*
ఎవ్వనిచే జనించు జగము; యెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరుడెవ్వఁడు; మూలకారణం
బెవ్వడు; అనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము తానేయైన వా
డెవ్వడు; వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్.
తా|| ఎవరి ద్వారా ఈ జగత్తు, ఈ సృష్టి సరుకిమపబడిందో, ఎవరి లోపల ఈ జగత్తు లీనమై ఉందో, ఎవరు యందు, ఇందు కూడా పరమేశ్వరుడై ఉన్నాడో, సరానికి మూలకారణం ఎవరై ఉన్నాడో, ఎవరు ఆది, మధ్యమ, అంతం లేకుండా ఉన్నాడో, ఎవరైతే సర్వమూ తానే అయి ఉన్నాడో; అటువంటి ఆత్మభవుడైన ఈశ్వరుడిని నేను శరణు వేడుతున్నాను.
పోతనామాత్యునిచే ఇవ్వబడిన భగవంతుని అద్వితీయమైన నిర్వచనం. మతాలతో సంబంధం లేని నిర్వచనం. భాగవతంలోని గజేంద్ర మోక్షం అధ్యాయం లోనిది. తెలుగు పిల్లలందరికీ తప్పనిసరిగా కంఠస్థం చేయించవలసిన ఉత్పలమాల పద్యం. పైన వీడియోలో చిత్తూరు నాగయ్య గారు, భక్త పోతన సినిమాలో వారు ఈ పద్యాన్ని గానం ఎంత స్పష్టమైన ఉచ్ఛారణతో గానం చేశారో వింటే తనువు పులకరిస్తుంది. ఈ సినిమా నా దృష్టిలో, ప్రతీ అభ్యాసి (సాధకుడూ) తప్పక చూడవలసిన చిత్రం.
అవును. ఎంత చక్కగా పరిచయం చేసారు. ఆ సినిమా అందరూ మళ్ళీ మళ్ళీ చూడవలసినదే ! నాగయ్య గారు చేసిన ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మనలో దైవం పట్ల ప్రేమ, భక్తీ భావనలు పుట్టే విధంగా చేస్తాయి. ధన్యవాదాలు కృష్ణా రావు గారు.
రిప్లయితొలగించండి