28, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 3

 


ధీశక్తి - ధ్యానం - 3 

సంకల్పం 
(Will, Suggestion)  
ఆధ్యాత్మిక సందర్భంలో సంకల్పం అంటే ఇచ్ఛాశక్తితో కూడిన ఆలోచన. 
ఆలోచన + ఇచ్ఛాశక్తి = సంకల్పం 
సంకల్పాలు లేనిదే యేమీ జరగవు జీవితంలో. ఈ సూత్రం మామూలు సాంసారిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా వర్తిస్తుంది. వాడుక భాషలో చెప్పుకోవాలంటే సంకల్పం అంటే మనసులో అనుకోవడం. మనసులో అనుకోకుండా ఏ పనీ చేయలేం. ఉదాహరణకు ఉదయం  గంటలకు లేవాలి అని మనసులో రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటేనే మనం ఆ సమయానికి లేవగలుగుతాం. మన శరీర వ్యవస్థ లేదా ప్రకృతి విచిత్రంగా ఈ సంకల్పానికి స్పందిస్తుంది. ఇది మనందరి అనుభవమే. అనుకుంటే జరిగి తీరుతుంది. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే , ఎంత పవిత్రమైనదైతే  అంతా త్వరగా నెరవేరుతుంది. 
సాంసారిక జీవనంలో Think, Do, and  Achieve అంటారు. అంటే సంకల్పించుకోవడం, సంకల్పం పనిగా తర్జుమా కావడం, ఆ తరువాత సంకల్పించినదాన్ని సాధించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక జీవనంలో Think and Achieve అంటే సంకల్పం చేసుకోగానే, సాధించడం జరుగుతుంది అని అనేవారు చారీజీ. అందుకే హార్ట్ఫుల్నెస్ ధ్యానసాధనలో ధ్యానం ప్రారంభించే ముందు ఒక సంకల్పం చేస్తాం, ఆ సంకల్పమే ధ్యానంగా మారిపోతుంది. 

అయితే ఈ సంకల్పం ఎంత సూక్ష్మంగా చేసుకోగలిగితే అంత శక్తివంతంగా, అంతా త్వరితంగానూ సాకారమవుతుంది. సంకల్పం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నట్లయితే అటువంటి సంకల్పాన్ని దివ్య సంకల్పం అని అంటాం. అటువంటి సంకల్పాలు వెనువెంటనే సాకారమవుతాయి. మన సాధన అంతా కూడా మన సంకల్పాలు దివ్య సంకల్పాలుగా మారే దిశగానే కొనసాగాలి. 

సంకల్పంలో పవిత్రతా భావం, సూక్ష్మ ఆలోచనా శక్తి, తగినంత  ఇచ్ఛాశక్తి కీలకం. మనిషి సంకల్పం, దైవసంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు అవి నెరవేరుతాయి. దీనికి ఆధ్యాత్మిక సాధన కీలకం. అప్పుడు జీవితమే దైవసంకల్పానికి అనుగుణంగా నడుస్తూ ఉండే అవకాశం ఉంటుంది. 

(సశేషం ...)


27, డిసెంబర్ 2024, శుక్రవారం

ధీశక్తి - ధ్యానం - 2

 


ధీశక్తి  - ధ్యానం - 2 

ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
ఆలోచనల మూలం ఏమిటి? ఆలోచనలు మన సంస్కారాల మూలాన లేక మన కర్మల వల్ల, వాసబాల వల్ల వస్తూంటాయి. ఇవి మామూలు ఆలోచనలు అవే చర్యలుగా మారి అవే ముద్రల్లా  ఏర్పడి, పదే పదే  అవే పనులు చేయడం వల్ల ప్రవృత్తుల్లా, లేక సంస్కారాలుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్కారాలే మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఇలా మనం సంస్కారాల బరువును తగ్గించుకవడం పోయి పెంచుకుంటూ ఉంటాం. తద్వారా ఇవన్నీ ఖర్చవడం కోసం మళ్ళీ-మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాం. కాబట్టి సంస్కారాల వల్లే ఆలోచనలు వస్తాయి, ఆలోచనల వల్లే సంస్కారాలు ఏర్పడటం, జరుగుతూ ఉంటుంది. మొక్క ముందా, విత్తు ముందా అనే పరిస్థితి. కొత్త సంస్కారాలు ఏర్పడకుండా కాపాడే కవచమే ధ్యాన స్థితి. ఇది ధ్యానం అల్లే సాధ్యం. ఆలోచనలకు అతీతంగా తీసుకువెళ్ళేదే ధ్యానం.

స్థూల ఆలోచనలు, సూక్ష్మ ఆలోచనలు, దివ్య ఆలోచనలు 
మనిసజీకవచ్చే ఆలోచనలు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. 1) స్థూల ఆలోచనలు అంటే బరువైన ఆలోచనలు, నకరాత్మకమైన ఆలోచనలు, సాంసారిక ఆలోచనలు, 2) సూక్ష్మ ఆలోచనలు అంటే తేలికైన ఆలోచనలు, శాంతిని కలిగించేవి, హాయిని కలిగించేవి, సృజనాత్మకమైన ఆలోచనలు, 3) దివ్య ఆలోచనలు అంటే పై రెండూ ఆలోచనలు కంటే అత్యంత తేలికైనవి, అలౌకిక ఆనందాన్ని, ఆత్మసుఖాన్ని కలిగించేవి. 
అందుకే ఎప్పుడూ దివ్య ఆలోచనలు కలిగేటువంటి వాతావరణాన్ని అంతరంగంలో సృష్టించుకునే ప్రయత్నంలో ఉండాలి మనిషి. ధ్యానం ద్వారాన్నే ఈ అంతరంగ వాతావరణాన్ని మార్చవచ్చు. 
 
(సశేషం ...)


21, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 1

 


ధీశక్తి  - ధ్యానం - 1  

ప్రతి మనిషికి అందుబాటులో ఉండే అత్యద్భుత శక్తి ధీశక్తి లేక ఆలోచనా శక్తి. ఆలోచన లేకపోతే సృష్టి లేదు; ఆలోచన లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఆలోచన లేకపోతే యే  పనీ చేయలేము. 

ఆలోచన కాంతి కంటే వేగమైనది; మనోవేగం అంటాం. యే వస్తువుతోనైనా, ఆ వస్తువు మన అనుభవంలో ఉన్నా ఉండకపోయినా, చూసినా చూడకపోయినా ఆ వస్తువుతో ఆలోచన ద్వారా వెంటనే సంపర్కం ఏర్పరచుకోవచ్చు. అది వస్తువే కానక్కర్లేదు, భావమైనా కావచ్చు. ఉదాహరణకు మనం ఎప్పుడూ దైవాన్ని అనుభూతి చెందకపోయినా కూడా, ఆలోచన ఆ దైవ భావంతో అనుసంధానం ఏర్పరుస్తుంది. 

ఆ ఆలోచనను తదేకంగా అటువంటి భావంపై గాని, వస్తువుపై గాని దృష్టిని నిలపడమే ధ్యానం. దీన్నే ధ్యాన వస్తువు అని కూడా అంటారు. ఈ ప్రక్రియ వల్ల, దీన్ని పద్ధతిగా కొనసాగించడం వల్ల  ధ్యాన వస్తువు యొక్క సిద్ధి కలుగుతుంది. ఇదీ ఆలోచనకు, ధ్యానానికీ ఉన్న సంబంధం. 

అయితే ఆలోచనలకు స్వతహాగా యే శక్తి ఉండడంటారు బాబూజీ. మనం వాటిపై దృష్టిని నిలిపినప్పుడే వాటికి శక్తి లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాటిపై దృష్టి నిలపడం మానేస్తామో అవి వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయమటారు బాబూజీ. 

దృష్టిని నిలపడం 
మనం మన జీవితంలో గమనిస్తే అనేక సమస్యలుంటూ ఉంటాయి. సమస్యపై తగిన దృష్టిని నిలపడం ద్వారానే మనం ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటాం. ఆ విధంగా దృష్టి పెట్టనట్లయితే ఆ సమస్య అలాగే ఉండిపోవడమే గాక క్రమంగా జటిల సమస్యగా తయారవుతుంది. కాబట్టి సమస్య పరిష్కారానికి దానిపై దృష్టి నిలపడం అనివార్యం. 

అయితే జీవిత సమస్యకు పరిష్కారం కావాలంటే, దేనిపై దృష్టి నిలిపితే ఇది పరిష్కారమవుతుందో దానిపై నిలపవలసి ఉంది. ఆ ధ్యాన వస్తువునే హృదయంలో దివ్యమైన వెలుగు ముందే స్థితమై ఉందన్న భావం, అని అంటారు బాబూజీ. అందుకే సహజ మార్గ రాజయోగ ధ్యాన పద్ధతిలో జీవిత సమస్య పరిష్కారానికి హృదయంలో ఉన్న దివ్య ఉనికి అనే భావం పై ధ్యానిస్తాం. 

(సశేషం ...)



