29, ఫిబ్రవరి 2024, గురువారం

బాబూజీ సుప్రసిద్ధ ప్రత్యేక వాక్యాలు - 2





బాబూజీ సుప్రసిద్ధ ప్రత్యేక వాక్యాలు - 2

బాబూజీ, హృదయం అనే సముద్ర అగాథాల్లో  దాగి ఉన్న జ్ఞాన మౌక్తికాలను వెలికి తీసి, అస్సలు వ్యక్తం చేయలేని, అస్సలు భాషలో ఇమడని విషయాలను, అవ్యక్తమైనవాటిని కూడా  ప్రత్యేక వాక్య నిర్మాణం ద్వారా అభివ్యక్తం చేయడానికి ప్రయత్నించారు; మాటల్లో వీటిని వర్ణించలేము; మాటలు ఇక సరిపోవు; అని అంటూనే ఎన్నో అద్భుతమైన వాక్యాలను, అటువంటి అలౌకిక స్థితులను సూచించేటువంటి వాక్యాలను మనం తీరిక సమయంలో గాని, పనికట్టుకుని గాని మనన-ధ్యానాలు చేసుకునేందుకు వీలుగా, తద్వారా ఆధ్యాత్మిక లోలోతుల్లోకి తేలికగా వెళ్ళడానికి అవసరమైన ప్రేరణ కలిగించేలా మనకు వదిలి వెళ్ళారు. కాబట్టి జిజ్ఞాసువులు ఈ వాక్యాలను తగు విధంగా  మననం చేసుకొని, ధ్యానలోలోతుల్లో వీటి యదార్థ తత్త్వాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. బాబూజీ పలికిన మరిన్ని వాక్యాలు:

He alone who has travelled on the path up to the final point can guide others successfully.
ఎవరైతే ఆధ్యాత్మిక పథంలో చిట్టచివరి వరకూ ప్రయాణించారో, అటువంటివారు మాత్రమే ఇతరులకు విజయం చేకూరే విధంగా మార్గదర్శనం చేయగలుగుతారు. 

My definition of Mahatma as a 'non-being person' though somewhat peculiar is meaningful.
మహాత్మా అన్న పదానికి నా నిర్వచనం 'అస్తిత్వ-రహిత వ్యక్తి' అని. ఇది కొంత విచిత్రంగా అనిపించినా అర్థంతో కూడుకుని ఉన్నది. 

Our final destination is there where neither air nor light has any access. It is a perfectly lightless place without any motion or activity. 
I am however taking you all to that sphere of dreary desolateness which is beyond conception, and which is possibly the last limit of human approach.
మన పరమ గమ్యస్థానంలో గాలికి, వెలుతురుకు కూడా అందుబాటులో లేని చోటు; ఇది అస్సలు వెలుతురు లేని ప్రదేశం; ఎటువంటి కదలిక, ఎటువంటి క్రియలూ లేని ప్రదేశం. నేను మిమ్మల్ని అటువంటి నిర్మానుష్యమైన, ఏమీ లేనటువంటి, ఊహకందనటువంటి లోకానికి తీసుకువెడుతున్నాను; బహుశా అదే మనిషి చేరుకోగలిగే అందుబాటులో ఉన్న అత్యున్నత పరిధి.  

Powerlessness includes in itself the idea of power which is there in a stagnant state, just as it is at the Centre. Now the Centre is known to be the source of all power. Powerlessness is the root or the source of power or in a sense the greatest, unlimited power in itself.
శక్తిరాహిత్యంలోనే శక్తి అనే భావం ఉన్నది; కేంద్రంలో ఉన్నట్లుగానే నిద్రాణ స్థితిలో ఉంది. కేంద్రమే అన్నీ శక్తులకు మూలస్థానం. శక్తిరాహిత్యమే శక్తికి మూలం, ఉద్గమ స్థానం లేక అదే ఒక రకంగా అతిగొప్ప అపరిమితమైన శక్తి.  


