సనాతన వైదిక సాహిత్యంలో
ఆశ్చర్యం కలిగించే విధంగా అనేక గీతలు
మన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప ప్రత్యేకత - భగవంతుడిని లేక పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి లేక చేతనను సంపూర్ణంగా అర్థం చేసుకోడానికి ఇద్దరి మధ్య అనేక సంవాదాలున్నాయి. ఇవే గీతలుగా మారాయి. ఈ రోజుకూ అటువంటి ప్రశ్నోత్తరాల రూపంలో జరిగే సంభాషణలు అనేకం. మన పూజ్య గురుదేవులు దాజీ కూడా ఈ ప్రక్రియను అవలంబిస్తున్నారు. అటువంటి సంవాద రూపంలో ఉన్న అద్భుత గ్రంథాలు కేవలం శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిల్లో సేకరించగలిగినన్ని గీతల పేర్లు మీ ముందుంచుతున్నాను;
1) అగస్త్య గీత, 2) అజగర గీత, 3) అను గీత, 4) అష్టావక్ర గీత, 5) అవధూత గీత, 6) ఐల గీత, 7) కపిల గీత, 8) ఉద్ధవ గీత/హంస గీత, 9) రామగీత, 10) విదుర గీత, 11) గణేశ గీత, 12) గురు గీత, 13) భగవద్గీత, 14) కరుణ గీత, 15) తులసి గీత, 16) కశ్యప గీత, 17) కామ గీత, 18) ఉత్తర గీత, 19) ఉతథ్య గీత, 20) గర్భ గీత, 21) బ్రహ్మ గీత, 22) యమ గీత, 23) దేవీ గీత, 24) బ్రాహ్మణ గీత, 25) యాజ్ఞవల్క్య గీత, 26) శృతి గీత, 27) యుగళ గీత, 28) రుద్ర గీత, 29) గాయత్రి గీత, 30) పింగళ గీత, 31) భ్రమర గీత, 32) ప్రణయ గీత, 33) భిక్షు గీత, 34) ఋభు గీత, 35) గోపికా గీత, 36) వశిష్ఠ గీత, 37) హరిత గీత, 38) వానర గీత, 39) విచఖ్ను గీత, 40) వామదేవ గీత, 41) సూత గీత, 42) జయంతేయ గీత, 43) పుత్ర గీత, 44) వ్యాధ గీత, 45) వ్యాస గీత, 46) వృత్ర గీత, 47) పరాశర గీత.
ఇవన్నీ ప్రశ్నోత్తరాలే; అన్నీ ఆసక్తికరమైనవే. శోధించగలిగినవాళ్ళు శోధించే ప్రయత్నం చెయ్యండి. ప్రగాఢమైన విజ్ఞత వీటిల్లో నిక్షిప్తమై ఉంది.
అమ్మ బాబోయ్ ! ఇంకా శోధించే సమయం ఉందంటారా ! దయచేసి మీరు మాకు ఇవి లేదా ఇది అవసరం అనుకున్నది పంచుకోండి.
రిప్లయితొలగించండినేను కూడా ఇదే అనుకుంటున్నాను🙏
తొలగించండి