20, డిసెంబర్ 2024, శుక్రవారం

పూజ్య చారీజీ పుణ్యతిథి - డిశంబర్ 20, 2014


(జూలై 24, 1927 - డిశంబరర్ 20, 2014)
పూజ్య చారీజీ పుణ్యతిథి - డిశంబర్ 20, 2014 

ఈ రోజు, సహజ మార్గ గురుపరంపరలోని మూడవ గురువులు  పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ పుణ్యతఇతి, 10 వ వర్ధంతి. 
స్మరణ అంటే, ముఖ్యంగా ఇటువంటి మహాత్ములను స్మరించడం అంటే కేవలం జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కాదు, ఆ జ్ఞాపకాలను పునరజీవిమహయడం అన్నారు చారీజీ. అటువంటి స్మరణ వల్ల నిజమైన ఆధ్యాత్మిక ప్రయోజనం, స్మరించుకుంటున్న వ్యక్తిత్వం యొక్క ప్రత్యేక అనుగ్రహం, ప్రేమ వర్షించే అవకాశం ఉంటుంది. నిజమైన స్మరణగా పరిణమిస్తుంది. మానందరమూ వారి నుండి అందుకున్న, ఇప్పటికీ అందుకుంటున్న ప్రేమను, మార్గదర్శనాలను, బోధలు, ఆధ్యాత్మిక సేవలను, వారి సాన్నిధ్యాన్ని, వారి అపార కృపను, ప్రత్యేకంగా పునశ్చరణ చేసుకోవలసిన రోజు, ఈ రోజు. ఒక్కొక్కరికీ ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలు ఉండి ఉంటాయి, వాటన్నిటినీ సమీకరించుకుంటూ ఎవరికి వారు కృతజ్ఞతా పూరిత హృదయంతో పునర్జీవించడానికి ప్రయత్నిద్దాం ఈ రోజు. ముఖ్యంగా మన గురుపరంపరలోని మాస్టర్ల స్మరణ ఈ విధంగా చేయడానికి ప్రయత్నించాలని అనేవారు చారీజీ. 

ఆజానుబాహుడు, దివ్యమనోహర విగ్రహం అంటే ఏమిటో తలపించే స్వరూపం, అద్భుతమైన గంభీరమైన కంఠం, మనసులను అలవోకగా గెలుచుకోగలిగే వ్యక్తిత్వం, వారి ప్రత్యక్ష సన్నిధిలో అందుకున్న ధ్యాన స్థితులు అతి నిగూఢమైనవి, మాటల్లో వ్యక్తం చేయలేనివిగా ఉండేవి. వారి ప్రసంగాలు, రచించిన గ్రంథాలు, సంభాషణలు  వారి దైవత్వాన్ని వెల్లడించే మాధ్యమాలు. వారు మానవాళికి నిర్విరామంగా చేసిన ఆధ్యాత్మిక కృషి అంచనా వేయలేనిది. కులమత రంగుజాతి విభేధాల్లేకుండా, తన జీవిత కాలంలో 3000 కు పైగా వివాహాలు వ్యక్తిగత బాధ్యతతో నిర్వహించారు. బహుశా ఇది ప్రపంచ రికార్డ్ అయి ఉండాలి. ఇంచుమించుగా వాఋ సమక్షంలో వివాహం చేసుకున్నఅన్ని  జంటలూ సుఖంగా ఉన్నాయి. ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు జనానికి, ఎక్కడా తెలియనిచ్చేవారు కాదు. తన గురుదేవులైన బాబూజీ పట్ల ఆయనకున్న ప్రేమ, సమర్పణ, విధేయత, వారి జీవితంలో, వారు చేస్తున్న ప్రతీ పనిలోనూ అనుక్షణమూ కనిపిస్తూ ఉండేది. ఆయన ప్రశంగాల్లో ప్రతీ మూడో మాట బాబూజీ అనే పదం ఉండేది. బాబూజీని దర్శించని ఎందరో అభ్యాసులు బాబూజీని వారిలో దర్శించడం ద్వారా, బాబూజీని చూడలేదన్న వెలితిని పోగొట్టుకున్నారు. అదీ మన గురపరంపర మహత్యం. ప్రతీ గురువు బాబూజీని డర్షియప జేస్తూ ఉంటారు, మనం చూడలేకపోయినా. 
వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేద్దాం। 
 

17, డిసెంబర్ 2024, మంగళవారం

ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024 ఐక్యరాజ్య సమితి ప్రకటన

 


ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024  
ఐక్యరాజ్య సమితి ప్రకటన 

ధ్యాన ప్రేమికులకు, ధ్యాన సాధకులకు ఒక శుభవార్త!
ఈ సంవత్సరం నుండి ప్రతీ సంవత్సరమూ డిశంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం గా యావత్ ప్రపంచం అంతా జరుపుకోబోతోంది. శారీరక, మానసిక సమగ్ర ఆరోగ్యానికి తోడ్పడేదిగా ధ్యానాన్ని ఐక్య రాజ్య సమితి ఏకగ్రీవంగా గుర్తించడం జరిగింది. 

ఈ మేరకు డిశంబర్ 15 న హార్ట్ఫుల్నెస్ - శ్రీరామ చంద్ర మిషన్  అధ్యక్షులు పూజ్య దాజీ, ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను జూమ్ ద్వారా, దిల్ సే కార్యక్రమం ద్వారా  ముచ్చటిస్తూ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని, తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో, హైదరాబాదులోని గచ్చి బౌలీ స్టేడియంలో డిశంబర్ 21, న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకూ జరుగబోతున్నదని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పూజ్య దాజీ స్వయంగా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను, ధ్యానం పట్ల ఆసక్తి గలవారందరినీ బంధిమిత్ర సమేతంగా రమ్మని ఆహ్వానించడం జరిగింది. అభ్యాసులను ముఖ్యంగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో పాల్గొని వాతావరణాన్ని మార్చమన్నారు దాజీ. 

కావున అభ్యాసులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి: మానందరమూ సాధ్యమైనంత అధిక సంఖ్యలో శ్రద్ధాసక్తులతో, ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య దాజీ సంకల్పాన్ని దిగ్విజయం చేద్దాం. 

9, డిసెంబర్ 2024, సోమవారం

డిజైనింగ్ డెస్టినీ - విధి రూపకల్పన గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు

 


డిజైనింగ్ డెస్టినీ  - విధి రూపకల్పన 
గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు 

హార్ట్ఫుల్నెస్ మార్గం ద్వారా విధి రూపకల్పన (Designing Destiny the heartfulness way) అనే గ్రంథాన్ని పూజ్య దాజీ శ్రీ కమలేష్ డి. పటేల్ గారు వ్రాయడం జరగింది. 

ఈ శీర్షిక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం ఏమనుకుంటే అది జరిగిపోతుందేమోనన్న ఆశ కలిగిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం దొరికినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇందులో చాలా సూక్ష్మయలున్నాయి; మన ఇచ్ఛాశక్తిని అంటే సంకల్ప శక్తిని (Will Power) సరైన దిశలో వినియోగించుకుంటే తప్ప సాధ్యం కాదని అర్థమవుతుంది. ఈ గ్రంథం, మనందరిలో ఉదయించే ఎన్నో ప్రశ్నలకు  సమాధానాలు సూచిస్తుంది. మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. 

మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో యేదొక దశలో విధికి సంబంధించిన ప్రశ్నలు అనేకం వస్తూంటాయి. వాటిల్లో కొన్ని ఈ ఈ విధంగా ఉండవచ్చు: 
 అసలు విధి అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? రెండూ ఒకటేనా?
మనిషి యొక్క విధి, నుదుటివ్రాత, లేక ప్రారబ్ధం పూర్వమే నిర్ధారించబడిందా? మనిషికి గతంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఇంతకు ముందే లిఖించబడిందా?
లేక మన విధిని మనమే స్వయంగా వ్రాసుకున్నామా? అలా స్వయంగా  రూపకల్పన (డిజైన్)  చేసుకోగలమా? మన నుదుటి  వ్రాతను మనమే వ్రాసుకుంటామా? మన తలరాతను మార్చుకోగలమా?
మార్చుకోగలిగితే ఎంత వరకూ మార్చుకోగలం? మార్చలేని భాగం యేదైనా ఉందా? మన ప్రమేయం ఎంతవరకూ ఉంది, ఎంత వరకూ లేదు? ఈ పరివర్తన జరగాలంటే మార్గాలేమిటి?
హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలు ఈ క్రమంలో యే విధంగా ఉపయోగపడతాయి? 
జరిగే మార్పులు యే స్థాయిలో జరుగుతాయి, శరీర స్థాయిలోనా, మానసిక స్థాయిలోనా, ఆత్మ స్థాయిలోనా? అంటే స్థూల స్థూలశరీరపరంగానా, సూక్ష్మశరీర పరంగానా, కారణ శరీరపరంగానా?
జరగవలసిన మార్పుకు ఎంత కాలం పడుతుంది, త్వరితంగా జరగాలంటే మార్గాలున్నాయా?
మొత్తంఈ విధి రూపకల్పనలో గురువు పాత్ర ఏమిటి? మన పాత్ర ఏమిటి?

తరువాయి వ్యాసంలో సమాధానాలు/పరిష్కారాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. పాఠకులు కూడా ఈ గ్రంథంలో నుండి శోధించాలని సవినయ విజ్ఞప్తి. 

7, డిసెంబర్ 2024, శనివారం

ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు - అభ్యాసులు

 



ఆధ్యాత్మిక జిజ్ఞాసులు - అభ్యాసులు 

ధ్యానం చేయడానికి వచ్చేవారు, లేక ఆధ్యాత్మిక సాధన చేయాలని వచ్చేవారు, ఎవరినైతే మనం జిజ్ఞాసులని, అభ్యాసులని, సాధకులని పిలుస్తూ ఉంటామో, వాళ్ళు రకరకాల లక్ష్యాలతో వస్తూంటారు. ముఖ్యంగా ఒక గురువును ఆశ్రయించాలనుకున్నవారు మనసుల్లో వివిధ గమ్యాలు పెట్టుకుని వస్తూంటారు. 