26, ఫిబ్రవరి 2024, సోమవారం

బాబూజీ సుప్రసిద్ధ ప్రత్యేక వాక్యాలు - 1

 



బాబూజీ సుప్రసిద్ధ ప్రత్యేక వాక్యాలు - 1 

బాబూజీ ఆధ్యాత్మికంగా అత్యున్నత సూక్ష్మాతి సూక్ష్మ స్థితులకు చేరి, అస్సలు మాటల్లో వ్యక్తం చేయలేని ఆ స్థితులను అందరికీ అర్థమయ్యేలా అభివ్యక్తం చేసేవారు. ఆ ప్రయత్నంలో తాను స్వంతంగా తనదైన రీతిలో కొన్ని వాక్యాలను నిర్మాణం చేయడం, వాటిని పలకడం జరిగింది ఇంగ్లీషులో. వాటిల్లో కొన్నిటిని ధ్యానించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీషులో ఉన్న ఈ వాక్యాలను తెలుగులో తర్జుమా చేయడం పెద్ద సవాలు; న్యాయం చేయడం చాలా కష్టము. కాబట్టి ఇక్కడ చేసే ప్రయత్నాన్ని పాఠకులు విశాల హృదయంతో పరికించాలని ప్రార్థిస్తున్నాను. ఇక విషయంలోకి ఉపక్రమిద్దాం:

I'm telling you... 
నేను చెప్తున్నాను ...  

God is Simple.
దైవం చాలా సరళం. 

Freedom from freedom is real freedom.
స్వేఛ్చ నుండి స్వేఛ్ఛే అసలైన స్వేఛ్ఛ.  

More and more of less and less.
తక్కువ తక్కువ అనేది ఎక్కువ-ఎక్కువ అవ్వాలి. 

I don't want peace; I want the peace-giver.
నాకు శాంతి వద్దు; శాంతిని ప్రసాదించేవాడు కావాలి. 

Salt without saltishness.
ఉప్పదనం లేని ఉప్పు. 

All say, darkness to light, I say light to grey.
అందరూ చీకటి నుండి వెలుగు అంటారు; నేను వెలుగు నుండి ఉషస్సు రంగు అంటాను.  

Just move the neck and realization is there.
మెడను కాస్త కదపండి, సాక్షాత్కారం అక్కడే ఉంది.

End of end is the final state.
అంతం యొక్క అంతమే చిట్టచివరి స్థితి. 

Tastelessness has its own peculiar taste which too one must have a taste of.
రుచిలేనితనానికి కూడా ఒక విచిత్రమైన రుచి ఉంది, దాన్ని కూడా సాధకుడు రుచి తప్పక చూడాలి.    

24, ఫిబ్రవరి 2024, శనివారం

గురువు లేక మాస్టర్ - 3

 


గురువు లేక మాస్టర్ - 3 

ఇటువంటి యాత్రను బాబూజీ కేవలం ఒకే ఒక్క జీవితకాలంలో తన ప్రాణాహుతి ప్రసరణ శక్తి చేత పూర్తి చేయగలిగే అవకాశం ఉందన్నారు. అంటే ఒక్క మానవ జన్మ అటువంటి సమర్థ గురువుతో జీవించినట్లయితే, కొన్ని కోట్ల జన్మల స్వప్రయత్నంతో సమానం అన్నమాట. మరో ముఖ్యమైన విషయం - మాస్టర్ అనుగ్రహం లేనిదే మొదటి బిందువు నుండి కదలడం కూడా అసాధ్యమే. 

కాబట్టి ఈ యాత్ర ఒకే జీవితకాలంలో పూర్తయ్యే అవకాశం, కేవలం మాస్టర్ యొక్క అపారమైన ప్రేమ వల్ల, కరుణ వల్ల, వారి దివ్యానుగ్రహం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. వారండిస్తున్న ఈ సేవకు మనం ఎప్పటికీ వారి రుణం తీర్చుకోలేం. గురుదేవులను సంతోష పెట్టగలిగే మార్గాలు కేవలం ఇవే బహుశా - 1) ఆయన పట్ల విధేయటగా ఉండటం 2) మనలో పరివర్తన రావడం కోసం ప్రయటనలోపం లేకుండా చిత్తశుద్ధితో కృషి చేయడం 3) వారు మనం ఎ విధంగా తయారవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా తయారవడం 4) ప్రతి రోజూ మనలో కొంతైనా పరివర్తన జరిగే విధంగా జీవించడానికి ప్రయత్నించడం - ఇదే వారికి గురుదక్షిణ అంటారు మాస్టరు.  


