13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తపన , ఆధ్యాత్మిక తృష్ణ

తపన , ఆధ్యాత్మిక తృష్ణ 


స్వతః సిద్ధంగా ప్రతీ ఆత్మలోనూ దేని కోసమో తెలియని ఆరాటం, తపన, ఒకరకమైన ఆకలి, దాహం ఉంటుంది. దీన్నే మనం ఆధ్యాత్మిక తృష్ణ అని అంటాం. ఇది హృదయంలో ఒక విధమైన అశాంతిని కలిగిస్తుంది. వన్నీ హృదయాలు దీన్ని స్పష్టంగా అనుభూతి చెందుతాయి; చాలామందిలో ఇది నిద్రాయణ స్థితిలో గాని, బలహీనంగా గాని ఉంటుంది. కానీ తప్పక ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. 

ఈ దాహం యొక్క తీవ్రతను బట్టి ఆయా ఆత్మల దాహం తీరే వరకు వాటి మార్గాలు అవి వెతుక్కుంటూ ఉంటాయి. దీన్నే మనం జీవితం అంటాం. ఆత్మ యొక్క తీవ్రతకు అనుగుణంగానే జీవితం అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వ్యక్తమయ్యే క్రమంలోనే కోరికలు, స,మస్కారాయాఉ, అహంకారాల పాత్ర ఉంటుంది. 

గాయితమ బుద్ధుడైనా, స్వామి వివేకానంద అయినా, శ్రీ రామకృష్ణ పరమ హంస అయినా, లాలాజీబాబూజీలయినా, సామాన్య సాధకుడైనా అందరిలో ఉండే ఆధ్యాత్మిక దాహం ఒక్కటే. కేవలం తీవ్రతల్లో వ్యత్యాసం ఉంది అంటే. కానీ ఆ వ్యత్యాసం మాత్రం విపరీతంగా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ దాహం పూర్తిగా తీరే వరకూ నిద్ర పట్టేది కాదట, మనకు నిద్ర పడుతోంది. ఆ తేడా తపనలో  ఊహించలేనంత ఉంది. 

ఈ తపనే గమ్యాన్ని చేరువ చేసేది. ఆకలి ఎంత ఎక్కువగా ఉంటే ఆహారానికి అంతా దగ్గరగా ఉంటాం; అలాగే దాహం ఎంత ఎక్కువగా ఉంటే నీరు అంతా చేరువవుతుంది. పరమ గమ్యం చేరే వరకూ మనలను నడిపించేది ఈ తపనే. ఈ తపన యే గమ్యాన్ని చేరుకోవాలన్నా అవసరమే. 

మన మహాత్ముల జీవితాల్లో ఈ తపన-ఘట్టాన్ని పరిశీలిస్తే కొంతవరకైనా అర్థమవుతుంది, వాళ్ళు యే విధంగా ఆ పరమాత్ముని కోసం పరితపించేవారో. 

బుద్ధుడు సిద్ధారథుడిగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడిని, ఒక శవాన్ని, ఒక వ్యాధిగ్రస్త వ్యక్తిని చూసి, ఆయన మనసు యే విధంగా చలించిపోయిందో, తాను మహా సామ్రాజ్యానికి రాజునన్న విషయం కూడా మరచిపోయి, భార్య, తనయుడు ఉన్నారన్న స్పృహ లేకుండా, కేవలం ఆతను చూసిన వాటి వెనుక ఉన్న పరమ సత్యం ఏమిటో, మానవుడి కష్టాలకు అసలు కారణం ఏమిటో కనుగొనాలన్న తపనతో అంతర్ముఖుడై శోధించి సమాధానాలను కనుగొనడం జరిగింది. ఆయనకు ఆయనలో కలిగిన ప్రశ్నలకు సమాధానం దొరికే వరకూ మరేమీ ఆయన మనసులోకి రాలేదు. ఆ విధంగా ఉండింది వారి తపన, వారి జిజ్ఞాస. మనం కూడా ఆయన చూసినవన్నీ చూస్తున్నాం కానీ ఆ తీవ్రత మనలో ఎందుకు కలగడం లేదు? ఇది మనలను మనం ప్రశ్నించుకోవాలి.

అలాగే స్వామి వివేకానంద 18 యేళ్ళ యువకుడిగా ఉన్నప్పుడే దారిలో వెళ్ళే ప్రతీ వ్యక్తిని, "మీరు దేవుడిని చూశారా? మీరు దేవుడిని చూశారా?" అని అడిగేవారట.  అలా దేవుడిని చూసిన వ్యక్తిని కలిసే వరకూ ఆయన నిద్ర పోయేవారు కాదట. మనకూ కూడా ఇదే ప్రశ్న ఉంది. కానీ మనకు ఇంకా నిద్ర పడుతోంది. ఇదే తపణలో తీవ్రతలో తేడా అంటే. 

ఇక శ్రీ రామకృష్ణ పరమహంస వారి విషయానికొస్తే, వారు సాధన చేసుకునే రోజుల్లో ప్రతీ రోజు చీకటి పడేసరికి, ఏకాంతంలో భగవంతుడిని చూడకుండా మరో రోజు గడిచిపోయిందేనని కన్నీరు పెట్టుకునేవారట. వారి సాధనా ప్రకరణం అంత దీక్షగా, తీక్షణంగా గడచింది. 

అలాగే బాబూజీ మహారాజ్ వారి చిన్నప్పటి నుండి దైవాన్ని అనుభూతి చెందడం కోసం ఆ వయసు నుండే అనేక ప్రయోగాలు చేసేవారట. ఆ అన్వేషణలో లాలాజీ పాదాల చెంత చేరే వరకూ ఆ దాహం తీరలేదు. 

ఇలా మనం మహాత్ముల జీవితాల్లో ఈ ఘటాలను పరిశీలిస్తే మన అపన తీవ్రమవడానికి దోహదపడువచ్చునేమోనని నా అభిప్రాయం. కావున తపన అందరిలో తీవ్రతరమవుగాక. గమ్యము చేరుకునేంత వరకూ విశ్రమింపకుందురుగాక. 

 


1 కామెంట్‌:

  1. సార్ నిద్రణంగా ఉన్న తపనను పెంచుకోవడానికి ఆచరనాత్మక పద్ధతులు ఏమిటి?

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...