వారా ఎన్ని పనులు చేయించుకుంటాడో చూడండి. ధన్యవాదాలు అని తన ప్రసంగాన్ని ముగించారు.  

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - మూడవ రోజు ముగింపు సమావేశం 16.3.2024

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం - మూడవ రోజు ముగింపు సమావేశం16.3.2024

మూడవ రోజు, సాయంకాలం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకర్ గారు, శ్రీమతి సుధేష్ణ ధనకర్ గారు, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై  గారు, కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్,  భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖామాత్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక ఎమ్. ఎల్. ఎ. శ్రీ శంకర్ గారు, పూజ్య దాజీ, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ పెద్దలైన టోనీ నాడర్ గారు, బ్రహ్మకుమారి శ్రీ మృత్యుంజయ గారు, బాబా జైన్ గారు, మాస్టర్ జీ, వేదికను అలంకరించడం జరిగింది.

అనేక ప్రముఖులు ప్రసంగించిన తరువాత పూజ్య దాజీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు కాన్హా శాంతి వనాన్ని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు పలికారు. అలాగే ఈ గ్లోబల్ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని జరపడం ఇదే మొదటి సారి అని, చరిత్ర ఇక్కడే సృష్టించబడుతోందని, బహుశా ఈ మహోత్సవం ప్రతీ సంవత్సరం ప్రపంచామంతటా జరిగే అవకాశం ఉందని వారు ప్రకటించారు. ఈ ఉదయం దాజీ, ఇక్కడ పాల్గొన్న ఇమామ్ గారిని సాగనంపడానికి వెళ్ళినప్పుడు, ఇమామ్ గారు పూజ్య దాజీతో, " దాజీ, నా కొడుకు ధ్యానం ప్రారంభిస్తాడు; అలాగే మా ఆధ్వర్యంలో ఉన్న 3 లక్షల మదరసాల పిల్లలకు మీ కాన్హాలో బ్రైటర్ మైండ్స్ శిక్షణానివ్వాలని" కోరడం జరిగిందని దాజీ చక్కటి వార్తను తెలియజేశారు. ఇన్ని సంస్థలు కలిసి రావడం చాలా అమితమైన ఆనందాన్ని కలిగించింది, కానీ మరిన్ని సంస్థలు కలవాలని ఆశిస్తున్నాను, అన్నారు. కలిసి రావడం మొదటి మెట్టు మాత్రమే, ప్రారంభం మాత్రమే, కలిసి పని చేయడం రెండవ అడుగవ్వాలి. అప్పుడే అది పురోగతిగా తర్జుమా అవుతుంది. చాలా మంది ఈ మహోత్సవ ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు; దానికి నేను, ప్రస్తుతానికి అందరమూ కలవడం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం, ఒకర్నొకరు తెలుసుకోవడం. ఆ తరువాత మనం ప్రపంచామంతటా కార్యక్రమాలను అమలు చేసినప్పుడు, వివిధ సంస్థల వలంటీర్లందరూ కలిసి ఒకే కార్యక్రమాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలున్నాయి, వాటిని ఎస్. డి. జి. గోల్స్ అంటారు - అన్ని రకాల కాలుష్యాలను పోగొట్టడం -మట్టి కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, స్త్రీలకు విద్య, సమానత్వం, పేదరికాన్ని నిర్మూలించడం ఇలా ఎన్నో లక్ష్యాలున్నాయి. కానీ అన్నీ సమస్యలకూ మూల కారణమైనదాన్ని వాళ్ళు మరచిపోయారు - అదే మానసిక కాలుష్యం, ఆలోచనా కాలుష్యం. అన్ని కాలుష్యాలకీ మూల కారణం ఆలోచనా కాలుష్యమే. అందుకే ధ్యానం చాలా అవసరం. క్రమశిక్షణలో ఉన్న మనసు సరైన విచక్షణ కలిగి ఉంటుంది, ప్రలోభాలకు గురి కాదు, అతీతంగా ఎదిగిన మనసు తప్పుడు ఆలోచనలు చేసే అవకాశమే ఉండదు; ఇది కేవలం ధ్యానం వల్లనే సాధ్యం; అందుకే ధ్యానం అందరికీ అవసరం. దైవం ఒక్కటే. అన్నీ మతాలు చెప్పేది అదే. దైవం అంటే ప్రేమ ; ప్రేమ అంటేనే శరణాగతి. శరణాగతి అంటే ఓడిపోవడం కాదు. నా ఆహాన్ని సంపూర్ణంగా తొలగించేసుకున్నాను, నీవే నా సర్వస్వం అనే అంతరంగ స్థితి శరణాగతి అంటే. ఎ మతానికి చెందినా సరే, ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, హిందువు మంచి హిందువవుతాడు, ముస్లిం మంచి ముస్లిం అవుతాడు, క్రైస్తవుడు సరైన క్రైస్తవుడవుతాడు, వగైరా, వగైరా. మీ ధర్మాన్ని మీరు సక్రమంగా పరిపూర్ణంగా పాటిస్తే యుద్ధాలుంటాయా? ఉండవు; ఉండటానికి వీల్లేదు. నా గురుదేవులు బాబూజీ మహారాజ్ గారు అంటూండేవారు,  మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించుకోవడంలో తప్పేమీ లేదు, కాని అవతలివారిని మరింత గొప్పవారుగా భావించమనేవారు. మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించుకోండి, తప్పు లేదు; కాని అవతలి వ్యక్తి మీకంటే గొప్పవారని భావించండి. 

కాబట్టి ఈ అవగాహనతో, ఈ ప్రశాంత చిత్తంతో, ప్రతి రోజూ ధ్యానించండి; రోజూ చేసే నమాజ్ చేయండి; మీరు చేసే పూజలు చేయండి; ఇవన్నీ చేస్తూ హృదయాలు తెరిచి ఉంచండి, ప్రేమతోఉండండి, భగవదనుగ్రహాన్ని అందుకునే స్థితిలో ఉండండి; హృదయాన్ని ఖాళీగా ఉంచండి; భయంతో కాదు, కేవలం ఒక ఆచారం కాకూడదు, ప్రలోభంతో కాకూడదు. ప్రేమ కోసమే ప్రేమతో ఇవన్నీ పాటించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మీరు మారతారు; ఒకసారి మీరు మారారంటే, ప్రపంచం కూడా మారుతుంది. 

ఆ తరువాత వేదికపై ఉన్న పెద్దలందరూ మాట్లాడటం జరిగింది. ముఖ్యమైన ముగింపు ప్రసంగం భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్  ధనకర్  గారు చేస్తూ, ఆధ్యాత్మికత యొక్క అవసరాన్ని, ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను, మన దేశానికి గల ఆధ్యాత్మిక సంపదను గుర్తు చేయడం జరిగింది. కాన్హా శాంతి వనం నుండి ఒక గొప్ప తరంగం ఎగిసి మొత్తం ప్రపంచాన్నంతటినీ ఆవరించబోతోందని ఎంతో ఆత్మవిశ్వాసంతో పలికారు. కాన్హా శాంతి వనం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా అభివర్ణించారు. నిజానికి ఈ సమావేశం తరువాత కార్యక్రమం ప్రకారం నేను వెళ్ళిపోవాలి గాని, నేను ఇక్కడే మీ అతిథిగా మరో పూట ఉండబోతున్నాను అని పూజ్య దాజీని కోరారు. 

ఉపరాష్ట్రపతి ప్రసంగం తరువాత అందరూ జాతీయగీతాన్ని ఆలపించారు. ఆ తరువాత ఒక సాంస్కృతిక కార్యక్రమంతో ఈ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం అధికారికంగా ముగింపుకు వచ్చింది. 

