తపన తీవ్రతను పెంచుకోవడం ఎలా?
ఆధ్యాత్మిక పురోగతిని మందుకు సాగేలా నడిపించే శక్తి ఈ తపన; యాత్రను ముందుకు సాగించే ఇంధనం తపన; చైతన్య వికాసానికి దారి తీసేది ఈ తపన; ఆధ్యాత్మిక పరిణతికి కీలకమైనది తపన; సమయాన్ని ఆదాయ చేసేది తపన; తపన ఉంటేనే ఆసక్తి పెరుగుతుంది; తపన లేకుండా చేసే ఆధ్యాత్మిక సాధన ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం లాంటిది; దాహం లేకుండా నీరు గరాగడంలాంటిది; గడించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీర్ణమయ్యేలా చేసి, తపనను మరింత తీవ్రతరం చేసేది కూడా తపనే. తపనే దైవాన్ని ఆకర్షించేలా చేస్తుంది. తపనే ప్రేమను పెంపొందిస్తుంది. వెరసి ఆధ్యాత్మిక ప్రగతిని వేగవంతం చేసేది తపనే.
అయితే మనుషులలో తపనల్లో వ్యత్యాసాలుండటానికి కారణాలు అనేకం కావచ్చు. ముఖ్యంగా కోరికలు, వికారాలు, వాసనలు (సంస్కారాలు), అహంకారము. ఇవే తపన తీవ్రతను తగ్గించే నకారాత్మక శక్తులు. స్వతఃసిద్ధంగా ఆత్మలో ఉండే ఈ తపనను పెంచగలిగేది మన ఇచ్ఛాశక్తి (Will Power). ఈ ఇచ్ఛాశక్తిని పెడత్రోవను పట్టించేవే మనం ఇంతకు ముందు చెపుకున్నవి. అందుకే ఈ శక్తిని దైవాన్ని ఆకర్షించే విధంగా ప్రయత్నపూర్వకంగా మరల్చాలి. అక్కడే హార్ట్ఫుల్నెస్-సహజ మార్గ్ ధ్యాన ప్రకరొయ్యల వంటి ఆధ్యాత్మిక పద్ధతులు, స్వాధ్యాయం, ఆత్మవికాస సాహిత్య అధ్యయనం, సజ్జన సాంగత్యం, స్వచ్ఛందంగా ఇతరుల సేవలో ఉండటం, ఇవన్నీ సహకరిస్తాయి. క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి జరుగుతూ, ఈ అపన అనే అగ్ని ఎడతెగకుండా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.
కాబట్టి ప్రతి జిజ్ఞాసువు, త్రికరణ శుద్ధిగా పరమసత్యాన్ని అన్వేషించే ముముక్షువులు, సాధకులు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ తమ తపనను తీవ్రతరం చేసుకునే పనిలో నిమాగ్నమైపోవాలి. తథాస్తు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి