(ఈ అద్భుతమైన పాట ఆకాశవాణిలో మనం చిన్నప్పుడు 40 ఏళ్ల క్రితం వినేవాళ్ళం)
సంస్కృత భాష ప్రాశస్త్యం
కేయూరాణి న విభూషయంతి పురుషం, హారా న చంద్రోజ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలజ్ఞకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలజ్ఞ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
- భర్తృహరి
అర్థం
పురుషం అంటే ఆత్మను కేయూరాలు అంటే చేతి కంకణాలతో గాని, హారములచే గాని, వెన్నెలచే గాని స్నానం ద్వారా గాని, విలేపనాలంటే అత్తర్లు, సుగంధాల్లాంటివాటి చేత గాని, కుసుమాల చేత గాని, శిరోజాలు అలంకరించడం చేత గాని, ఆత్మను అలంకరించలేము. ఆత్మను అలంకరించగలిగేది కేవలం వాక్కు చేత మాత్రమే, అంటే మాట చేత మాత్రమే; అది కూడా ఏ వాక్కు అయితే సంస్కృతంతో కూడి ఉంటుందో అదే ఆత్మకు నిజమైన భూషణం అవుతుంది. వాగ్భూషణమే ఆత్మకు భూషణం.
శృతి అంటే వినిపించినది. వ్రాసినది కాదు, చదివినది కాదు. నేరుగా శబ్ద రూపంలో (అంటే వైబ్రేషన్ రూపంలో) వినిపించినది. శబ్దాన్ని తర్జుమా చేస్తే, అక్షరం అయ్యింది, అక్షరాల సమూహం భాష అయ్యింది. శ్రుతులు అంటే ఆ విధంగా వినిపించినవే. ఆ విధంగా వినిపించినదే సంస్కృత భాష. అందుకే దీన్ని వేద భాష అంటారు. ఈ శ్రుతులనే మనం వేదం అంటాం. ఈ భాష వాక్కుకే అలంకారం అని చెబుతున్నది భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం (పైన వీడియోలో వినండి); ఎంత శ్రావ్యంగా ఉంటుందో!
మనం ఇంతకు ముందు పాణిని మహర్షి గురించి ప్రస్తావించుకున్నప్పుడు మాట్లాడుకున్నాం - భాష ముందా లేక వ్యాకరణం ముందా? అని. సృష్టి ముందా లేక సృష్టి నియమాలు ముందా? అంటే సృష్టే ముందు. అలాగే భాషే ముందు, వ్యాకరణం తరువాత. సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకునేది మానవుడు. అలాగే భాష ఎలా ఏర్పడిందో తెలుసుకునేది కూడా మానవుడే. స్వతః సిద్ధంగా ఉన్న ప్రకృతి ఏ విధంగా ఏర్పడిందో ఇంకా మానవుడు కనుగొంటూనే ఉన్నాడు. పైగా ఆ విధంగా కనుగొన్నవి మారుతూనే ఉన్నాయి కూడా. కానీ పాణిని మహర్షి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రింద సంస్కృత భాష ఎలా ఏర్పడిందో కనుగొన్న నియమాలు, దాన్నే మనం వ్యాకరణం అంటాం, ఇప్పటికీ మారలేదు, మారదు కూడా. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. ఇప్పటికీ ఆ నియమాలు వర్తిస్తాయి. అదే వైజ్ఞానికుడు కనుగొన్నవాటికి, మహర్షి కనుగొన్నవాటికి గల గొప్ప వ్యత్యాసం. మహర్షి కనుగొన్నవి శాశ్వత సత్యాలు.
సంస్కృతం అంటే కేవలం మరో భాష కాదు.
