ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024
ఐక్యరాజ్య సమితి ప్రకటన
ధ్యాన ప్రేమికులకు, ధ్యాన సాధకులకు ఒక శుభవార్త!
ఈ సంవత్సరం నుండి ప్రతీ సంవత్సరమూ డిశంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం గా యావత్ ప్రపంచం అంతా జరుపుకోబోతోంది. శారీరక, మానసిక సమగ్ర ఆరోగ్యానికి తోడ్పడేదిగా ధ్యానాన్ని ఐక్య రాజ్య సమితి ఏకగ్రీవంగా గుర్తించడం జరిగింది.
ఈ మేరకు డిశంబర్ 15 న హార్ట్ఫుల్నెస్ - శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షులు పూజ్య దాజీ, ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను జూమ్ ద్వారా, దిల్ సే కార్యక్రమం ద్వారా ముచ్చటిస్తూ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని, తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో, హైదరాబాదులోని గచ్చి బౌలీ స్టేడియంలో డిశంబర్ 21, న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకూ జరుగబోతున్నదని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పూజ్య దాజీ స్వయంగా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను, ధ్యానం పట్ల ఆసక్తి గలవారందరినీ బంధిమిత్ర సమేతంగా రమ్మని ఆహ్వానించడం జరిగింది. అభ్యాసులను ముఖ్యంగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో పాల్గొని వాతావరణాన్ని మార్చమన్నారు దాజీ.
కావున అభ్యాసులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి: మానందరమూ సాధ్యమైనంత అధిక సంఖ్యలో శ్రద్ధాసక్తులతో, ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య దాజీ సంకల్పాన్ని దిగ్విజయం చేద్దాం.
విశ్వ శాంతి కి ఇదొక యజ్ఞం.
రిప్లయితొలగించండి