20, మార్చి 2024, బుధవారం

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - మూడవ రోజు 16.3.2024

 



గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం - మూడవ రోజు  16.3.2024

ఉదయం ప్లీనరీ సెషన్ లో ఆరుగురు ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది - డా. ఇమామ్ ఉమేర్ అహమద్ ఇలియాసి, ఆల్ ఇండియా ఇమామ్ కాన్ఫెడరేషన్ అధ్యక్షులు, శ్రీ అభిజీత్ హల్దార్ జీ, ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బుద్ధిస్టస్  అధ్యక్షులు, సద్గురు శ్రీ రితేశ్వర్ జీ మహారాజ్, ఆనంద్ ధామ్  ట్రస్ట్, బృందావన్ వ్యవస్థాపకులు. ఫాదర్ ఆంథోనీ పూలా, కార్డినల్, ఆర్చ్ బిషప్ హైదరాబాద్, వెనరబుల్ భిక్కూ సంఘసేన, వ్యవస్థాపక అధ్యక్షులు, మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, లద్దాఖ్, ఆదరణీయ ఆత్మప్రీత్  విధీజీ, శ్రీమద్ రాజచంద్ర మిషన్, ధరంపూర్, అడ్వైజర్ టు ఇంటర్ ఫెయిత్ ఆర్గనైజేషన్స్. వారు పలికిన కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:  

ఆత్మ శుద్ధి జరిగితేనే తప్ప శాంతి సిద్ధించదు.

 స్ఫర్ధలు తొలగిస్తే శాంతి రాదు; స్ఫర్ధలు తొలగించలేము; గనుక స్ఫర్ధలతో యే  విధంగా వ్యవహరించాలన్నది నేర్చుకోవాలి.

మతం మనలను ఏకం చేస్తే ఉపయోగం; మతం మనలను విడదీస్తే దాని వల్ల ఉపయోగం లేదు.

- శ్రీ అభిజీత్ హల్దార్ జీ, ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బుద్ధిస్టస్  అధ్యక్షులు.

 జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండదు; జీవితమే ఒక లక్ష్యం అని నమ్ముతాను; జీవితానికి లక్ష్యం ఏర్పరచుకుంటే అశాంతి వచ్చేస్తుంది.

అంతరంగ శాంతి అన్నారు; బాహ్య శాంతి సాధించాలనుకోవడం ఇంచుమించు అసంభవం; 800 కోట్ల జనాభా ఉంది భూమ్మీద, అనేక రకాల స్వభావాలు; అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక సంస్కృతులు, సాంప్రదాయాలు, ఇన్ని ఉన్నప్పుడు బాహ్య శాంతి అసంభవం; కానీ బాహ్యంగా అస్సలు శాంతి లేకపోయినప్పటికీ మనసులో శాంతి కలిగి ఉండవచ్చు, ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండవచ్చు; దీనికి శ్రీకృష్ణుడే ఉదాహరణ. అటువంటి అంతరంగ శాంతి సంభవం.

సూర్యుడొచ్చాడంటే, ఆయనతోపాటు ప్రకాశం కూడా దానంతట అదే వస్తుంది; అలాగే అంతరంగ శాంతి వచ్చిందంటే ప్రపంచ శాంతి తనంతట అదే వస్తుంది.

- సద్గురు శ్రీ రితేశ్వర్ జీ మహారాజ్  , ఆనంద్ ధామ్  ట్రస్ట్, బృందావన్ వ్యవస్థాపకులు

 అంతరంగ శాంతి ఉన్న వ్యక్తి మాత్రమే ఒక శాంతియుతమైన కుటుంబాన్ని ఇవ్వగలడు. కేవలం మానసిక ప్రశాంతత ఉన్న వ్యక్తి మాత్రమే కరుణ చూపించగలుగుతాడు, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికీ అత్యున్నత సేవలను అందించగలుగుతాడు. 

కానీ ఈ అంతరంగ శాంతి మూలం ఎక్కడున్నదన్నది అతి పెద్ద ప్రశ్న. క్రైస్తవ మతం ప్రకారం ఈ అంతరంగ శాంతి విశ్వాసం ద్వారా కలుగుతుంది. అంతరంగ శాంతి భగవంతునితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా కలుగుతుంది; ఏసు పట్ల విశ్వాసం ద్వారా.

