ధీశక్తి - ధ్యానం - 2
ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
ఆలోచనల మూలం ఏమిటి? ఆలోచనలు మన సంస్కారాల మూలాన లేక మన కర్మల వల్ల, వాసబాల వల్ల వస్తూంటాయి. ఇవి మామూలు ఆలోచనలు అవే చర్యలుగా మారి అవే ముద్రల్లా ఏర్పడి, పదే పదే అవే పనులు చేయడం వల్ల ప్రవృత్తుల్లా, లేక సంస్కారాలుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్కారాలే మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఇలా మనం సంస్కారాల బరువును తగ్గించుకవడం పోయి పెంచుకుంటూ ఉంటాం. తద్వారా ఇవన్నీ ఖర్చవడం కోసం మళ్ళీ-మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాం. కాబట్టి సంస్కారాల వల్లే ఆలోచనలు వస్తాయి, ఆలోచనల వల్లే సంస్కారాలు ఏర్పడటం, జరుగుతూ ఉంటుంది. మొక్క ముందా, విత్తు ముందా అనే పరిస్థితి. కొత్త సంస్కారాలు ఏర్పడకుండా కాపాడే కవచమే ధ్యాన స్థితి. ఇది ధ్యానం అల్లే సాధ్యం. ఆలోచనలకు అతీతంగా తీసుకువెళ్ళేదే ధ్యానం.
స్థూల ఆలోచనలు, సూక్ష్మ ఆలోచనలు, దివ్య ఆలోచనలు
మనిసజీకవచ్చే ఆలోచనలు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. 1) స్థూల ఆలోచనలు అంటే బరువైన ఆలోచనలు, నకరాత్మకమైన ఆలోచనలు, సాంసారిక ఆలోచనలు, 2) సూక్ష్మ ఆలోచనలు అంటే తేలికైన ఆలోచనలు, శాంతిని కలిగించేవి, హాయిని కలిగించేవి, సృజనాత్మకమైన ఆలోచనలు, 3) దివ్య ఆలోచనలు అంటే పై రెండూ ఆలోచనలు కంటే అత్యంత తేలికైనవి, అలౌకిక ఆనందాన్ని, ఆత్మసుఖాన్ని కలిగించేవి.
అందుకే ఎప్పుడూ దివ్య ఆలోచనలు కలిగేటువంటి వాతావరణాన్ని అంతరంగంలో సృష్టించుకునే ప్రయత్నంలో ఉండాలి మనిషి. ధ్యానం ద్వారాన్నే ఈ అంతరంగ వాతావరణాన్ని మార్చవచ్చు.
(సశేషం ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి