10, ఆగస్టు 2023, గురువారం

మన మహర్షులు - వేదవ్యాస మహర్షి

 

మహర్షి కృష్ణ ద్వైపాయన వేదవ్యాస 
(కాలం: 5000 సంవత్సరాలకు పూర్వం)

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయ తటపత్ర నేత్ర |  
ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ్య ప్రదీపః ||  

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమోవై బ్రహ్మనీలయే వాసిష్ఠాయ నమో నమః ||

వేద అంటే వేదం; వ్యాస అంటే విభజన - వేద విభజన చేసినవాడు వేదవ్యాసుడు. శృతి రూపంలో, గురు-శిష్య పరంపరగా అందుకున్న అనంతమైన వేద వాజ్ఞ్మయాన్ని  భావి తరాలకు తేలికగా అందుబాటులో ఉండటానికి వీలుగా వేద విభజన, వేద వాజ్ఞ్మయ సంకలనము చేసిన మహా ఋషి వేదవ్యాసుడు. మనం మాట్లాడుకుంటున్నది కృష్ణద్వైపాయన వేద వ్యాసుని గురించి. వేద వ్యాస అనేది బిరుదు. సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికీ 28 వేదవ్యాసులు ఉద్భవించడం జరిగింది. ఈయన 28 వ వేదవ్యాసుడు. రానున్న 29 వ వేద వ్యాసుడు అశ్వత్థామ అని చెప్తారు. ప్రతీ ద్వాపర యుగాంతంలో, ప్రపంచానికి అవసరమైనప్పుడు, వేదాన్ని క్రోడీకరించడానికి ఒక వేదవ్యాసుడు ఉద్భవిస్తాడు. వేదవ్యాస జన్మదినాన్ని ప్రపంచం అంతా వ్యాసపూర్ణిమగా ప్రతీ ఏడాదీ జరుపుకుంటారు. 
28 వేదవ్యాసుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి:
1) బ్రహ్మదేవుడు 2) ప్రజాపతి 3) శుక్రాచార్యుడు 4) బృహస్పతి 5) సూర్యుడు 6) మృత్యువు 7) ఇంద్రుడు 8) వశిష్ఠుడు 9) సారసవతుడు 10) తరీధామ 11) తరిశిఖ 
12) భరద్వాజ 13) అంతరిక్ష 14) వారణి 15) త్రయ్యారు 16) ధనంజయ 17) కృతంజయ 18) జయ 19) భరద్వాజ 20) గౌతం 21) హర్యాటమ 22) వజశ్రవ 23) త్రీణిబిందు 24) వాల్మీకి 25) శక్తి 26) పరాశర 27) జాతుకర్ణ 
28) కృష్ణద్వైపాయన 29) అశ్వత్థామ 
జన్మ: ప్రపంచం ఆతృతతో నిరీక్షిస్తున్నప్పుడు ఇటువంటి మహాయోగి ఉద్భవం జరుగుతుంది. కృష్ణద్వైపాయన వేదవ్యాసుడు పరాశర మహర్షి సంకల్పం వల్ల ఒక మత్స్యగంధి అనే మత్స్యకారుల కన్యకు ఒక ద్వీపంలో జన్మిస్తాడు.  నల్లటి వర్ణం ఉండటం వల్ల కృష్ణ అని, ద్వీపంలో జన్మించడం వల్ల ద్వైపాయనుడని ఆయనకు కృష్ణద్వైపాయనుడని పేరు వచ్చింది.
వారి అపార కృషి: వేదాన్ని నాలుగు వేదాలుగానూ, వేదాంగాలుగాను, ఉపనిషత్తులుగానూ, విభజించి, అష్టాదశపురాణాలను,  మహాభారత పంచమ వేదాన్ని, మహాభాగవతం అనే మహా ఇతిహాసాలను సాక్షిగా ఉంటూ రచించి పండితులకు, పామరులకూ కూడా వేదరహస్యాలను, జీవిత పరమార్థాలను, జీవన విధాలను, అన్ని రకాల మనస్తత్వాలకు తగినట్లుగా రచించిన మహాపురుషుడు వేదవ్యాసుడు. 18 అధ్యాయాలతో, లక్ష శ్లోకాలతో కూడిన మహాభారత పంచమ వేదంలోనిదే మన శ్రీమద్భగవద్గీత. ఇంతటి ఆధ్యాత్మిక సంపదను సృష్టించిన శ్రీకృష్ణద్వైపాయన వేదవ్యాస మహర్షికి సాష్టాంగ ప్రణామాలు. వీటన్నిటినీ అధ్యయనం చేయడానికి ఒక్క జన్మ కాదు, అనేక జన్మలు కూడా సరిపోకపోవచ్చు; మనకు సాధ్యమయినంత మేరకు ఎంతో కొంత భాగాన్నైనా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం; ఆ విధంగా వారికి కృతజ్ఞతను తెలుపుకుందాం. వారి కృషే  మన సనాతన ధర్మం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...