      - ఫాదర్ ఆంథోనీ పూలా, కార్డినల్, ఆర్చ్ బిషప్ హైదరాబాద్

 మనందరికీ ఖరీదైన రిస్ట్ వాచీలున్నాయి గాని, ఎవరికీ సమయం లేదు. మీకు ఇక్కడ వాచీలున్నాయి గాని సమయం లేదు, మా హిమాలయాలకు రండి, మా వద్ద వాచీలు లేవుగాని సమయం చాలా ఉంది. తీరికగా ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు.

మనందరికీ 2 జి, 3 జి, 4 జి, 5 జి, 6 జీలున్నాయి గాని గురూజీ లేరు.

యునెస్కో వాళ్ళు కూడా చెప్తారు: యుద్ధం మనసులోనే మొదలవుతుంది; అలాగే శాంతి కూడా మనసులోనే మొదలవ్వాలి; గనుక ఈ సమావేశం చాలా ముఖ్యం.

సైన్స్, ఆధ్యాత్మికత కలవాలి; సైంటిస్టులు ధ్యానం నేర్చుకుని వాళ్ళ జ్ఞానాన్ని మానవాళి సేవకు వినియోగించాలి; ఆధ్యాత్మిక వేత్తలు కూడా గ్రుడ్డి విశ్వాసంతో గాకుండగా, సైంటిఫిక్  దృక్పథంతో అన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడే శాంతి సంభవమవుతుంది.

ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటే, ఇందరు ఆధ్యాత్మిక గురువులు, ఇక ప్రేక్షక పాత్ర వహించడానికి లేదు.

-  వెనరబుల్ భిక్కూ సంఘసేన, వ్యవస్థాపక అధ్యక్షులు, మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, లద్దాఖ్

ఎప్పుడైతే ప్రేమ అనే శక్తి, శక్తి (అధికారం, శక్తుల) పట్ల ప్రేమను అధిగమిస్తుందో అప్పుడు ప్రపంచం అంతరంగ శాంతిని అనుభూతి చెందుతుందన్నారు మా గురుదేవులు. శక్తుల, అధికారాల కోసం వెంపరలాడినప్పుడు మనం శాంతిని కోల్పోతాం.

నిత్య దైనందిక జీవనంలో చిన్ని-చిన్ని విషయాల్లో కూడా మనం ప్రేమను వదిలేసి అధికారాలకే ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. మనం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ కూడా ప్రేమకు అధిక ప్రాధాన్యతనిస్తే అంతరంగ శాంతి వస్తుంది ప్రపంచంలో. కానీ మీరు శాంతిని కాక్షయించినట్లయితే, మీకు రెండూ సిద్ధిస్తాయి. 

ఆదరణీయ ఆత్మప్రీత్  విధీజీ, శ్రీమద్ రాజచంద్ర మిషన్, ధరంపూర్, అడ్వైజర్ టు ఇంటర్ ఫెయిత్ ఆర్గనైజేషన్స్

సిఖ్ మతం ప్రకారం అంతరంగ శాంతికి  మూడు మూలస్తంభాలు ఆధారంగా ఉన్నాయి:  1) నామ్  జప్  నా 2)  కిత్ కరణీ ఔర్ 3) వన్ ఛకణా  

మన అంతరంగ శాంతికి శత్రువులు – కామం, క్రోధం, లోభం, మొహం, అహంకారం. వీటిని భగవన్నామ జపంతో జయించి అంతరంగశాంతిని పెంపొందించుకోవచ్చు.

రెండవది, నిజాయితీయైన సంపాదన వల్ల అంతరంగ శాంతి పెరుగుతుంది.

వన్ ఛకణా అంటే మన సంపాదనలో పదవ వంతు సమాజానికి ఖర్చు పెట్టడం, అప్పుడే అంతరంగ శాంతి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అహంకారం తగ్గుతుంది.

డా. దిల్ షా సింగ్ ఆనంద్, శిరోమణి, గురుద్వారా ప్రబంధక కమిటీ 

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - రెండవ రోజు 15.3.2024

 గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం - రెండవ రోజు  15.3.2024

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం, రెండవ రోజు అంటే మార్చ్ 15 వ తేదీన ఉదయం 9 గంటలకు ప్లీనరీ సెషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై ఇస్కాన్ కు చెందిన గౌర్ గోపాల్ దాస్, రామకృష్ణ మిషన్ కు చెందిన స్వామి ఆత్మప్రియానంద, బ్రహ్మ కుమారీ ఉషా బెహన్, పద్మభూషణ్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు పూజ్య దాజీతో పాటు ఉన్నారు. భారత్ ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున శ్రీమతి రంజనా చోప్రా గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది.
 