ఉదాహరణకు ఒకప్పుడు ప్రాచీనకాలంలో చాలా వరకూ కేవలం భగవత్సాక్షాత్కారం కోసం గురువును ఆశ్రయించేవారు. ఆ తరువాతి కాలంలో ఎక్కువమంది మోక్షసాధన కోసం వచ్చేవారు గురువు వద్దకు. ఆ తరువాత కేవలం మనశ్శాంతి కోసం వచ్చేవారు ధ్యానానికి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి వస్తున్నారు. 

బాబూజీ తన సహజ్ మార్గ్ ధ్యాన విధానానికి, వాళ్ళ మనసుల్లో  ఎటువంటి లక్ష్యమున్నా స్వాగతిస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది కష్టాలు పోవాలని, ఇలా రకరకాలుగా ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎలా మొదలుపెట్టినప్పటికీ క్రమక్రమంగా యదార్థ లక్ష్యం సహజంగా స్థిరంగా ఏర్పడే అవకాశం ఈ సహజ మార్గ్ సాధన వల్ల కలుగుటుందంటారు బాబూజీ. అందుకే అభ్యాసుల హృదయాలలో లక్ష్యం స్థిరంగా, స్పష్టంగా ఏర్పడటానికి సమయం పట్టవచ్చు. అందుకే మన ప్రార్థనలోని మొదటి పంక్తి, ప్రతి రోజూ మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. 

ఆసక్తిని బట్టి లక్ష్యం ఏర్పడుతుంది, లక్ష్యాన్ని బట్టి తపన ఉంటుంది, తపనను బట్టి, సాధన క్రమబద్ధం అవుతుంది, ఆ విధంగా పురోగతి జరుగుతూ ఉంటుంది.  




6, డిసెంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం

 సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం 
సహజమార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతి, పూజ్య బాబూజీ మహారాజ్ మానవాళి ఉద్ధరణకు అందించిన ఒక విప్లవాత్మకమైన ధ్యాన పద్ధతి. రాజయోగ ధ్యాన పద్ధతిని పునర్వ్యవస్థీకరించి, ఆధునిక మానవుల అవసరాలకు తగినట్లుగా, ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సరళంగా దైవత్వాన్ని సాక్షాత్కరించుకునే మార్గం; మానవ పరిపూర్ణతను సిద్ధించుకునే సాధనం. 

దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న ప్రాణాహుతి ప్రసరణతో కూడిన రాజయోగ బ్రహ్మ విద్యా విధానం, ఈ సహజ మార్గం. ఈ ఋషి పేరును కూడా పూజ్య దాజీ సూచించడం జరిగింది. ఆయన పేరు ఋషభ్ నాథ్. దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం అంటే బహుశా రాముడి కాలంలో గాని కృష్ణుడి కాలంలో గాని ఈ ప్రాణహుతితో కూడిన ఆధ్యాత్మిక విద్య  ప్రాచుర్యంలో లేదు. 

పూజ్య లాలాజీ ఆధునిక మానవాళిని అత్యంత త్వరితంగా మోక్షానికి తీసుకువెళ్ళగలిగే మార్గాన్ని తన యోగశక్తి ద్వారా శోధించినప్పుడు, కాలగమనంలో అంత వెనక్కి (దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం) వెళ్ళినప్పుడు తెలుసుకున్న విద్యయే  ఈ ప్రాణాహుతి ప్రసరణ విద్య. కాబట్టి దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న విద్యను ప్రస్తుత కాలానికి తీసుకు వచ్చినది పూజ్య లాలాజీ మహారాజ్. 

ఆ ప్రాణాహుతితో కూడిన ధ్యాన పద్ధతికి అదనంగా సంస్కారాలను దగ్ధం చేసే శుద్ధీకరణ ప్రక్రియను ఆవిష్కరించి, ప్రార్థన అనే యౌగిక ప్రక్రియని జోడించి, ఈ రాజయోగపద్ధతికి పరిపూర్ణతను పూజ్య బాబూజీ చేకూర్చడం  జరిగింది. ఈ మూడు యౌగిక ప్రక్రియలను అనుసరించడం ద్వారా యోగసిద్ధి సహజంగా జరుగుతుంది కాబట్టి, ఈ ధ్యాన పద్ధతికి సహజ మార్గ్ అనే నామకరణం చేయడం జరిగింది. 

ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల మనిషిలో మనసు క్రమశిక్షణలో ఉండటమే గాక, మనసుకు అతీతంగా ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడం ద్వారా అడుగడుగునా జీవిత దృక్పథం మారుతూ వ్యక్తిని మరింత మరింత మెరుగైన విధంగా మారుస్తుంది. క్రమక్రమంగా పద్ధతిగా సాధన కొనసాగించడం ద్వారా ఈ జన్మలోనే పరిపూర్ణతను సాధించే అవకాశం ఉన్నది. 

ఈ సాధన చేస్తే అందరూ మహాత్ములయిపోతారా? అన్న ప్రశ్న అమదరికీ రావచ్చు. దానికి చారీజీ ఒకసారి సమాధానమిస్తూ, అందరూ మహాత్ములు కాకపోవచ్చు, కానీ 80 శాతం మహాత్ములుగా పరిశుద్ధ జీవనం సాగించగలుగుతారని చెప్పడం జరిగింది. బంగారు పతాకం ఒక్కరికే రావచ్చునేమో గాని, పట్టభద్రులు ఎవరైనా కాగలగడం ఎలా సాధ్యమో, అందరూ చాలా వరకూ మరింత మెరుగైన విలువలతో కూడిన మనుషులయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు చారీజీ. దీనికి మన అనుభవమే నిదర్శనం అవుతుంది. కేవలం కొన్నాళ్ళు ప్రయత్నించి చూడాలంతే. 

సహజ మార్గ్ అన్నీ మతాలకు అతీతమైనది. ఎవ్వరైనా ఈ సాధన ప్రయత్నించవచ్చు. ఈ సాధన వల్ల హిందువు మరింత మెరుగైన హిందువుగానూ, క్రైస్తవుడు మరింత మెరుగైన క్రైస్తవుడుగానూ, ఇలా యే మతానికి చెందినవారైనా మరింత మెరుగైన వ్యక్తిగా మారడమే గాక, సంకుచిత మనస్తత్వం పోయి, విశాలమైన హృదయంతో వారి వారి మతాగ్రంథాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు, మానవాళిలో సామరస్యం, ప్రేమ పెరగడానికి తోడ్పడటం జరుగుతుంది. ఆ విధంగా భూతల స్వర్గం ఏర్పడే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడవలసిన యోగసాధన సహజ్ మార్గ్. 


22, నవంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

https://www.youtube.com/watch?v=9VeumJifoJY

 సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

సహజ మార్గ ధ్యాన ప్రక్రియలు విశ్వజనీనమైనవి, అంటే అన్నీ రకాల వ్యక్తులు అనుసరించగలిగేవి. ఎటువంటి అర్హతలూ చూడరు. కేవలం ప్రయత్నించడానికి సంసిద్ధత ఉండాలి అంటే. నమ్మకం, విశ్వాసం వంటివి కూడా అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం అనుభవం ద్వారానే కలుగుతుంది గనుక. అనుభవం మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే సాధ్యం. 

ఎటువంటి విద్యార్హతలు గాని, ఎటువంటి నేపథ్యం గాని, కులమత రంగు,  జాతీయతలతో సంబంధం లేదు. శాస్త్రజ్ఞులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అంగవైకల్యం ఉన్నవారైనా, ఎవ్వరైనా ఈ ధ్యాన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలు హృదయ లోలోతుల్లోకి తీసుకువెళ్ళి మన చేతన స్థాయినే చేసిన ప్రతీశారీ మార్చగలిగే సామర్థ్యం ఉన్న పద్ధతి సహజ మార్గ ధ్యాన పద్ధతి. ఎవ్వరికైనా తెలియజేయవచ్చు, తనను తాను మార్చుకోవాలన్న తపన కలిగిన ప్రతీ వ్యక్తికి ఈ సాధన బాగా ఉపయోగపడుతుంది. మనసుకు అతీతంగా తీసుకువెళ్ళే ప్రక్రియలివి; సత్యాన్ని యథాతథంగా దర్శింపజేసి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తద్వారా జీవన ప్రమాణాలు, విలువలు సహజంగా ఉన్నతస్థాయిలో ఉండేలా చేస్తుంది. విలువలను నిజంగా గుర్తింపజేసి ఆ దిశలో జీవితాన్ని నడిపిస్తుంది ఈ మార్గం. 

కాబట్టి ఇది అందరికీ అవసరం, ముందు మనం అనుభవాన్ని సాధించి, ఆ తరువాత అందరికీ తెలియజేయదగ్గ మార్గం, సహజ మార్గం. అవసరమైనడల్లా పరివర్తన కోసం తపించే హృదయం. అనుభవాన్ని పంచుకోవడం ద్వారానే దీన్ని ఇతరులకు తెలియజేయగలం. 