23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

గురువు లేక మాస్టర్ - 2

 


గురువు లేక మాస్టర్ - 2

ఈ సృష్టిలోని జీవరాసుల జన్మలన్నిటి కంటే ఉత్కృష్టమైన జన్మ, మానవ జన్మ. మానవ జన్మ ఉత్కృష్టమైనది ఎందుకంటే, మానవ జన్మలోనే మోక్షప్రాప్తి సాధ్యపడుతుంది గనుక. అత్యున్నత ఆత్మవికాసం జరిగే అవకాశం ఉంది గనుక. అమీబా లాంటి ఏకకణ జీవి నుండి మనుష్య జన్మ వరకూ వికాసం లేక పరిణామం అనేది తనంతట అదే జరిగిపోతుందిట; మనుష్య జన్మ తరువాత కూడా ఈ పరిణతి దివ్యలోకాల్లో మళ్ళీ తనంతట అదే జరుగుతుంది; కానీ మానవ జన్మ వచ్చిన తరువాత మాత్రం, వికాస పథంలో ఇంకా ముందుకు సాగాలంటే, ప్రకృతికి ఈ ప్రక్రియలో ఇష్టపూర్వకంగా పాల్గొనేవారే కావాలట. కాబట్టి సాధకుడి ఇష్టం లేనిదే గురువు ప్రయత్నం ఫలించదు. అందుకే సహజ మార్గ సాధన ప్రారంభించాలంటే అర్హత సంసిద్ధత మాత్రమేనంటారు బాబూజీ. 

ఆధ్యాత్మిక యాత్రలో సాధకుడు ఎన్నో 'చక్రాల' గుండా ప్రయాణించవలసి ఉంటుంది. చక్రాలంటే ఒకే చోట కేంద్రీకృతమైన అసలైన దివ్య శక్తులు. ఒక్కొక్క చక్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన పరిణతి రావడం జరుగుతుంది సాధకుడిలో. చిట్టచివరి చక్రం యొక్క యాత్ర పూర్తయ్యే సరికి మానవుడికి అందుబాటులో ఉండే అతి ఉత్కృష్ట పరిణామ స్థాయిని చేరుకోవడం జరుగుతుంది. మనిషి తన ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఈ యాత్ర లేనిదే సాధ్యపడదు. గురువు ఉండటం వల్ల యాత్ర సుగమవడమే గాక ఎంతో అమూల్యమైన సమయం ఆదా అవుతుంది కూడా. ఈ చక్రాలు మనిషి వారసత్వంగా అందుకున్నవి. ఇవన్నీ ఈ శరీర వ్యవవస్థలోనే ఉన్నాయి. ఈ చక్రాల మధ్య చిక్కు దారాల వంటివెన్నో అల్లుకుని ఉంటాయి. ఈ అల్లుకుపోయిన చిక్కులతో కూడిన పొరల్లో అభ్యాసి ప్రయాణించవలసి ఉంటుంది. వీటిల్లో నుండి బయట పడటం సమర్థుడైన గురువు లేనిదే అసాధ్యం.

అభ్యాసి ఒక్క అడుగు ముందుకు వేస్తే, గురువు నాలుగు అడుగులు వేసి  ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది. అభ్యాసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోయినట్లయితే, గురువు అభ్యాసి వైపు వేసే నాలుగు అడుగుల ప్రయత్నం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. 

సహజ మార్గ పద్ధతిలో గురువు బోధించకుండా బోధిస్తాడు. గురువు ప్రతీ అభ్యాసికి అందుబాటులో ఉండగలిగేది ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారానే. గురువు తన అభ్యాసికి అందజేయవలసినదంతా ప్రాణాహుతి ద్వారా అందజేయడం జరుగుతుంది. 

సహజ మార్గ గురువులు లేక మాస్టర్లు తమ ప్రాణానికే ప్రాణమైన ప్రాణాహుతి ప్రసరణతో సాధకుల్లో అంతరంగ పరివర్తన సంభవింపజేస్తారు. 

గురువు లేక మాస్టర్ - 1

గురువు లేక మాస్టర్ - 1 

బాబూజీ ప్రకారం నిజమైన మాస్టర్ అంటే ఆ పరతతత్వమే, ఆపరమాత్మే.  భూమిపై అవతరించిన మాస్టర్లందరూ ఆ పరతత్త్వం యొక్క ప్రతినిధులు మాత్రమే. 

దుర్లభం త్రయం యేవ యేతద్ దేవానుగ్రహ హేతుకమ్ |
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః ||
- వివేకచూడామణిలో ఆదిశంకరులు

తాత్పర్యం:  
 మానవ జన్మ, మోక్షం కోసం తపన, మహాపురుషుడు, అంటే సమర్థుడైన గురువు యొక్క ఆశ్రయం - ఈ మూడూ చాలా దుర్లభం అంటారు ఆదిశంకరులవారు

సంస్కృత భాషలో 'గు' అంటే అంధకారం, ఆవిద్యా, అజ్ఞానం. 'రు' అంటే  ఆధ్యాత్మిక ప్రకాశంతో అంధకారాన్ని పోగొట్టేవాడు. కాబట్టి 'గురు' అంటే ఆధ్యాత్మిక వెలుగుతో అజ్ఞానాన్ని పోగొట్టేవాడని అర్థం. 

