8, ఆగస్టు 2023, మంగళవారం

మన మహర్షులు - పాణిని మహర్షి

 

మహర్షి పాణిని 
(కాలం: సుమారు 3000 సంవత్సరాలకు పూర్వం) 
మొక్క ముందా, విత్తు ముందా? - అన్నది మనందరమూ అనాదిగా వింటున్న అనేక చిక్కు ప్రశ్నల్లో ఒకటి. అలాంటిదే మరొక ప్రశ్న భాష ముందా, వ్యాకరణం ముందా? - అన్న ప్రశ్న కూడా.   కానీ భాషే ముందు. భాషను గురించి, అది ఎలా ఏర్పడిందోనన్న అధ్యయనం చేస్తూండగా వెల్లడైన అద్భుత సూత్రాలే వ్యాకరణం. అలాగే సృష్టి ముందు, అది ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తూండగా వెల్లడయ్యే సూత్రాలే సైన్సు -విజ్ఞానం. ఆ విధంగా శోధిస్తూండగా ధ్యాన నిమగ్న స్థితిలో పాణిని మహర్షికి వెల్లడైన అద్భుత సూత్రాల సంకలనమే వ్యాకరణం. మానవ చరిత్రలో మొట్టమొదటి వ్యాకరణ శాస్త్రం రచించిన గ్రంథ కర్త పాణిని మహర్షి. ఈయన వ్రాసిన వ్యాకరణాన్ని - అష్టాధ్యాయి అంటారు. ఇందులో 4000 కు పైగా సూత్రాలు ఎనిమిది అధ్యాయాల్లో కనిపిస్తాయి. ఎనిమిది అధ్యాయాల్లో ఉండటం వల్ల అష్టాధ్యాయి అని నామకరణం చేయడం జరిగింది. 
భాష అనేది కేవలం శబ్దాల సమ్మేళనం. శబ్దాల వివిధ రకాల అమరిక, ఏర్పాటు. ఇక్కడ శబ్దము అంటే, కంపనంఉ,  లేక ఆంగ్లంలో వైబ్రేషన్, శబ్దం అంటే పదం కూడా; శబ్దం అంటే శబ్దం కూడా. వెరసి వ్యాకరణం అంటే శబ్ద శాస్త్రం కూడా. నిజానికి పదము అంటే శబ్దాల అమరిక. 
శబ్దాలు మౌలికంగా 44 అక్షరాలు(క్షరము కానిది అక్షరము; అంటే నాశనము లేనిది అక్షరము); అంటే ఈ శబ్దాలు నాశనము లేనివని అర్థం; ఈ అక్షరాలను లేక శబ్దాలను 14 సూత్రాలుగా పాణిని మహర్షికి ధ్యానంలో వెల్లడయ్యాయని చెబుతారు; మహాశివుడు నటరాజునిగా నృత్యం చేస్తున్నప్పుడు తన డమరుకం ద్వారా వెలువడిన సూత్రాలు ఇవి. వీటినే మాహాశివ సూత్రాలు అని కూడా అంటారు.  
ఈ పధ్నాలుగు సూత్రాల ఆధారంగానే సంస్కృత భాషే  గాక ప్రపంచంలోని అనేక భాషలు ముఖ్యంగా భారతీయ భాషలు ఏర్పడటం జరిగింది. భారతీయ భాషలలో సంస్కృతానికి అతి సమీప భాషలు -  హిందీ, తెలుగు. 
ఈ పధ్నాలుగు సూత్రాలూ ఈ విధంగా ఉన్నాయి: 




ఇందులో మొదటి నాలుగు సూత్రాలు అచ్ లు అన్నమాట (మనకు తెలిసిన అచ్చులు) - అంటే మొదటి సూత్రం మొదటి అక్షరం , నాల్గవ సూత్రం ఆఖరి పొల్లు అక్షరం చ్, మధ్యలో ఉండే అక్షరాలన్నమాట. 
అలాగే అయిదవ సూత్రం మొదటి అక్షరం కు, పధ్నాల్గవ సూత్రం ఆఖరి పొల్లుతో కూడిన అక్షరం ల్ కు మధ్య ఉండే అక్షరాలను హల్ లు అంటారు. (మనం అనుకునే హల్లులన్నమాట) 
అంతే కాదు, ఒక్కొక్క శబ్దం మన శరీర వ్యవస్థలో నుండి ఎలా ఉద్భవిస్తుందీ, ఎ విధంగా ఉచ్ఛారణ జరుగుతుందీ, వాటికి అర్థం ఏమిటి, ఆ శబ్ద తరంగాల ప్రభావం ఎలా ఉంటుందీ, మొత్తం శబ్దోచ్చారణ వ్యవస్థను ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది;   ఇలాంటి సూక్ష్మ విషయాలేగాక,  ఇంకా మరెన్నో అద్భుత రహస్యాలను ఈ  గ్రంథం వెల్లడిస్తుంది. దీనికి పరిచయంగా, సంస్కృత వ్యాకరణ  అధ్యయన స్ఫూర్తి కోసం ఈ క్రింది వీడియో చూడగలరు. 
 

1 కామెంట్‌:

  1. మనకు తెలియనివి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయని తెలుస్తున్నది. ధన్యవాదాలు. తప్పక పంచుకోండి ఎలాంటి విషయాలను.

    రిప్లయితొలగించండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...