 అయితే ఈ సందర్భంలో పూజ్య చారీజీ అడిగిన ఒక ప్రశ్న గుర్తుకొస్తున్నది. ఒక ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ, సహజ మార్గ పద్ధతిని తెలియజేయాలంటే ఒక గ్రుడ్డి, మూగ, చెవుడు మూడూ ఉన్న వ్యక్తికి తెలియజేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఆలోచించలేదు, ఆశ్చర్యం వేసింది. దానికి వారు, యేమీ లేదు, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశిక్షకుడు ప్రాణాహుతినివ్వడమేనన్నారు. అది హృదయాన్ని స్పృశిస్తుంది కాబట్టి జరగవలసిన ఆధ్యాత్మిక కార్యం జరుగుతుందన్నారు. అంతే కాదు, అన్నీ అవయవాలున్నవాళ్ళు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గ్రుడ్డి, మూగ, చెవుడు ఉన్నట్లుగా కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే తప్ప, హృదయ గళాన్ని వినిపించుకోలేమని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ధ్యానంలో జరిగేది అదే మనకు యేమీ కనిపించదు, వినిపించదు, మాట్లాడటం ఉండదు. అందరూ మననం చెయ్యవలసిన అంశం ఇది. 

19, నవంబర్ 2024, మంగళవారం

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? 

 ఆధ్యాత్మికత అంటే మతం కాదు. 

ఆధ్యాత్మికత అంటే బాహ్యారాధన కాదు.

ఆధ్యాత్మికత విడదీసేది కాదు.  

 ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే మతానికి అతీతమైనది. 

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమై తెలుసుకునేది. 

ఆధ్యాత్మికత అంటే కలిపేది, విడదీసేది కాదు. 



6, నవంబర్ 2024, బుధవారం

మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి

 


మా అమ్మగారు ధ్యాన ముద్రలో ... 
(అక్టోబర్ 22, 1942 - సెప్టెంబర్ 28, 2024)
మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి 
మా తల్లిగారు నడుపల్లె రాజేశ్వరిగారు, సెప్టెంబర్ 28, 2024న హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో కాలం చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. విధి విలాసం ఎలా ఉందంటే, ఆవిడను ఆసుపత్రిలో జేర్చిన 2 రోజులకే నేను కూడా తీవ్రమైన కడుపునొప్పితో మరొక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. శాస్త్ర చికిత్సలకు లోను కావలసి వచ్చింది. దానితో మా అమ్మగారు కాలం చేసినపుడు నేను అందుబాటులో లేకుండా పోవడమే గాక దహన ప్రక్రియలు కూడా నిర్వర్తించలేకపోయాను. ఇది నా జీవితంలో జరిగిన అతి విషాదకరమైన ఘట్టం ఇప్పటివరకూ. ఇవి చాలవన్నట్లుగా మేముండే 4 వ అంతస్తులో, మా అపార్టుమెంటులో లిఫ్ట్ పని చేయడం లేదు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా!

మాతృమూర్తిని కోల్పోవడం వ్యక్తి జీవితంలో హృదయంలో ఒక పూడ్చలేని వెలితిని సృష్టిస్తుంది. తల్లిని మించిన దైవము లేదు అని చిన్నప్పుడు, కాపీ పుస్తకాలలో వ్రాసేవాళ్ళం. అప్పుడు అర్థం తెలియదు, కేవలం స్కూల్లో మాష్టారు ఇచ్చిన హోమ్ వర్క్ లా ఉండేదంతే. దీని అర్థం తెలుసుకోవడానికి ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు. కానీ ఆమెను కోల్పోయిన తరువాత ఒక్కసారిగా ఆమె  మన పట్ల చేసిన త్యాగాలన్నీ కళ్ళ ముందుంటాయి. ఎన్నిసార్లు ఆమెను బాధ పెట్టామో గుర్తుకు వస్తుంది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశామో గుర్తొస్తుంది. క్షమించమని అడిగిన దాఖలాలు ఒకవేళ ఉంటే అవి చాలా తక్కువ. ఎన్నో అవమానాలు మన కోసం భరించినప్పుడు యేమీ చేయలేని సందర్భాలు గుర్తొస్తున్నప్పుడు, బాధ వర్ణనాతీతం. తల్లి ఎటువంటిదైనప్పటికీ తల్లి మనసును బాధపెట్టడమూ అంటే భగవంతుని బాధపెట్టినట్లే అని పూజ్య చారీజీ అంటూండేవారు. తల్లి కళ్ళకెదురుగా కదలాడే నిస్స్వార్థ జీవి. 
అయితే సంతృప్తికరమైన రోజులు మా అమ్మగారితో బొత్తిగా లేవని కాదు. మా నాన్నగారు 1996 లో పరమపదించిన తరువాత 28 యేళ్ళు నాతోనే ఉండటం నా అదృష్టం ఆమెను చేతనైన జాగ్రత్తగా చూసుకో గలిగాను. నా గురుదేవులు నన్ను హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకునిగా చేసినప్పుడు మొట్టమొదటి ధ్యాన సిట్టింగ్ ఆమెకే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి చివరి వరకు నిత్యమూ ధ్యాన సిట్టింగులు ఇవ్వగలిగాను. నా దృష్టిలో తల్లి రుణం కొంతైనా తీర్చుకోగలిగే మహత్తర అవకాశం నా గురుదేవులు నాకు ప్రసాదించారనిపించింది. ఆధ్యాత్మిక సేవనందించగలిగాను. ఆవిడ క్రమం తప్పక తన సాధన చేసుకుంటూ ఉండేవారు. మన గురుపరంపర పట్ల అపార భక్తి ఉండేది. ధ్యానం అంటే గొప్ప గురి ఉండేది. మా చెల్లెళ్ళను, తన కోడలిని సమదృష్టితో చూడటానికి ప్రయత్నించేది. ఎవ్వరినీ నొప్పించే విధంగా మాట్లాడేది కాదు. తనను గురించిన ఆలోచన లేకుండా జీవించిన మహాసాధ్వి. 
ఈ ఉపద్రవ సమయంలో నాకు ఆసరాగా నిలిచినది నా సహజ మార్గ పరివారం. అన్నిటి కంటే మించి గురుదేవుల రక్షణ, అభయహస్తం మాపై ఉండటం. 13 రోజులు ఆమె ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా కొనసాగడానికి కోసం ప్రార్థన-ధ్యానం చేయమని గురుదేవులు ఆదేశించడం మన అభ్యాసులు, ప్రశిక్షకులు పాల్గొనడం జరిగింది. 
మా అమ్మను సదా నా హృదయంలో స్మరిస్తూ, కృతజ్ఞతతో జీవిస్తూ, ప్రేమను కొనసాగిస్తూ నా శేషజీవితాన్ని గురుదేవుల సేవలో వెచ్చిస్తానని మా అమ్మకు మాటిస్తూ, ఇదే నా కృతజ్ఞతాపూర్వక అశ్రునివాళి! 

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తపన తీవ్రతను పెంచుకోవడం ఎలా?

 


తపన తీవ్రతను పెంచుకోవడం ఎలా?

ఆధ్యాత్మిక పురోగతిని మందుకు సాగేలా నడిపించే శక్తి ఈ తపన; యాత్రను ముందుకు సాగించే ఇంధనం తపన; చైతన్య వికాసానికి దారి తీసేది ఈ తపన; ఆధ్యాత్మిక పరిణతికి కీలకమైనది తపన; సమయాన్ని ఆదాయ చేసేది తపన; తపన ఉంటేనే ఆసక్తి పెరుగుతుంది; తపన లేకుండా చేసే ఆధ్యాత్మిక సాధన ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం లాంటిది; దాహం లేకుండా నీరు గరాగడంలాంటిది; గడించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీర్ణమయ్యేలా చేసి, తపనను మరింత తీవ్రతరం చేసేది కూడా తపనే. తపనే దైవాన్ని ఆకర్షించేలా చేస్తుంది. తపనే ప్రేమను పెంపొందిస్తుంది. వెరసి ఆధ్యాత్మిక ప్రగతిని వేగవంతం చేసేది తపనే. 

అయితే మనుషులలో తపనల్లో వ్యత్యాసాలుండటానికి కారణాలు అనేకం కావచ్చు. ముఖ్యంగా కోరికలు, వికారాలు, వాసనలు (సంస్కారాలు), అహంకారము. ఇవే తపన తీవ్రతను తగ్గించే నకారాత్మక శక్తులు. స్వతఃసిద్ధంగా ఆత్మలో ఉండే ఈ తపనను పెంచగలిగేది మన ఇచ్ఛాశక్తి (Will Power). ఈ ఇచ్ఛాశక్తిని పెడత్రోవను పట్టించేవే మనం ఇంతకు ముందు చెపుకున్నవి. అందుకే ఈ శక్తిని దైవాన్ని ఆకర్షించే విధంగా ప్రయత్నపూర్వకంగా మరల్చాలి. అక్కడే హార్ట్ఫుల్నెస్-సహజ మార్గ్  ధ్యాన ప్రకరొయ్యల వంటి ఆధ్యాత్మిక పద్ధతులు, స్వాధ్యాయం, ఆత్మవికాస సాహిత్య అధ్యయనం, సజ్జన సాంగత్యం, స్వచ్ఛందంగా ఇతరుల సేవలో ఉండటం, ఇవన్నీ సహకరిస్తాయి. క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి జరుగుతూ, ఈ అపన అనే అగ్ని ఎడతెగకుండా ప్రజ్వరిల్లుతూనే  ఉంటుంది. 

కాబట్టి ప్రతి జిజ్ఞాసువు, త్రికరణ శుద్ధిగా పరమసత్యాన్ని అన్వేషించే ముముక్షువులు, సాధకులు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ తమ తపనను తీవ్రతరం చేసుకునే పనిలో నిమాగ్నమైపోవాలి. తథాస్తు.