ఆ తరువాత హార్ట్ఫుల్నెస్ తరఫున పూజ్య దాజీ మొట్టమొదటగా ప్రసంగిస్తూ, వచ్చినవారిని ఋషులని సంబోధించారు.  ప్రసంగంలోని కొన్ని ముఖ్య అంశాలు - ఇంతమంది మహానుభావులు ఒక ఉత్కృష్టమైన లక్ష్యం కోసం, ఒక్కచోట  సమావేశమవడం చాలా ప్రశంసనీయం. మతాలనబడే, విశ్వాసాలనబడే వాటి ద్వారా ఎన్నో యుద్ధాలు జరగటం, వీటి పేరుతో జనాలను విడదీయడం ఈ ప్రపంచం సాక్షిగా ఉంటూనే ఉంది. మతాలతో సమస్య లేదు కానీ, మతాన్ని నమ్మేవారితోనే, వాటిని వ్యాఖ్యానించేవారి వల్లే అనవసరమైన సమస్యలున్నాయని కోఫీ అన్నన్ గారన్నారని ఉటంకించడం జరిగింది. వివిధ మతాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక పరిమళం వెదజల్లేటువంటి పువ్వుల్లాంటివి; ఒక్కొక్క మతం/సంస్థ ఒక్కొక్క గొప్ప గుణానికి నిదర్శనం; ఇస్కాన్ భక్తికి, క్రైస్తవం కరుణకు, ఇస్లాం సోదరభావానికి, ఇలా ... ; ఒక్కసారి ఊహించండి, ఈ గుణాలన్నీ కలిపితే ఏమవుతుందో.. మనం విడి-విడిగా ఎందుకుండాలి? సహనం ఉండాలని ఎప్పుడు విన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక భర్త ఒక భార్యను గాని, ఒక భార్య ఒక భర్తను గాని నేను నిన్ను సహిస్తున్నాను అని అంటే ఎలా ఉంటుంది? సహించడం కాదు, మనం అంగీకరించాలి, యథాతథంగా ఒకర్నొకరు స్వీకరించగలగాలి. అప్పుడే శాంతి, సామరస్యం సాధ్యం. అన్నీ ఆత్మలు వర్షంలో నీటి చుక్కల్లా సముద్రంలో కలిసిపోవాలి;  నూనె చుక్క సముద్రంలో కలవగలదా? సముద్రంలో ఉన్నా ఎప్పటికీ కలవదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క తత్త్వం ప్రతీ ఆత్మలోనూ ఉండాలి, అప్పుడే అందులో లయమవుతుంది. విశ్వాసం ఎప్పుడొస్తుంది? అనుభవం ద్వారా వస్తుంది. సరైన దారిలో ఉన్నామని మార్గదర్శనం చేసేది మనలో ఉన్న ఈ హృదయం. 

ఆ తరువాత వేదికపై ఉన్న ఇతర ప్రతినిధులు మాట్లాడటం జరిగింది. 