సహజమార్గంలో గురువు ప్రాముఖ్యత 
సహజ మార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతిలో గురువును మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే కేవలం ఆచార్యుడో లేక బోధించేవాడో మాత్రమే కాదు. మాస్టర్ అంటే కేవలం మార్గదర్శకుడు మాత్రమే కాదు. భగవంతునికి, మనిషికీ మధ్య వారధి గురువు అంటే. 

మాస్టర్ అంటే గమ్యాన్ని చేరుకునున్నవాడు; ఆ మార్గం గుండా పైకి-క్రిందకీ ఎన్నో మార్లు ప్రయాణించినవాడు; మన చేయిపట్టుకుని మనం ప్రస్తుత స్థితి నుండి చేరవలసిన గమ్యం వరకూ తీసుకు వెళ్ళగలిగే సమర్థుడు. మాస్టర్ అంటే ఉదాహరణగా జీవించేవాడు; మాస్టర్ అంటే ప్రాణాహుతి ప్రసరణ చేయగలిగినవాడు. మాస్టర్ అంటే మనలో క్రమశిక్షణ పెంపొందించగలిగేవాడు; మాస్టర్ అంటే పరిపూర్ణతను సిద్ధించుకున్న మహనీయుడు; మాస్టర్ అంటే మానవ స్థాయి నుండి అతీతంగా దైవిక స్థాయికి చేరుకున్న మహానుభావుడు; పరిశుద్ధ హృదయుడు. 
 
సహజ మార్గ పద్ధతిలో మాస్టర్ తమలాగే ఇతరులను కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. మాస్టర్ అంటే అన్నీ విధాలా తనపై తాను పట్టు సంపాదించుకున్నవాడు; మాస్టర్ అంటే స్వచ్ఛమైన ప్రేమ తత్త్వము, ప్రేమ స్వరూపుడు; మాస్టర్ నిస్వార్థ సేవకుడు, తనను తాను పట్టించుకోకుండా ఆవిశ్రాంతంగా నిరంతరమూ సేవలనందించేవాడు. మాస్టర్ లేనిదే సాధకునిలో ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవడమే సాధ్యం కాదు. సహజ మార్గంలో అభ్యాసి పాత్ర కంటే మాస్టర్ పాత్రే అధికం; కానీ అభ్యాసి సహకారం లేనిదే వారి ప్రయత్నం సరిగ్గా నెరవేరదు. సహజ మార్గ మాస్టర్లు తయారు చేసేది శిష్యులను కాదు, తమ వంటి మాస్టర్లను తయారు చేస్తారు. 

21, ఫిబ్రవరి 2024, బుధవారం

బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 4

 బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము  - 4










 

బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 3

బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము  - 3 













బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 2

 

బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము  - 2












బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 1

 

బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము












యాత్ర అంటే ఏమిటి?












17, ఫిబ్రవరి 2024, శనివారం

శ్రీరామచంద్ర మిషన్ - సహజ మార్గ చిహ్నం

 


శ్రీరామచంద్ర మిషన్ - సహజ మార్గ చిహ్నం (ఎంబ్లెమ్)

శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలో పైన కనిపిస్తున్న చిహ్నాన్ని అభ్యాసులందరూ ధరిస్తూ ఉంటారు. ఇది బాబూజీ ప్రవేశపెట్టిన క్రమశిక్షణ. కనీసం  మూడు ధ్యాన తరగతుల ద్వారా సహజ మార్గ సాధనలో ప్రవేశించిన వ్యక్తిని అభ్యాసి అని పిలుస్తారు. 

ఈ చిహ్నాన్ని గురించి బాబూజీ స్వయంగా తన "రియాలిటీ ఎట్ డాన్" (సత్యోదయం) అనే పుస్తకంలో వివరంగా వ్రాయడం జరిగింది. 

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేగఢ్ కు చెందిన మహా మహితాత్ముడైన  సమర్థ గురు, మహాత్మా శ్రీరామ చంద్ర జీ మహారాజ్ స్మృతిలో స్థాపింపబడిన ఈ సంస్థలో అనుసరించే ధ్యాన పద్ధతిని గురించి సంపూర్ణంగా పైన చిహ్నంలో పొందుపరచబడింది. దివ్యలోకాల నుండి పూజ్య లాలాజీ మహారాజ్, స్వామి వివేకానందలు అందించిన మార్గదర్శనంలో ఈ ఎంబ్లెం రూపొందించబడింది. ఈ సంస్థలో అనుసరించే ధ్యాన పద్ధతి పేరు సహజ మార్గం లేక సహజ పథం.

అడుగున స్వస్తిక చిహ్నం మన ఆధ్యాత్మిక యాత్ర యొక్క ప్రారంభస్థానాన్ని సూచిస్తుంది. ఇది, మనం మార్గంలో అనుసరించే  వివిధ రూపాలు, క్రతువులు, వివిధ ఆచారవ్యవహారాల దశను ఈ స్వస్తిక్ సూచిస్తుంది. హిందీలో 'సహజ మార్గ్ 'అనే అక్షరాలు, దారిలో ప్రకృతే స్వయంగా ఏర్పరచే కష్టాలు, అవరోధాలనే  పర్వతాలను  చీల్చుకుంటూ వెళ్ళే దారిని, ప్రకృతే స్వయంగా ఏర్పరచిన దారిని  సూచిస్తాయి. ఇలా వివిధ సాంద్రతలు గల వెలుగు-నీడల గుండా, పయనిస్తూ, చంద్రుడిని, సూర్యుడిని దాటుకుంటూ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మరింత సూక్ష్మ స్థితులను దాటుతూ అత్యున్నత శిఖరస్థితికి చేరుకుంటాం. ఉదయిస్తున్న సూర్యుడు వెదజల్లే వెలుగున్న ప్రదేశం సమర్థ గురు మహాత్మా శ్రీరామ చంద్రజీ ప్రారంభించిన నూతన ఆధ్యాత్మిక శకాన్ని సూచిస్తున్నది. ఈ వెలుతురు మనం సహజ మార్గంలో మన యాత్ర ప్రారంభమైనప్పటి నుండి అన్ని దశల్లోనూ అంతటా, ఆయా క్షేత్రాలపై ఆధిపత్యం వహిస్తూ ఈ వెలుగు వ్యాపించి ఉంటుంది. 

సృష్టి ఉనికిలోనికి రాక పూర్వం ఉన్నది చీకటేనని చెప్పాలి. చీకటి అంటే వెలుతురు లేదు; వెలుతురు అంటే చీకటి ఉండదు. వెలుతురు లేకపోతే ఉండేది ఏమిటి అని అంటే, చీకటి అనే చెప్తాం. మొత్తం సృష్టి అంతా మహాప్రళయంలో ముగిసిన తరువాత ఏముంటుంది? శూన్యత్వం అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ 'చీకటి', 'శూన్యత్వం' అనే పదాలు ఇంకా అందులో యేదో ఉన్నట్లుగానే తోచేలా చేస్తున్నాయి. కాబట్టి యదార్థం నుండి ఇంకా దూరంగా ఉన్నట్లే. పైన చెప్పినదాన్ని, వెలుగు లేని, చీకటి కూడా లేని స్థితి అని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో. అది మార్పులేనిది, సనాతనమైనది. మన ప్రస్తుత అస్తిత్వం, అదిగో అంత పరిపూర్ణమైన, అంత స్వఛ్ఛమైన స్థితి నుండి వికాసం చెందింది. చిహ్నంలో అన్నిటికంటే పైభాగంలో ఉంది ఈ శాశ్వత శాంతి ప్రదేశం. ఇక్కడ వెలుగు కానీ చీకటి కానీ ఉండదు. ఈ స్థితిని ఓమ్ తత్ సత్ అని సూచించబడింది దాని క్రింద 'సత్య పద్' అనే ప్రదేశం ఉంది; అక్కడ సత్య పదార్థం ప్రబలంగా ఉంటుంది; కాబట్టి చాలా సూక్ష్మ స్థితిలో ఉన్నా, ఇది వెలుతురుతో నిండిన ప్రదేశం. 

