24, ఫిబ్రవరి 2024, శనివారం

గురువు లేక మాస్టర్ - 3

 


గురువు లేక మాస్టర్ - 3 

ఇటువంటి యాత్రను బాబూజీ కేవలం ఒకే ఒక్క జీవితకాలంలో తన ప్రాణాహుతి ప్రసరణ శక్తి చేత పూర్తి చేయగలిగే అవకాశం ఉందన్నారు. అంటే ఒక్క మానవ జన్మ అటువంటి సమర్థ గురువుతో జీవించినట్లయితే, కొన్ని కోట్ల జన్మల స్వప్రయత్నంతో సమానం అన్నమాట. మరో ముఖ్యమైన విషయం - మాస్టర్ అనుగ్రహం లేనిదే మొదటి బిందువు నుండి కదలడం కూడా అసాధ్యమే. 

కాబట్టి ఈ యాత్ర ఒకే జీవితకాలంలో పూర్తయ్యే అవకాశం, కేవలం మాస్టర్ యొక్క అపారమైన ప్రేమ వల్ల, కరుణ వల్ల, వారి దివ్యానుగ్రహం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. వారండిస్తున్న ఈ సేవకు మనం ఎప్పటికీ వారి రుణం తీర్చుకోలేం. గురుదేవులను సంతోష పెట్టగలిగే మార్గాలు కేవలం ఇవే బహుశా - 1) ఆయన పట్ల విధేయటగా ఉండటం 2) మనలో పరివర్తన రావడం కోసం ప్రయటనలోపం లేకుండా చిత్తశుద్ధితో కృషి చేయడం 3) వారు మనం ఎ విధంగా తయారవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా తయారవడం 4) ప్రతి రోజూ మనలో కొంతైనా పరివర్తన జరిగే విధంగా జీవించడానికి ప్రయత్నించడం - ఇదే వారికి గురుదక్షిణ అంటారు మాస్టరు.  


1 కామెంట్‌:

ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి?

 ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి?  ఒక్కసారి సమర్థ గురువు తటస్థమయిన తరువాత, గురుదేవులు  చేయమన్నారు కాబట్టి చెయ్యాలి, అంతే.   తక్కిన కారణాలేమయ...