తపన , ఆధ్యాత్మిక తృష్ణ

తపన , ఆధ్యాత్మిక తృష్ణ 


స్వతః సిద్ధంగా ప్రతీ ఆత్మలోనూ దేని కోసమో తెలియని ఆరాటం, తపన, ఒకరకమైన ఆకలి, దాహం ఉంటుంది. దీన్నే మనం ఆధ్యాత్మిక తృష్ణ అని అంటాం. ఇది హృదయంలో ఒక విధమైన అశాంతిని కలిగిస్తుంది. వన్నీ హృదయాలు దీన్ని స్పష్టంగా అనుభూతి చెందుతాయి; చాలామందిలో ఇది నిద్రాయణ స్థితిలో గాని, బలహీనంగా గాని ఉంటుంది. కానీ తప్పక ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. 

ఈ దాహం యొక్క తీవ్రతను బట్టి ఆయా ఆత్మల దాహం తీరే వరకు వాటి మార్గాలు అవి వెతుక్కుంటూ ఉంటాయి. దీన్నే మనం జీవితం అంటాం. ఆత్మ యొక్క తీవ్రతకు అనుగుణంగానే జీవితం అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వ్యక్తమయ్యే క్రమంలోనే కోరికలు, స,మస్కారాయాఉ, అహంకారాల పాత్ర ఉంటుంది. 

గాయితమ బుద్ధుడైనా, స్వామి వివేకానంద అయినా, శ్రీ రామకృష్ణ పరమ హంస అయినా, లాలాజీబాబూజీలయినా, సామాన్య సాధకుడైనా అందరిలో ఉండే ఆధ్యాత్మిక దాహం ఒక్కటే. కేవలం తీవ్రతల్లో వ్యత్యాసం ఉంది అంటే. కానీ ఆ వ్యత్యాసం మాత్రం విపరీతంగా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ దాహం పూర్తిగా తీరే వరకూ నిద్ర పట్టేది కాదట, మనకు నిద్ర పడుతోంది. ఆ తేడా తపనలో  ఊహించలేనంత ఉంది. 

ఈ తపనే గమ్యాన్ని చేరువ చేసేది. ఆకలి ఎంత ఎక్కువగా ఉంటే ఆహారానికి అంతా దగ్గరగా ఉంటాం; అలాగే దాహం ఎంత ఎక్కువగా ఉంటే నీరు అంతా చేరువవుతుంది. పరమ గమ్యం చేరే వరకూ మనలను నడిపించేది ఈ తపనే. ఈ తపన యే గమ్యాన్ని చేరుకోవాలన్నా అవసరమే. 

మన మహాత్ముల జీవితాల్లో ఈ తపన-ఘట్టాన్ని పరిశీలిస్తే కొంతవరకైనా అర్థమవుతుంది, వాళ్ళు యే విధంగా ఆ పరమాత్ముని కోసం పరితపించేవారో. 

బుద్ధుడు సిద్ధారథుడిగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడిని, ఒక శవాన్ని, ఒక వ్యాధిగ్రస్త వ్యక్తిని చూసి, ఆయన మనసు యే విధంగా చలించిపోయిందో, తాను మహా సామ్రాజ్యానికి రాజునన్న విషయం కూడా మరచిపోయి, భార్య, తనయుడు ఉన్నారన్న స్పృహ లేకుండా, కేవలం ఆతను చూసిన వాటి వెనుక ఉన్న పరమ సత్యం ఏమిటో, మానవుడి కష్టాలకు అసలు కారణం ఏమిటో కనుగొనాలన్న తపనతో అంతర్ముఖుడై శోధించి సమాధానాలను కనుగొనడం జరిగింది. ఆయనకు ఆయనలో కలిగిన ప్రశ్నలకు సమాధానం దొరికే వరకూ మరేమీ ఆయన మనసులోకి రాలేదు. ఆ విధంగా ఉండింది వారి తపన, వారి జిజ్ఞాస. మనం కూడా ఆయన చూసినవన్నీ చూస్తున్నాం కానీ ఆ తీవ్రత మనలో ఎందుకు కలగడం లేదు? ఇది మనలను మనం ప్రశ్నించుకోవాలి.

అలాగే స్వామి వివేకానంద 18 యేళ్ళ యువకుడిగా ఉన్నప్పుడే దారిలో వెళ్ళే ప్రతీ వ్యక్తిని, "మీరు దేవుడిని చూశారా? మీరు దేవుడిని చూశారా?" అని అడిగేవారట.  అలా దేవుడిని చూసిన వ్యక్తిని కలిసే వరకూ ఆయన నిద్ర పోయేవారు కాదట. మనకూ కూడా ఇదే ప్రశ్న ఉంది. కానీ మనకు ఇంకా నిద్ర పడుతోంది. ఇదే తపణలో తీవ్రతలో తేడా అంటే. 

ఇక శ్రీ రామకృష్ణ పరమహంస వారి విషయానికొస్తే, వారు సాధన చేసుకునే రోజుల్లో ప్రతీ రోజు చీకటి పడేసరికి, ఏకాంతంలో భగవంతుడిని చూడకుండా మరో రోజు గడిచిపోయిందేనని కన్నీరు పెట్టుకునేవారట. వారి సాధనా ప్రకరణం అంత దీక్షగా, తీక్షణంగా గడచింది. 

అలాగే బాబూజీ మహారాజ్ వారి చిన్నప్పటి నుండి దైవాన్ని అనుభూతి చెందడం కోసం ఆ వయసు నుండే అనేక ప్రయోగాలు చేసేవారట. ఆ అన్వేషణలో లాలాజీ పాదాల చెంత చేరే వరకూ ఆ దాహం తీరలేదు. 

ఇలా మనం మహాత్ముల జీవితాల్లో ఈ ఘటాలను పరిశీలిస్తే మన అపన తీవ్రమవడానికి దోహదపడువచ్చునేమోనని నా అభిప్రాయం. కావున తపన అందరిలో తీవ్రతరమవుగాక. గమ్యము చేరుకునేంత వరకూ విశ్రమింపకుందురుగాక. 

 


11, సెప్టెంబర్ 2024, బుధవారం

సాధనా పంచకం - ఆది శంకరాచార్యులవారు

సాధనా పంచకం 

ఆదిశంకరులవారు సాధకులు పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఎక్కవలసిన 40 మెట్లను ఈ చిన్ని 5 శ్లోకాల గ్రంథంలో నిక్షిప్తం చేశారు. దీన్నే సాధనా పంచకం అంటారు. గంభీర సాధకులకు అద్భుత మార్గదర్శకాలివి: 

1. నిత్యం వేదాధ్యయనం చెయ్యండి. అంటే మన శాస్త్రాలను అధ్యయనం చెయ్యండి.  

2. మన శాష్టరాలు నిర్దేశించిన విధంగా మీ ధర్మాలను, మీ కర్మలను మీరు జాగారూకతతో నిర్వర్తించండి. 

3. ఈ కర్మలన్నీటినీ భగవంతునికి అర్పించి ఆరాధించండి. 

4. మనసులో ఉన్న కోరికాలన్నీటినీ తొలగించేయండి. 

5. గుండెల్లో దాచుకున్న పాపాల భారాన్ని కడిగివేయండి. 

6. సాంసారిక విషయాల వల్ల కలిగే సుఖాలన్నీ వేదనపూరితమైనవని గుర్తించండి. 

7. నిత్యానుష్ఠానం ద్వారా పరమాత్మ కోసం తపించండి. 

8. గృహము అనే బంధం నుండి తప్పించుకోండి. అంటే మీ చేతనను గృహానికే పరిమితం గాకుండగా మరింత విస్తృతంగా విస్తరింపజేయండి. 

9. వివేకవంతుల సాంగత్యం కోసం పరితపించండి. 

10. భగవంతుని పట్ల భక్తిలో మిమ్మల్ని మీరు సుస్థిరపరచుకోండి. 

11. శాంతి వంటి సుగుణాలను మీలో పెంపొందించుకోండి. 

12. కోరికతో కూడిన చర్యలన్నీ నివారించుకోండి. 

13. పరిపూర్ణుడైన మాస్టరు పట్ల శరణాగతి కలిగి ఉండండి. 

14. నిత్యం గురువును సేవించండి. 

15. పరివార్తనకు ఆస్కారం లేని ఓంకారం పై ధ్యానించండి. 

16. ఉపనిషత్తుల్లో ఘోషించిన అంశాలను లోతుగా విని అర్థం చేసుకోండి. 

17. ఉపనిషత్తుల్లో నిర్దేశించిన వాటి భావాన్ని నిత్యం మననం చేసుకుంటూ ఉండండి. 

18. బ్రహ్మపదార్థం అనేది సత్యము అన్న సత్యాన్ని ఆశ్రయించండి. 

19. వితండవాదాలకు దూరంగా ఉండండి. 

20. శ్రుతులు నిర్దేశించే వివేకపూరిత విధానాన్ని అనుసరించండి. 

21. 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో ఎప్పుడూ నిమగ్నమై ఉండండి. 

22. దర్పాన్ని విడిచేపెట్టేయండి. 

23. 'నేను శరీరం' అన్న భావాన్ని విడిచి పెట్టేయండి. 

24. విజ్ఞులతో వాదనలు చేయకండి. 

25. ఆకలిని, వ్యాధిని తగిన విధంగా చూసుకోండి. 

26. నిత్యం భిక్ష ద్వారా పొందిన ఆహారం అనే ఔషధాన్ని గ్రహించండి. 

27. రుచికరమైన ఆహారాన్ని యాచించకండి. 

28. లభించినడానితో సంతుష్టులయి భగవంతునిచ్చే ప్రసాదింపబడినట్లుగా స్వీకరించండి. 

