7, డిసెంబర్ 2024, శనివారం

ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు - అభ్యాసులు

 



ఆధ్యాత్మిక జిజ్ఞాసులు - అభ్యాసులు 

ధ్యానం చేయడానికి వచ్చేవారు, లేక ఆధ్యాత్మిక సాధన చేయాలని వచ్చేవారు, ఎవరినైతే మనం జిజ్ఞాసులని, అభ్యాసులని, సాధకులని పిలుస్తూ ఉంటామో, వాళ్ళు రకరకాల లక్ష్యాలతో వస్తూంటారు. ముఖ్యంగా ఒక గురువును ఆశ్రయించాలనుకున్నవారు మనసుల్లో వివిధ గమ్యాలు పెట్టుకుని వస్తూంటారు. 

ఉదాహరణకు ఒకప్పుడు ప్రాచీనకాలంలో చాలా వరకూ కేవలం భగవత్సాక్షాత్కారం కోసం గురువును ఆశ్రయించేవారు. ఆ తరువాతి కాలంలో ఎక్కువమంది మోక్షసాధన కోసం వచ్చేవారు గురువు వద్దకు. ఆ తరువాత కేవలం మనశ్శాంతి కోసం వచ్చేవారు ధ్యానానికి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి వస్తున్నారు. 

బాబూజీ తన సహజ్ మార్గ్ ధ్యాన విధానానికి, వాళ్ళ మనసుల్లో  ఎటువంటి లక్ష్యమున్నా స్వాగతిస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది కష్టాలు పోవాలని, ఇలా రకరకాలుగా ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎలా మొదలుపెట్టినప్పటికీ క్రమక్రమంగా యదార్థ లక్ష్యం సహజంగా స్థిరంగా ఏర్పడే అవకాశం ఈ సహజ మార్గ్ సాధన వల్ల కలుగుటుందంటారు బాబూజీ. అందుకే అభ్యాసుల హృదయాలలో లక్ష్యం స్థిరంగా, స్పష్టంగా ఏర్పడటానికి సమయం పట్టవచ్చు. అందుకే మన ప్రార్థనలోని మొదటి పంక్తి, ప్రతి రోజూ మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. 

ఆసక్తిని బట్టి లక్ష్యం ఏర్పడుతుంది, లక్ష్యాన్ని బట్టి తపన ఉంటుంది, తపనను బట్టి, సాధన క్రమబద్ధం అవుతుంది, ఆ విధంగా పురోగతి జరుగుతూ ఉంటుంది.  




1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...