సంస్కృత భాష భారతీయ భాషాలన్నీటికే గాక అనేక అంతర్జాతీయ భాషలకు మాతృక. వేదాలు ఈ భాషలోనే అందుకోవడం జరిగినందువల్ల దీన్ని దేవ భాష అని కూడా అంటారు. మొత్తం సాంకృత భాష అంతా కూడా పాణిని మహర్షి చెప్పినట్లు 14 సూత్రాలపై ఆధారపడుంది. ఈ 14 సూత్రాల్లోని అక్షరాలతోనే భాష ఏర్పడింది. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము లేనిది అని అర్థం. ఈ అక్షరాలన్నీ నిజానికి శబ్దాలు అంటే వైబ్రేషన్లు. ఇవి ప్రకృతి సిద్ధంగా ఉండే వైబ్రేషన్లు. ఉదాహరణకు అ, ఈ, ఉ అనే శబ్దాలు పెదాలు కలపకుండా పలికే శబ్దాలు; అలాగే కొన్ని శబ్దాలు పెదాలు కలపకుండా పలుకలేము. కొన్ని శబ్దాలను నాసికంతో పలుకుతాం. ఇలా శబ్ద వ్యవస్థను ఈ 14 సూత్రాల ద్వారా పాణిని మహర్షి వివరిస్తారు. ఈ సూత్రాలనే మహేశ్వర సూత్రాలని, పాణిని సూత్రాలని కూడా అంటారు. శబ్దం అంటే వైబ్రేషన్ నుండే అక్షరం, అక్షరం నుండే పదం, పదాల ద్వారానే వాక్యం ఏర్పడుతుంది.
సంస్కృతంలోని మరొక గొప్పదనం మనం ఏమి పలుకుతామో అదే వ్రాస్తాం. ఏది వ్రాస్తామో అదే పలుకుతాం. అన్య భాషలలో అలా కాదు. ఉదాహరణకు ఆంగ్లంలో కొన్ని అక్షరాలు వ్రాసి, వాటిని సైలెంట్ అంటారు. ఉదాహరణకు know లో k సైలెంట్ అంటారు. అక్షరం వ్రాస్తాం గాని పలకం. సంస్కృతంలో అలా ఉండదు. ఇలా సంస్కృతం ఒక సంపూర్ణమైన భాష, ఒక పరిపూర్ణమైన భాష.
సంస్కృతం మాట్లాడితే మనిషి సంస్కారవంతుడవుతాడు. ఎందుకంటే నాలుక సంస్కరింపబడుతుంది. మన లాలాజీ సంభాషణా సూత్రాల్లో చెప్పినట్లుగా. యే భాష నేర్చుకుంటే ఆ భాషకు సంబంధించిన సంస్కృతి మనిషికి అబ్బుతుంది. సంస్కృతం నేర్చుకుంటే భారతీయ సంస్కృతి అబ్బడమే గాక ఆమోఘమైన జ్ఞానం వస్తుంది. సౌశీల్యం కలుగుతుంది. సంస్కృత భాష నేర్చుకుంటే ప్రపంచంలో యే భాష అయినా తేలికగా నేర్చుకోగలుగుతారు.
అందరూ వీలు చేసుకొని కొంతైనా సంస్కృత భాషను అధ్యయనం చెయ్యండి, అది మన ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఉపయోగపడుతుంది. పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ సంస్కృతం పూర్తిగా అధ్యయనం చేయలేకపోయానే అని బాధపడేవారు.
adbhutam. అమోఘం. కృష్ణారావు గారు మూలాల్లోకి తీసుకువేల్తున్నారు. అసలు ఆకాశవాణి పదమే అప్పట్లే మనలో ఎదో రేకేత్తించేదిది. అపోపుడు ఆకాశవాణి లో మహా మహులు ఉండేవారు. ఎంతో సాహిత్యం మన పాటలలోనే కనపడేది. శబ్ద రహితమైన ప్రకంపనం వరకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత వచినదే శబ్దం. మా మేడం ఇప్పటికి ఆకాశవాణి హైదరాబాదు యఫ్.యం. వినాలి. అందుకు ఎన్నో రేడియోలు మార్చాం. ఇపుడు రేడియో రిపేర్ అంటే నవ్వుతున్నారు. అవును మరిచాను...మనం పాణిని మహర్షి గురించి చెప్పుకున్నామా ! లేక నేను ఆ బ్లాగు మిస్సు అయ్యాను అంటారా !
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిక్షమించగలరు. అవును పతంజలి మహర్షి గురించి చెబుతూ పాణిని వ్యకరణం గురించీ చెప్పినట్లు ఇపుడు తట్టింది. ధన్యవాదాలు.