సాయంకాలం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆమె కాన్హా శాంతి వనానికి విచ్చేయడం ఇది రెండవసారి. ఆమె అద్భుతమైన ప్రసంగం చేశారు. రాష్ట్రపతి వేదికపైకి వచ్చిన వెంటనే, ఆ తరువాత ఆమె ప్రసంగం ముగిసిన తరువాత  జాతీయ గీతం ఆలపించడం జరిగింది. 
ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, మినిస్టర్ ఆఫ్ స్టేట్, భారత పార్లమెంటరీ అఫైర్స్, సంస్కృతి మంత్రిత్వ శాఖకు చెందిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు స్వాగతోపన్యాసం చేయడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయం - 1895 లో మిచిగాన్ యూనివర్సిటీ, అమెరికాలో స్వామి వివేకానందను ఒక మహిళ ప్రశ్న వేస్తుంది - మీ దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడొస్తుంది?  అని అడిగింది, దానికి స్వామీజీ, సుమారు 50 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వచ్చేస్తుంది, అటువంటి పరిస్థితులు అప్పటికి ఏర్పడతాయని సమాధానమిచ్చారు. అలాగే కార్ల్ మార్క్స్ జన్మించిన 100 సంవత్సరాలకు రష్యాలో ఒక విప్లవం వస్తుందన్నారు. అలాగే భారత దేశం 21 వ శతాబ్దంలో ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువుగా పరిణమిస్తుందన్నారు. ఈ మూడు భవిష్య వాణీలను స్వామి వివేకానంద 1895 లోనే పలికారని మంత్రిగారు చెప్పడం జరిగింది; అందులో రెండు ఇప్పటికే సాకారమయ్యాయి; ఇక మూడవది ఈ అమృత్ కాల్ లో సంభవించనున్నదని ఈ గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం తెలియజేస్తున్నదని ప్రసంగాన్ని ముగించారు. 

18, మార్చి 2024, సోమవారం

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - మొదటి రోజు 14.3.2024



గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం - మొదటి రోజు 14.3.2024

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం, కాన్హా శాంతి వనం, హైదరాబాదులో మార్చ్ 14 వ తేదీ సాయంకాలం పూజ్య దాజీ, సామూహిక ధ్యానం నిర్వహించిన తరువాత శంకర్ మహాదేవన్ సంగీత విభావరితో ప్రారంభమయ్యింది. 

సంగీతం అన్ని భాషలను, అన్ని సంస్కృతులనూ దాటి ఎటువంటి హృదయాన్నయినా స్పృశించేటువంటి గొప్ప సాధనం, సమర్పణ భావంతో భగవంతుని చేరే ఆరాధనా పద్ధతి అన్నారు స్వామి వివేకానంద. 

అనేక ఆధ్యాత్మిక సంస్థల, అన్ని ధార్మిక సంస్థల అధిపతులు అప్పటికే విచ్చేయడం పూజ్య దాజీ వారందరినీ ఆహ్వానించడం జరిగింది అంతకు ముందు. ఆ దృశ్యాలు అనిర్వచనీయమైన పరవశాన్ని కలిగించాయి, ప్రేక్షకులకి.
 
ఆ తరువాత ప్రముఖ గాయకులు, గ్రామీ అవార్డ్ గ్రహీత, పద్మశ్రీ శంకర్ మహాదేవన్ గారు సర్వమతాలనూ ఉద్దేశిస్తూ స్వయంగా స్వరపరచిన గీతాలతో సహా అనేక ప్రసిద్ధ గీతాలను  ఆలపించి అందరినీ అలరించారు, చక్కటి ప్రారంభం అనిపించేలా వాతావరణాన్ని సృష్టించారు. 

ఈ క్రింది యూట్యూబ్ లింకును క్లిక్ చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షించవచ్చు:





 

15, మార్చి 2024, శుక్రవారం

షికాగో - పార్లమెంట్ ఆపఫ్ రెలీజియన్స్ - సర్వమత సమ్మేళనం 1893

 



                షికాగో - పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్                     సర్వమత సమ్మేళనం 1893 

ప్రపంచంలో మొట్టమొదటి సర్వమత సమ్మేళనం 1893 లో అమెరికాలోని షికాగో నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనం జగద్విదితం కావడానికి హిందూమతం తరఫున, భారతదేశ సంస్కృతికి ప్రతినిధిగా స్వామి వివేకానంద వెళ్ళి మొత్తం విశ్వాన్నే ఆలోచింపజేసే ప్రసంగాలు ఇవ్వడం మనందరికీ తెలిసినదే. 

ఈ 1893 సమ్మేళనంలో స్వామీజీ మతమౌఢ్యాన్ని అంతం చేయాలని, ప్రతీ మతం, ప్రతీ ఆధ్యాత్మిక పథమూ, బావిలో కప్పలా తానే గొప్పదన్న భావనలను వీడాలని, ఒకర్నొకరు భరించడం గాక, ఒకర్నొకరు మనస్ఫూర్తిగా స్వీకరించగలగాలని గొప్ప పిలుపునివ్వడం జరిగింది. 

