డిజైనింగ్ డెస్టినీ - విధి రూపకల్పన
గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు
హార్ట్ఫుల్నెస్ మార్గం ద్వారా విధి రూపకల్పన (Designing Destiny the heartfulness way) అనే గ్రంథాన్ని పూజ్య దాజీ శ్రీ కమలేష్ డి. పటేల్ గారు వ్రాయడం జరగింది.
ఈ శీర్షిక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం ఏమనుకుంటే అది జరిగిపోతుందేమోనన్న ఆశ కలిగిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం దొరికినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇందులో చాలా సూక్ష్మయలున్నాయి; మన ఇచ్ఛాశక్తిని అంటే సంకల్ప శక్తిని (Will Power) సరైన దిశలో వినియోగించుకుంటే తప్ప సాధ్యం కాదని అర్థమవుతుంది. ఈ గ్రంథం, మనందరిలో ఉదయించే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు సూచిస్తుంది. మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది.
మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో యేదొక దశలో విధికి సంబంధించిన ప్రశ్నలు అనేకం వస్తూంటాయి. వాటిల్లో కొన్ని ఈ ఈ విధంగా ఉండవచ్చు:
అసలు విధి అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? రెండూ ఒకటేనా?
మనిషి యొక్క విధి, నుదుటివ్రాత, లేక ప్రారబ్ధం పూర్వమే నిర్ధారించబడిందా? మనిషికి గతంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఇంతకు ముందే లిఖించబడిందా?
లేక మన విధిని మనమే స్వయంగా వ్రాసుకున్నామా? అలా స్వయంగా రూపకల్పన (డిజైన్) చేసుకోగలమా? మన నుదుటి వ్రాతను మనమే వ్రాసుకుంటామా? మన తలరాతను మార్చుకోగలమా?
మార్చుకోగలిగితే ఎంత వరకూ మార్చుకోగలం? మార్చలేని భాగం యేదైనా ఉందా? మన ప్రమేయం ఎంతవరకూ ఉంది, ఎంత వరకూ లేదు? ఈ పరివర్తన జరగాలంటే మార్గాలేమిటి?
హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలు ఈ క్రమంలో యే విధంగా ఉపయోగపడతాయి?
జరిగే మార్పులు యే స్థాయిలో జరుగుతాయి, శరీర స్థాయిలోనా, మానసిక స్థాయిలోనా, ఆత్మ స్థాయిలోనా? అంటే స్థూల స్థూలశరీరపరంగానా, సూక్ష్మశరీర పరంగానా, కారణ శరీరపరంగానా?
జరగవలసిన మార్పుకు ఎంత కాలం పడుతుంది, త్వరితంగా జరగాలంటే మార్గాలున్నాయా?

మొత్తంఈ విధి రూపకల్పనలో గురువు పాత్ర ఏమిటి? మన పాత్ర ఏమిటి?
తరువాయి వ్యాసంలో సమాధానాలు/పరిష్కారాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. పాఠకులు కూడా ఈ గ్రంథంలో నుండి శోధించాలని సవినయ విజ్ఞప్తి.
ఇంతవరకూ ఏ గురువూ ఇంత స్పష్టంగా చెప్పలేదేమో !!
రిప్లయితొలగించండి