29. శీతోష్ణ, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలన్నీటినీ సహనంతో భరించండి. 

30. అర్థంలేని ప్రశంగాలకు దూరంగా ఉండండి. 

31 చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి; వాటిని పట్టించుకోకుండా ఉండండి, 

32. ఇతరుల దాయకు పాత్రులు గాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. 

33. ఏకాంతంలో ఆనందంగా జీఈమచండి. 

34. ఆ పరమాత్మునిలో మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. 

35. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించి సాక్షాత్కరించుకోండి. 

36. పరింతమైన ప్రపంచం పరమాత్మ యొక్క మితయేనని గుర్తించండి. 

37. గత జన్మలలో చేసిన కర్మల (సంచిత) ప్రభావాలపై ప్రస్తుతం చేసే సరైన కర్మల ద్వారా జయం సాధించండి. 

38. వివేకం సహాయంతో భవిష్యత్ కర్మల నుండి (ఆగామి నుండి) మామత్వాన్ని పోగొట్టుకోండి. 

39।  గతలోని కర్మల ప్రభావాన్ని (మొదలైన ప్రారబద్ధాన్ని) 

అనుభవించడం ద్వారా పూర్తిగా అవగొట్టండి. 

40. ఆ తరువాత 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో లీనమై జీవించండి. 


ఆచార్య వినోబా భావే



ఆచార్య వినోబా భావే 
(1895-1982)
ఈ రోజు భారత రత్న ఆచార్య వినోబా భావే జన్మదినోత్సవం. ఆయన సెప్టెంబర్ 11, 1895 న ఒక బ్రాహ్మణ కుటుంబంలో, మహారాష్ట్రలో  జన్మించారు. వీరి అసలు పేరు వినాయక నరహరి. డబ్బు సంపాదించడం కోసం ఆయనకు చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. అందుకే వారు బనారస్ వెళ్ళి, సంస్కృతంలో పట్టు సాధించి, మన శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం జరిగింది. అలాగే కొరాన్ అధ్యయనం చేయడం కోసం వారు అరబిక్ నేర్చుకొని మూలాన్ని చదివి పట్టు సంపాదించారు. అలాగే బైబిల్ చదువుకున్నారు. 
 
వీరు సంఘ-సంస్కర్తగానూ, స్వాతంత్ర్య  సమర యోధుడుగానూ,  ఆధ్యాత్మిక ఆచార్యులుగానూ భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా  ప్రసిద్ధి పొందినవారు. వీరు మానవ హక్కుల కోసం, పోరాడిన వ్యక్తి; అహింసను ఆయుధంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. 

అంతే కాదు, ఆచార్య వినోబా భావే అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్ర్యం సాధించిన తరువాత, 1951 లో  వారు నేతృత్వం వహించిన భూదాన్ ఉద్యమం. ఈ ఉద్యమ లక్ష్యం భూమి సేకరణ - భూమి ఎక్కువగా ఉన్నవారు, భూమి లేని వారికి భూదానం చేయడం. దీని కోసం వారు కొన్ని వేల కిలోమీటర్లు నడవడం జరిగింది.  మనకు ప్రత్యేకంగా విశేషం ఏమిటంటే, ఈ ఉద్యమాన్ని, తెలంగాణాలోని హైదరాబాదు శివార్లలో ఉన్న పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ ఊరును భూదాన్  పోచంపల్లి అని కూడా అంటారు. 

1940 లో మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం చేసినవారు వీరే; ఆ తరువాతే నెహ్రూగారు చేయడం జరిగింది. ఈ పోరాటంలో 7 సార్లు ఖైదులో ఉన్నారు. 1958 లో వారు రేమన్ మ్యాగ్సాసే పురస్కారం, మరణానంతరం 1983 లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించడం జరిగింది. 
1932 లో, మహారాష్ట్రలోని ధూలే అనే ప్రదేశంలో, ఆరు నెలలు ఖైదీగా ఉండవలసి వచ్చినప్పుడు, ఆశువుగా భగవద్గీత మీద, 700 శ్లోకాలపై మరాఠీలో ఇతర ఖైదీలనుద్దేశించి అనర్గళంగా అద్భుతంగా, సమాధి స్థితిలో ఉంటూ ప్రవచనాలివ్వడం జరిగింది.  అవే Talks on the Gita అనే పేరుతో ఆంగ్లంలో ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం అన్ని  భారతీయ భాషలలోనూ, అనేక విదేశీ భాషలలో కూడా ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథాన్ని భారతీయ సంపదగా భావిస్తారు. 

ఈ గ్రంథాన్ని గురుదేవులు పూజ్య దాజీ  2019 లో మన సంస్థ ప్రచురణగా విడుదల చేయడం జరిగింది. దాజీ ఈ గ్రంథాన్ని గురించి ముందుమాటలో, ఈ గ్రంథాన్ని గురించి వినోబా భావే స్వయంగా పలికిన మాటలను  సంస్మరించుకున్నారు: "నేను గీతను గురించి వ్రాసిన వ్యాసాలు గాని, ప్రవచనాలు గాని జైల్లో గాక మరెక్కడైనా అయితే అంతా అద్భుత ప్రభావం కలిగి ఉండేవి కావేమో; ఈ ఖైదు మా స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఒక యుద్ధ క్షేత్రం అవడం వల్ల ఇంతటి  ప్రభావం కలిగి ఉన్నాయనిపిస్తుంది."

ప్రతి ఒక్కరూ ఈ అద్భుత గ్రంథాన్ని, చక్కటి కథలా చెప్పిన ఈ 18 ప్రసంగాలను ఆస్వాదించి భగవద్గీత యొక్క గొప్ప ప్రయోజనాన్ని సిద్ధించుకొందురుగాక. 


 

5, సెప్టెంబర్ 2024, గురువారం

ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5

 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 
(1888-1975)

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశ రెండవ రాష్ట్రపతిగా (1962-67) ఉన్న విషయం అందరికీ విదితమే. భారతదేశం గర్వించదగ్గ మహాపండితులు, మహా జ్ఞాని. వారు 1962 లో రాష్ట్రపతిగా పదవిని చేపట్టినప్పుడు వారి శిష్యులు వారి జన్మదినోత్సవాన్ని వైభవంగా జరపాలనుకున్నారు. దానికి వారు, నా జన్మదినోత్సవం చేసే బదులుగా ఈ రోజున ఉపాధ్యాయుల దినోత్సవంగా పరిగణించి ఉపాధ్యాయులను గౌరవించమని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరమూ సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయుల దినోత్సవంగా వారి గౌరవార్థం జరుపుకుంటూ ఉన్నాం. 

మనలో ప్రతి ఒక్కరి జీవితంలో మనలను అనేక రకాలుగా ప్రభావితం చేసి ఉంటారు. సకారాత్మకంగా ప్రభావితం చేసినవాళ్ళూ ఉండవచ్చును, నకారాత్మకంగానూ ప్రభావితం చేసినవాళ్ళు కూడా ఉండి ఉండవచ్చును. మనకు ఈ రెండు రకాల వాళ్ళు జ్ఞాపకం ఉండిపోతారు. ఇరువురి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండవలసినదే. ఒకళ్ళు జీవితంలో ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తే, మరొకరి వద్ద నుండి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం గనుక. 

నా జీవితం మలచడంలో నాకు తెలుగు బోధకులుగా ఉన్న ఉపాధ్యాయులకు ఎంతో ఋణపడి ఉన్నాను. స్కూల్లో శ్రీమతి పద్మజ టీచర్, జూనియర్ కళాశాలలో శ్రీ అక్కిరాజు రామకృష్ణ గారు, డిగ్రీలో డా. అరిపిరాల విశ్వంగారు. అందరూ మహానుభావులే. అలాగే నాలో నాకే తెలియని కళలను వెలికి తీసిన శ్రీమతి విద్యాధరిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతాంజలి. 

ఉపాధ్యాయుడంటే బోధించేవాడు అని అర్థం; విద్యను నేర్పించేవాడు.  నేర్పించాలంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి; అంటే ఎప్పుడూ విద్యార్థిగానే ఉండాలి. కాబట్టి ఎప్పటికీ విద్యార్థిగా ఉండేవాడే సరైన ఉపాధ్యాయుడు. అటువంటివారే విద్యార్థులను సరైన నాగరికులగా, సరైన మానవులుగా, తీర్చి దిద్దగలిగేది.  అటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 

అలాగే విద్యార్థులకు కేవలం సమాచారాన్ని అందించడమే గాక, విషయాలను స్పష్టంగా వివరించగలగడమే గాక, వారిని ఆలోచిమపజేసి, ప్రేరణ కలిగించేవాడు శ్రేష్ఠమైన ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయులు ధన్యులు. ఎందుకంటే అటువంటి ఉపాధ్యాయులు సజీవ ఉదాహరణలుగా నిలుస్తారు. వీళ్ళ వ్యక్తిత్వాలు అనుసరించదగ్గవిగా ఉంటాయి. వీళ్ళ సంఖ్య అపరిమితంగా పెరగాలని మనందరం  ఆకాంక్షించాలి.  