స్వామీజీ అందించిన ఆలోచనలను ఇప్పటికీ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం; ఇంకా మతయుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి; అశాంతి పెరుగుతూనే ఉంది. మనశ్శాంతి లేకుండా సామరస్యం ఎలా ఉంటుంది? 

ఈ నేపథ్యంలో 130 సంవత్సరాల తరువాత మరల ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి సమావేశం జరగడం కొనియాడదగ్గది. ఇప్పటికైనా అర్థం చేసుకుని, జీర్ణించుకుని, ప్రతీ మానవుడు తన వ్యక్తిగత మనశ్శాంతి ద్వారా ప్రపంచశాంతికి తోడ్పడాలని ప్రార్థిద్దాం, కలిసి కృషి చేద్దాం. పరస్పరం గౌరవించుకుందాం, పరస్పరం ఒకర్నొకరం భరించడం కాదు, అంగీకరిద్దాం. 

14, మార్చి 2024, గురువారం

Rev. Babuji's Letter to the UN

 

Rev. Babuji's Letter to the UN

(Letter to the U.N.O)
N.B349 / SRCM

Shahjahanpur, U.P.
Dated 8th July 1957

Dear Sir,

I am glad to receive your bulletin and I pour forth my warm thanks for the awakening for peace created among our brethren of the world. The idea of peace common in all minds, though shattered by the self of the individual mind, is working on individualistic basis to gain one’s own end on account of the narrow mindedness of people. To dissipate the idea of individual self and to work harmoniously for the common good is the demand of the time. The conferences and meetings held for the purpose may only be like spark to offer a temporary glow to the scattered fragment of peace. Their cries in the wilderness will not carry far on the path of success because of the material agony of faith working at the bottom.

What we, therefore, require at present is only to improve the morals and to discipline the mind. We must learn how to create within the heart a feeling of universal love, which is surest remedy of all evils and can help to free us from the horrors of war. I perfectly agree with our friend late Mr. Bernard Malan when he expresses his faith to unite in the common search for happiness. Happiness, of course, is necessary to end all grief. But it is like the Black wall of the scientists, which does not allow them to proceed further towards universal love. To come up to the level of real happiness we must necessarily rise above ourselves, which is essential for the creation of atmosphere of universal love.

That is the primary factor in the solution of the problem. India has ever since been in search of it. She did not encroach upon other countries for war and blood shed not for reason of her cowardice but because she realized her pious duty towards humanity. They were happy in their own homes in spite of the torturous incursions of their nations. These tortures were to them nothing but flowers sent by the Divine Master to coach them to proper steps necessary for the uplift of mankind individually and collectively.

The seed of it is so deeply laid that still its branches bear blossoms filling the air with the sweet fragrance of peace and happiness. It is so firmly rooted that even the worst tempest cannot uproot it. Such are the things necessary for the uplift of mankind, which everyone, occidental or oriental must treat as a part of his duty. Unless the foundation of peace is made to rest on spiritual basis no better prospects can be expected. It is but definite and certain that sooner or later we will have to adopt spiritual principles if we want to maintain our existence. If the material force can avert the incursions and attacks, blood shed cannot be avoided because even then we have to apply force causing thereby bloodshed on either side. Arrogance cannot be stopped by material force. It is only the spiritual force, which can remove the causes of war from the minds of people.

How to introduce these things among the masses who are yet unfamiliar with the accuracy of the mark is the next problem and is equally intricate. If my opinion were to be invited I would lay down the simplest possible method as given below.

Let all brothers and sisters sit daily at a fixed hour individually at our respective places and meditate for about an hour thinking that all people of the World are growing peace-loving and pious.

This process, suggested not with exclusively spiritual motives, is highly efficacious in bringing about the desired result and weaving the destiny of the miserable millions. With prayer for the success of your noble mission.

Yours sincerely,
Ram Chandra
President,
Shri Ram Chandra Mission
Shahjahanpur,U.P.,India

- (From letters of the Master, Volume I, page number 130,131 & 132)

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...