20, డిసెంబర్ 2024, శుక్రవారం

పూజ్య చారీజీ పుణ్యతిథి - డిశంబర్ 20, 2014


(జూలై 24, 1927 - డిశంబరర్ 20, 2014)
పూజ్య చారీజీ పుణ్యతిథి - డిశంబర్ 20, 2014 

ఈ రోజు, సహజ మార్గ గురుపరంపరలోని మూడవ గురువులు  పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ పుణ్యతఇతి, 10 వ వర్ధంతి. 
స్మరణ అంటే, ముఖ్యంగా ఇటువంటి మహాత్ములను స్మరించడం అంటే కేవలం జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కాదు, ఆ జ్ఞాపకాలను పునరజీవిమహయడం అన్నారు చారీజీ. అటువంటి స్మరణ వల్ల నిజమైన ఆధ్యాత్మిక ప్రయోజనం, స్మరించుకుంటున్న వ్యక్తిత్వం యొక్క ప్రత్యేక అనుగ్రహం, ప్రేమ వర్షించే అవకాశం ఉంటుంది. నిజమైన స్మరణగా పరిణమిస్తుంది. మానందరమూ వారి నుండి అందుకున్న, ఇప్పటికీ అందుకుంటున్న ప్రేమను, మార్గదర్శనాలను, బోధలు, ఆధ్యాత్మిక సేవలను, వారి సాన్నిధ్యాన్ని, వారి అపార కృపను, ప్రత్యేకంగా పునశ్చరణ చేసుకోవలసిన రోజు, ఈ రోజు. ఒక్కొక్కరికీ ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలు ఉండి ఉంటాయి, వాటన్నిటినీ సమీకరించుకుంటూ ఎవరికి వారు కృతజ్ఞతా పూరిత హృదయంతో పునర్జీవించడానికి ప్రయత్నిద్దాం ఈ రోజు. ముఖ్యంగా మన గురుపరంపరలోని మాస్టర్ల స్మరణ ఈ విధంగా చేయడానికి ప్రయత్నించాలని అనేవారు చారీజీ. 

ఆజానుబాహుడు, దివ్యమనోహర విగ్రహం అంటే ఏమిటో తలపించే స్వరూపం, అద్భుతమైన గంభీరమైన కంఠం, మనసులను అలవోకగా గెలుచుకోగలిగే వ్యక్తిత్వం, వారి ప్రత్యక్ష సన్నిధిలో అందుకున్న ధ్యాన స్థితులు అతి నిగూఢమైనవి, మాటల్లో వ్యక్తం చేయలేనివిగా ఉండేవి. వారి ప్రసంగాలు, రచించిన గ్రంథాలు, సంభాషణలు  వారి దైవత్వాన్ని వెల్లడించే మాధ్యమాలు. వారు మానవాళికి నిర్విరామంగా చేసిన ఆధ్యాత్మిక కృషి అంచనా వేయలేనిది. కులమత రంగుజాతి విభేధాల్లేకుండా, తన జీవిత కాలంలో 3000 కు పైగా వివాహాలు వ్యక్తిగత బాధ్యతతో నిర్వహించారు. బహుశా ఇది ప్రపంచ రికార్డ్ అయి ఉండాలి. ఇంచుమించుగా వాఋ సమక్షంలో వివాహం చేసుకున్నఅన్ని  జంటలూ సుఖంగా ఉన్నాయి. ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు జనానికి, ఎక్కడా తెలియనిచ్చేవారు కాదు. తన గురుదేవులైన బాబూజీ పట్ల ఆయనకున్న ప్రేమ, సమర్పణ, విధేయత, వారి జీవితంలో, వారు చేస్తున్న ప్రతీ పనిలోనూ అనుక్షణమూ కనిపిస్తూ ఉండేది. ఆయన ప్రశంగాల్లో ప్రతీ మూడో మాట బాబూజీ అనే పదం ఉండేది. బాబూజీని దర్శించని ఎందరో అభ్యాసులు బాబూజీని వారిలో దర్శించడం ద్వారా, బాబూజీని చూడలేదన్న వెలితిని పోగొట్టుకున్నారు. అదీ మన గురపరంపర మహత్యం. ప్రతీ గురువు బాబూజీని డర్షియప జేస్తూ ఉంటారు, మనం చూడలేకపోయినా. 
వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేద్దాం। 
 

1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...