4, సెప్టెంబర్ 2024, బుధవారం

చైతన్య వికాసం - 1

మానవ జీవిత యదార్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ... నీటి చుక్క మహాసాగరంలో లయమైపోవాలంటే, మనిషిలో అనుక్షణమూ పరిణతి సంభవించలంటే, మానవ పరిపూర్ణాటను సిద్ధింపచేసుకోవాలంటే, ఆత్మవికాసం జరగాలంటే, చైతన్య వికాసం జరగాలంటే, దివ్యప్రేమగా మారాలంటే, జీవిత ప్రయోజనం సిద్ధించాలంటే  మహనీయులు సూచించిన క్రమం ఈ క్రింది విధంగా ఉంది: 

 భగవంతునిలో (ప్రేమలో)సంపూర్ణ ఐక్యం 

అంతరంగం దివ్యప్రేమగా పరివర్తన చెందినప్పుడు  

సమర్పణ, ప్రపత్తి, శరణాగతి సంభవించినప్పుడు 

నిరంతర స్మరణ సిద్ధించినప్పుడు 

సరైన భావనతో నిత్య సాధన నిష్ఠగా కొనసాగించినప్పుడు 

(ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన, దశ నియమాలకనుగుణంగా జీవిత నిర్వహణ, స్వాధ్యాయం) 

అలసత్వాన్ని అంటే బద్ధకాన్ని ప్రక్కకు పెట్టి, గమ్యం పట్ల ఆసక్తి  పెంచుకున్నప్పుడు 

మనిషి తనను తాను మరింత-మరింత మెరుగైన విధంగా పరివర్తన చెండాలన్న ఆలోచన కలిగినప్పుడు 


8, జులై 2024, సోమవారం

వివాహ వ్యవస్థ - 3

 


(సప్తపది)


వివాహ వ్యవస్థ - 3 
వివాహ వ్యవస్థలో, సనాతన ధర్మం ప్రకారం రకరకాలుగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అతి ప్రసిద్ధమైన అందరూ సాధారణంగా అనుసరించే పద్ధతులు - మాంగల్య ధారణం, పాణిగ్రహణం, కన్యాదానం, సప్తపది, వీటిల్లో ఏదోక తంతు అయినా ఉంటుంది లేక అన్నీ కలిసి కూడా వివాహ మహోత్సవం జరుపుకుంటూ ఉంటారు. 
మాంగల్యధారణంలో , వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది; మూడు ముళ్ళకర్థం: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతం ఈ మూడు ముళ్ళు. మూడు  శరీరాలలోనూ ఇరువురూ ఒక్కటిగా ఉండాలన్నది ఆశయం.   
పాణిగ్రహణంలో వధువు చేయి, వరుడు చేతిలో పెట్టడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో సజీవ గురువు, గురుదేవులు, మాస్టర్,  సాన్నిధ్యంలో వధూవరులు, పూలదండలు మార్చుకున్న తరువాత (ముందుగా వధువు వరుడి మెడలో దండ వేస్తుంది, ఆ తరువాత వరుడు వధువు మెడలో దండ వేయడం జరుగుతుంది) వరుడు చేతిలో వధువు చేయి ఉంచి ఆశీర్వదించడం జరుగుతుంది. జీవితాంతం అలా ఒకరికొకరు కొనసాగాలని, వరుడు, వధువును ఆ విధంగా చూసుకోవాలని అర్థం. ఒక మహాత్ముని సమక్షంలో పాణి గ్రహణం చేయడం అనేది ఇరువురికీ అమితమైన బాధ్యతను సూచిస్తుంది. 
కన్యాదానం అంటే వధువు యొక్క తల్లిదండ్రులు తమ కుమార్తెను, కన్యను, వరుడిని మహావిష్ణువుగా భావించి, అంటే భగవంతునిగా భావించి తాము అపురూపంగా పెంచిపెద్దచేసిన కన్యను, అపరిమితమైన విశ్వాసంతో  ఆయన చేతిలో పెట్టి, అప్పుడప్పుడు వరుడి కాళ్ళు కడిగి (భగవంతుని పాదాలుగా భావించి), దానం చేయడం జరుగుతుంది. 
సప్తపది అనే నాల్గవ తంతులో అగ్నిహోత్రుని చుట్టూ, అగ్నిసాక్షిగా  వధూవరులిద్దరి చేత, అన్యోన్య దాంపత్యానికి అవసరమైన ఏడు వాగ్దానాలు, చేయిస్తారు.  కలిసి ఏడు అడుగులు వేస్తూ, అందుకే వీటిని సప్తపది అంటారు అంటే ఏడు అడుగులు వేస్తూ ఈ ప్రమాణాలు చేస్తారు. వీటినే పెళ్ళినాటి ప్రమాణాలు అని కూడా అంటారు. 
ఆ విధంగా వివాహ వ్యవస్థ ఒక పవిత్ర వ్యవస్థ, మానవ సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచుతూ మనుగడకు ఉపయోగపడే మహత్తరమైన వ్యవస్థ. 
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడూ, ఇది ఆలుమగలు పరిశుద్ధ ప్రేమతత్త్వాన్ని పెంపొందించుకునే అద్భుత వ్యవస్థ. తద్వారా ఆత్మసాక్షాత్కార దిశగా లేక భగవత్సాక్షాత్కార దిశగా తీసుకువెళ్ళేటువంటి పవిత్ర వ్యవస్థ. ప్రేమ, త్యాగాలను అనుభవపూర్వకంగా శిక్షణనిచ్చే వ్యవస్థ. రోజు-రోజుకూ మరింత మెరుగైన మానవుడిగా మారడానికి అనువైన, వీలుకల్పించే  శిక్షణాస్థలి, అద్భుత అవకాశం. ఇతరులను గురించి ఆలోచింపజేసే ఆశ్రమం గృహస్థాశ్రమం. 



6, జులై 2024, శనివారం

వివాహ వ్యవస్థ - 2

 


(కన్యాదానం)

వివాహ వ్యవస్థ - 2 
వివాహం నా అవగాహన ప్రకారం ఒక దైవ కార్యం; ప్రకృతి నిర్వహించే కార్యం; ప్రేమకు సంబంధించిన కార్యం. 
దైవ కార్యం ఎందుకంటే, రెండు ఆత్మలు సరైన సమయంలో ఎదురుపడటం అనేది సంభవించేది దివ్యపరిణామం వల్ల మాత్రమే. 
ప్రకృతి కార్యం ఎందుకంటే రెండు ఆత్మల సంస్కారాలను బట్టి ఒక్కచోటుకు జేర్చేది ప్రకృతి కాబట్టి, ఆ రెండు ఆత్మల కలయిక, ఆ తరువాత పునరుత్పత్తి, ఇత్యాది కార్యాలు ప్రకృతికి సంబంధించినవి కాబట్టి. 
వివాహం ప్రేమకు సంబంధించినది, ఎందుకంటే వైవాహిక జీవనంలోనే ప్రేమ, త్యాగం వంటివి నేర్చుకునేది. పరిశుద్ధ ప్రేమకు దారితీసే ఒక నిగూఢ వ్యవస్థ వివాహ వ్యవస్థ. 
పరిశుద్ధ ప్రేమ అంటే, భయము, క్రోధము, మోహము, ఈర్ష్య, అహంకారము, ఇత్యాది వికారాలు పూర్తిగా తొలగిపోయిన ఆత్మ స్థితి, శుద్ధ ప్రేమ అంటే. అన్ని ఆధ్యాత్మిక సాధనలు, చివరకు ఈ పరిశుద్ధ ప్రేమ స్థితికి చేరుకోవడానికే ; అదే పరమ లక్ష్యం. అది కానట్లయితే అట్టి సాధనా పద్ధతులను వెనువెంటనే విడిచి పెట్టేయాలి. 
పరిశుద్ధ ప్రేమకు దారితీసే జీవన విధానంలో వివాహ వ్యవస్థ ఒక కీలకమైన భాగం, ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన అంగం. స్త్రీపురుష జీవనానికి సరైన దిశను ఏర్పరచేది ఈ వివాహ వ్యవస్థ. ఈ దిశ లేనట్లయితే, అది కేవలం పాశవిక జీవనంగా మిగిలిపోతుంది. 
వైవాహిక జీవితం యొక్క ప్రగాఢ ప్రాముఖ్యతను మనిషి జీవితంలో గుర్తించి, తదనుగుణంగా ఆలుమగలు తమ జీవితాలను సరిదిద్దుకోవడం, మానవాళి శ్రేయస్సుకు మంచిది. దీనికి హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన విధానం వంటి జీవన విధానం అనుసరించినట్లయితే, మానవ వికాసం త్వరితగతిని జరిగే అవకాశం చాలా ఉంది. 

1, జులై 2024, సోమవారం

వివాహ వ్యవస్థ - 1

(పాణి గ్రహణం)

వివాహ వ్యవస్థ - 1 

వివాహం అవసరమా? వివాహం చేసుకోవాలా, అక్కర్లేదా? అసలు వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు, ఎలా మొదలయ్యింది? వివాహం చేసుకుంటే ఆడపిల్లలు యే వయసులో చేసుకోవడం శ్రేష్ఠం? మగ పిల్లలకు యే వయసు శ్రేష్ఠం?  వివాహం అయ్యాక వైవాహిక జీవనం శ్రేష్ఠంగా గడపాలంటే ఎలా? వైవాహిక జీవనానికి సముచిత అర్థం ఉండాలంటే ఏమి చేయాలి? 

ఈ ప్రశ్నలన్నీటికీ సమాధానాలు ఎవరికి వారు వెతుక్కుని, సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకూ జీవితాంతమూ తెలుసుకుంటూనే ఉండటం కొనసాగుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందరికంటే గొప్పగా మనిషికి తెలియజేసేది సాక్షాత్తూ జీవితమే, ప్రకృతే. కానీ జీవితం నేర్పిస్తే చాలా కఠినంగా నేర్పిస్తుంది, చాలా సమయము, జీవితమూ  రెండూ  వ్యర్థం అవుతాయి కూడా. అందుకే మనం పెద్దల విజ్ఞతను, వారిచ్చిన జ్ఞానాన్ని,  అనుసరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూంటాము; కానీ ఎక్కడో అక్కడ మన తెలివితేటలు, మనలో ప్రతీదానికీ కారణం వెతుక్కునే తత్త్వం అడ్డు వస్తూనే ఉంటుంది. 

