31, ఆగస్టు 2023, గురువారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ అభయం

 శ్రీకృష్ణ అభయం 
(పైన చిత్రంలో అర్జునుడు మానవాళికి ప్రతినిధి. శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి మూలకారకుడు, పరమాత్ముడు - "నేను ఉన్నాను కదా" అన్నట్లుగా అభయం యిస్తున్నట్లుగానూ, ఆయన అసలు ఎవరో  తెలియజేస్తున్నట్లుగానూ ఉంది ఈ చిత్రం. ఆయన భగవద్గీతలో అర్జునుడి ద్వారా మనందరికీ యిచ్చిన వాగ్దానము, అభయము, రక్షణ, మన కర్తవ్యము ఈ క్రింది వ్యాసంలో పరికిద్దాం.) 

శ్రీ భగవానువాచ:
వాగ్దానము, రక్షణ 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం 
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 


తాత్పర్యము: సాధు-సజ్జనుల సంరక్షణ కోసము, దుష్టులను శిక్షించడం కోసము, ధర్మ పరిరక్షణ కోసము, అవసరమైనప్పుడల్లా అవతరిస్తూనే ఉంటాను.  


 కర్తవ్యబోధ 

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ 

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః 


తాత్పర్యము: ఎవరు 'నన్ను' ఏ విధంగా సేవిస్తున్నారో వారిని 'నేను' ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉన్నాను. మనుషులందరూ కూడా నా మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు. 


మన కర్తవ్యము 
అనన్యాశ్చింతయంతోమాం  యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 

తాత్పర్యము: ఎవరైతే మరేదీ ఆలోచించకుండా నా దివ్య రూప్యంపై ధ్యానిస్తారో వాళ్ళ యోగక్షేమాలు ప్రతినిత్యం నేనే చూసుకుంటాను. 

మన కర్తవ్యము 
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి 
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః.

తాత్పర్యము: పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, నీటితో అర్ఘ్యం గాని ఎవరైతే భక్తితో సమర్పిస్తారో, అటువంటి భక్తితో కూడిన మనస్సు కలిగిన వ్యక్తిచే సమర్పింపబడినదాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. 

అభయము, వాగ్దానము  
సర్వధర్మాన్పరిత్యజ్య  మామేక శరణ్య వ్రజ 
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచ.

తాత్పర్యము: ఇప్పటి వరకూ బోధించిన ధర్మాలే గాక అన్నీ ధర్మాలు నాకు విడిచిపెట్టి, నా యందు శరణాగతి భావంతో ఉండు; నీ సమస్త పాపాల నుండి విముక్తి కలిగించెదను, భయపడకు.

శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవాళికంతటికీ ,ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు అందించిన అందరూ తేలికగా అనుసరించగలిగే అద్భుతమైన పరిష్కారాలు. వీటి భావాన్ని మన మనసులో శాశ్వతంగా నిలుపుకుంటూ మన సాధన చేసినట్లయితే, మన ఆధ్యాత్మిక పురోగతి వేగం పుంజుకుంటుంది, రోజురోజుకూ భగవంతునికి చేరువయ్యే అవకాశం ఉంది. అందరూ మనస్ఫూర్తిగా ప్రయత్నించెదరుగాక.  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...