బాబూజీ స్వయంగా ఈ చిహ్నాన్ని తన హృదయభాగంలో ధరించేవారు; పూజ్య చారీజీ కూడా ఈ చిహ్నాన్ని ధరించేవారు;  ప్రస్తుతం పూజ్య దాజీ కూడా అదే హృదయ స్థానంలో బ్యాడ్జీ ధరించడం గమనించవచ్చు. ఈ చిహ్నం ప్రతి అభ్యాసి ధరించడం వల్ల, అభ్యాసికి తన జీవిత గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, సహజ మార్గ  ఫిలాసఫీని గుర్తు చేస్తూ ఉంటుంది; నిరంతరం ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అభ్యాసి దీన్ని ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా ధరించగలిగేది ఎప్పుడూ అంటే, తాను అవలంబిస్తున్న ధ్యాన పద్ధతిపైన, మార్గదర్శనం చేసే మాస్టరుపైన, ఈ ఆధ్యాత్మిక సేవలందిస్తున్న సంస్థపైన గట్టి నమ్మకం ఏర్పడినప్పుడు ఈ విధంగా ధరించగలుగుతాడు. 





16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి - 3

 




సాయంకాలం  శుద్ధీకరణ

హార్ట్ఫుల్నెస్  ధ్యాన పద్ధతిలో మూడవ యౌగిక ప్రక్రియ శుద్ధీకరణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో సాధకుడు తన సంకల్ప శక్తిని చురుకుగా వినియోగిస్తూ,  ప్రపంచంతో వ్యవహరించే సమయంలో తన హృదయంపై ఏర్పరచుకున్న ముద్రలను ప్రతి రోజు, ఏరోజుకారోజు తొలగించేసుకునే ప్రక్రియ. దీని వల్ల సాధకుడు  గతం నుండి క్రమక్రమంగా విముక్తుడవడమే గాక,  ఆ మరునాడు ధ్యానం చాలా తేలికగా లోలోతుల్లోకి వెళ్ళడానికి తోడ్పడుతుంది. శుద్ధీకరణ సాధకుడిలోని మలినాలను, జటిల తత్త్వాలను  తొలగించి, ధ్యానానికి అడ్డుపడే అవరోధాలను నిర్మూలిస్తుంది. ఈ శుద్ధీకరణ ప్రక్రియను ప్రతి రోజూ, ఆ రోజుకు సంబంధించిన  తన పనులన్నీ ముగించుకున్న తరువాత 20-30  నిముషాలు చేయవలసిన ప్రక్రియ.

 రాత్రి పడుకొనే ముందు ప్రార్థనా-ధ్యానం

ఉదయం ధ్యానం, సాయంకాలం శుద్ధీకరణ తరువాత రాత్రి సరిగ్గా పడుకొనే ముందు చేసేది ప్రార్థనా-ధ్యానం.  ప్రతి రోజూ చిట్టచివరిన చేసే పని. కోరికల్లేకుండా, వినమ్ర భావంతో, శరణాగతి ధోరణిలో భగవంతుని స్మరిస్తూ, సాధకుడు తన నిస్సహాయతను వ్యక్తం చేయడమే ప్రార్థన. ఇటువంటి ప్రార్థనాపూర్వకమైన స్థితి ఈ క్రింది నాలుగు పంక్తులను మనస్ఫూర్తిగా మనసులో అనుకున్నప్పుడు సంభవిస్తుంది. ఆ క్షణమే సాధకుడు తన అంతర్యామితో అనుసంధానమవడం జరుగుతుంది.  

ఓ, మాస్టర్!

మానవ జీవితమునకు యదార్థ లక్ష్యము నీవే.

మేమింకనూ కోరికలకు బానిసలమై యుండుట 

మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది.

మమ్ము ఆ దశకు జేర్చు, ఏకైక  స్వామివి, శక్తివీ నీవే.


ప్రారంభించు విధానం

ఈ ధ్యాన పద్ధతిని అనుసరించి ప్రయత్నించాలనుకున్నవారు, సమీప హార్ట్ఫుల్నెస్ ట్రైనరును, లేక సమీప ధ్యాన కేంద్రాన్ని సంప్రదించగలరు. వారితో 3 రోజులు, ముఖాముఖీ కూర్చొని ధ్యాన సిట్టింగులు తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత ఎవరికి వారు తమ స్వంతంగా సాధన చేసుకోవచ్చును. అవసరమైనప్పుడల్లా ట్రైనర్ల సహాయం కోరవచ్చును. ఇది శ్రేష్ఠమైన విధానం. మరొక మార్గం పైన చెప్పిన హార్ట్ఫుల్నెస్ ఆప్ ద్వారా కూడా ప్రారంభించవచ్చును.

కనీసం 3 మాసాలు నిర్దేశించిన విధంగా సాధన చేసినట్లయితే, సాధకులు తమలో సహజమైన మార్పులు చోటు చేసుకోవడం గమనించగలుగుతారు. 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...