నా జీవితానుభవంలోనూ, పెద్దల మాట వినడంలోనూ , స్వంతంగా జీవితం నేర్పిన పాఠాల ద్వారానూ, సహజ మార్గ గురువుల బోధల ద్వారానూ, ఇప్పటి వరకూ తెలుసుకున్నది పంచుకునే ప్రయత్నం చేస్తాను, ఇక్కడ. 

పురుషులు సృష్టింపబడినది భర్తలవడానికి, స్త్రీలు జన్మించినది తల్లులుగా మారడానికేనని ఎక్కడో చదివినట్లు గుర్తు.  అప్పుడే వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. మానవజాతిని పునరుత్పత్తి చేసి వృద్ధి చేయడం, సమాజం పట్ల మానవులు చెయ్యవలసిన  కర్తవ్యం. ఇది వివాహ ధర్మం.  

(సశేషం ... )

28, జూన్ 2024, శుక్రవారం

ఆత్మ సాక్షాత్కారం - బాబూజీ

 


ఆత్మ సాక్షాత్కారం - బాబూజీ 

అభ్యాసి: ఆత్మ సాక్షాత్కార అనుభూతి ఎలా ఉంటుంది బాబూజీ? దాని అనుభవం మాకు మీరు ఇవ్వగలరా బాబూజీ?
బాబూజీ: ఎవరో ఒకసారి మా వద్దకు వచ్చి సవాలు చేయడం జరిగింది. అప్పుడు  వెంటనే ఒక్క నిమషంలోనే ఆత్మ సాక్షాత్కారంలో ఆఖరి స్థితి వరకూ అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నా శక్తులన్నీ వెంటనే ఉపసంహరించుకోవడం జరిగింది. ఆతని పరిస్థితి అంతకు ముందులాగే తయారయ్యింది. ఈ సంఘటన 1957 లో అనుకుంటాను జరిగింది. ఆ సమయంలో నన్ను కలవడానికి షాహాజహానుపూర్ రావడం జరిగింది. వాళ్ళల్లో ఒకరు, "ప్రాచీన కాలంలో ఋషులు, మునులు నిముషాల్లో సాక్షాత్కారం చేయించేసేవారట" అన్నాడు. "కావచ్చు, బహుశా చేయించేవారేమో. మన దగ్గర మాత్రాం సమయం పడుతుంది మరి" అన్నాను. ఇలా మాట్లాడుతూనే అతన్ని ఆత్మసాక్షాత్కారం యొక్క ఆఖరి స్థితి వరకూ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఈ ప్రశ్నలు అతన్ని అడిగాను:
"నీ శరీరం ఉందా?" "లేదు" అన్నాడు. 
"నీ ఆత్మ ఉందా?" అని అడిగాను. "లేదు" అన్నాడు. 
"మరేముంది?" అని అడిగాను. "యేమీ లేదు బాబూజీ" అన్నాడు. 
"ఇదే సాక్షాత్కారం యొక్క ఆఖరి స్థితి" అని చెప్పాను. 
ఆ తరువాత నా శక్తులన్నీ పూర్తిగా ఉపసంహరించుకున్నాను. అతనున్న పూర్వ స్థితికి తిరిగి వచ్చేశాడు. ఆ స్థితిని శాశ్వతంగా ఉండేట్టు చేయమని ఎంతో బ్రతిమాలాడు. "చూడు నాయనా! మేమెప్పుడూ ఎవరితోనూ వాగ్దానాలు చెయ్యం. కానీ నేను నీకు మాట ఇస్తున్నాను ఇచ్చేస్తాను, కానీ ముందు నువ్వు ఎమ్. ఎ. పూర్తి చేసిరా" అని చెప్పాను. 
అభ్యాసి: బాబూజీ అతను వస్తే ఆయనకు సాక్షాత్కార అనుభవం ఇచ్చేస్తారా? 
బాబూజీ: వాగ్దానం చేశాను కదా. తప్పక ఇస్తాను. కానీ ముందు అతను ఎం. ఎ. పూర్తి చేసి రానీ. నేను కూడా నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. 
కొంతమంది ఎలాంటి ప్రశ్నలు వేస్తారంటే వాటికి జవాబు చెప్పడం అసాధ్యమవుతుంది. ఒకవేళ జవాబు ఇస్తే అది వాళ్ళకు అర్థం కాదు. 
ఒకసారి ఒక సజ్జనుడు లాలాజీని, భగవంతుడు సృష్టిని ఎందుకని  సృష్టించాడంటారు? అని అడిగాడు. 
దానికి లాలాజీ: ఆ సమయంలో నువ్వు గాని నేను గాని లేము అక్కడ, లేకపోతే అక్కడే ఆపేసి ఉండేవాళ్ళం, అని సమాధానాం ఇచ్చారట. 
అలాగే మరొక వ్యక్తి లాలాజీని "భగవంతుడు మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?" అని అడిగాడు. దానికి లాలాజీ మౌనంగా ఉండిపోయారు. కాస్సేపు తరువాత ఆ వ్యక్తి మళ్ళీ ఆ ప్రశ్నను అడిగాడు. దానికి లాలాజీ, "మీకు ఇప్పటికే సమాధానం చెప్పానని అనుకుంటున్నాను." అని అన్నారట. 
 

27, జూన్ 2024, గురువారం

బాబూజీ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రాణాహుతి ప్రసరణ

 



బాబూజీ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రాణాహుతి ప్రసరణ 

అభ్యాసి: బాబూజీ, మీరు రచించిన గ్రంథాలు ప్రాణాహుతిని ప్రసరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. 
బాబూజీ: నిజంగా ఇలాంటి అనుభవం నీకు జరిగిందా?
అభ్యాసి: అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను బాబూజీ. 
బాబూజీ: నీ అనుభవం సరైనదే. అన్నిటికంటే ఎక్కువ నేను వ్రాసిన సహజ మార్గ దశనియమాలపై వ్యాఖ్య అనే పుస్తకం నుండి ఈ అనుభూతి మీకు కలుగుతుంది.  
అభ్యాసి: అది నాకు తెలియదు కానీ మీ పుస్తకాలు చదువుతూ  ఉంటే మాత్రం  ప్రాణాహుతి ప్రసరణ ప్రారంభమైపోతుంది. 
బాబూజీ: సహజ మార్గ దశ నియమాల వ్యాఖ్య అనే పుస్తకం నుండే ప్రాణాహుతి ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?  ఎందుకంటే ఆ పుస్తకం నేను వ్రాయలేదు కాబట్టి. 
అభ్యాసి: ఎందుకని బాబూజీ? అందులో మీ పేరే ఉంది గదా?!
బాబూజీ: విను. ఒకసారి నా గురుభాయ్ పండిత రామేశ్వర ప్రసాద్ మిశ్రా గారు మా ఇంటికి వచ్చారు. అనేక విషయాలు చర్చించిన తరువాత, మిషన్ లోని దశ నియమాలపై వ్యాఖ్యను దయచేసి వ్రాయించండి అని కోరడం జరిగింది. సోదరా, ఇది లాలాజీకి సంబంధించిన విషయం, నేనెలా వ్రాయించగలను? అన్నాను. డానికాయన మీరు కచ్చితంగా వ్రాయించగలరు అన్నాడు. సరే అయితే నాకు కొంచెం ఆలోచించడానికి సమయం కావాలన్నాను.  సరే ఎంత సమయం కావాలి? అని అడిగారు. మేము ఆరు నెలల సమయం కావాలన్నాము. వారు తన డైరీలో వ్రాసుకుని, మరికొన్ని సంభాషణల తరువాత ఇంటికి వెళ్ళడం జరిగింది. సరిగ్గా 6 నెలల తరువాత, కాగితం కాలం తీసుకుని వచ్చి, ఇప్పుడు చెప్పండి భాయ్ అన్నారు. ఏమి వ్రాయించమంటారు? అని అడిగాను. మీరే చెప్పారు గదా, ఆరు నెలల తరువాత దశ నియమాలపై వ్యాఖ్య వ్రాయిస్తామని చెప్పారు గదా? అన్నారాయన. సోదరా! నిజంగా నేను మరచిపోయాను. అస్సలు దీని గురించి ఆలోచించలేదు. "అదేమీ కుదరదు, మీరిప్పుడు వ్రాయించవలసినదే" అన్నారాయన. సరే అయితే, వ్రాయండి అన్నాను. అలా నేను చెప్తూ పోయాను, ఆయన వ్రాస్తూ వెళ్ళారు. ఈ విధంగా మూడు సిట్టింగుల్లో దశ నియమాల వ్యాఖ్య వ్రాయించడం జరిగిపోయింది. పై నుండి ఆలోచనలు వస్తూ పోయాయి, మేము చెబుతూ పోయాం; మేము కేవలం ఒక మాధ్యమంగా ఉన్నాం అంతే. దశ నియమాల వ్యాఖ్య వ్రాయడం పూర్తయిన తరువాత ఒక అనుబంధం వ్రాయాలనుకున్నాను. రెండు-మూడు వాక్యాలు అదనంగా వ్రాద్దామనుకున్నాను. కానీ ఒక్క ఆలోచన కూడా రానే లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా?

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...