ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
13, మార్చి 2024, బుధవారం
ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం - మార్చ్ 14-17, 2024
9, మార్చి 2024, శనివారం
ప్రెస్ మీట్ - హోటల్ తాజ్ కృష్ణా, హైదరాబాద్
గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవ్ , 2024 - కాన్హా శాంతి వనం
8, మార్చి 2024, శుక్రవారం
మహిళల పట్ల బాబూజీ హృదయం
7, మార్చి 2024, గురువారం
చైతన్య వికాసానికి అవరోధాలు
చైతన్య వికాసానికి అవరోధాలు
చైతన్య వికాసానికి, లేక అంతఃకరణ శుద్ధికి, లేక దైవ సాక్షాత్కారానికి లేక మనకు మనలోని అంతర్యామిగా ఉన్న దైవానికి అడ్డుగా, అవరోధాలుగా నిలిచేవి ఏమిటి? మన మానస, బుద్ధి, అహంకార చిత్ లను కలుషితం అవడానికి, అశుద్ధమవడానికి, మలినమవడానికి గల కారణాలేమిటి? మనలను, మనలో అంతర్యామిగా ఉన్న దైవాన్నీ, వేరు చేసేవి మూడే మూడు అంశాలు: కోరికలు, సంస్కారాలు/ముద్రలు/కర్మలు/వాసనలు, అహంకారము. వీటి వల్లనే మనకున్న ప్రస్తుత స్థితి. ఇవే మన జీవితాలను శాసించేది. వీటి వల్లనే మనోబుద్ధ్యహంకారచిత్తాలు కలుషితమయ్యేది.
ఇవన్నీ మనకు కనిపించనివే. అయినా మనలను శాసిస్తున్నాయి. వీటిని శుద్ధి చే విద్యే యోగవిద్య లేక బ్రహ్మ విద్య, లేక ఆధ్యాత్మిక విద్య లేక హార్ట్ఫుల్నెస్ వంటి ధ్యాన పద్ధతి.
కోరికలు తగ్గించుకుంటూ ఉండాలి. కోరికలు ఎంత తగ్గితే అంత ఆనందమే గాక, అన్ని జన్మలు తగ్గిపోతాయి. కోరికలు పెంచుకోవడం అంటే జన్మలు పెంచుకోవడమే. కోరికలే సంస్కారాలను పుట్టిస్తాయి. కోరికలు పెరుగుతున్న కొద్దీ హృదయభారం పెరుగుతూ ఉంటుంది. ముందు కోరికలను తగ్గించుకుని అవసరాలకు దిగాలి. ఆ తరువాత అవసరాలు కూడా కనీసంగా ఉండే విధంగా మన జీవన విధానం ఉండాలని బాబూజీ చెప్తూండేవారు.
మనం ప్రపంచంతో వ్యవవహరిస్తున్నప్పుడు, నాలుగు రకాలుగా మన హృదయంపై ముద్రలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ ముద్రలే పదే పదే ఏర్పడి సంస్కారాలుగా, పతంజలి మహర్షి చెప్పే చిత్త వృత్తులుగా ఏర్పడి అవి మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఈ సంస్కారాలు నాలుగు రకాలు - 1) రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), 2) ప్రాపంచిక చింతలు 3) ఇంద్రియపరమైన, లైంగికపరమైన ముద్రలు 4) అపరాధభావాన్ని సృష్టించే ముద్రలు.
ఇవన్నీ గతంలో ఏర్పరచుకున్నవి, ఈ జన్మలోనే గాక, ఇంతకు పూర్వం ఏర్పరచుకున్నవాటి ప్రభావం వల్ల మన ప్రస్తుత జన్మ నిర్ధారింపబడుతుంది. కాబట్టి మన జీవితశైలిని యే విధంగా మలచుకోవాలంటే, పుట్టుకతో తెచ్చుకున్న సంస్కారాలను భోగిస్తూ, అనుభవిస్తూ; ఇంకా ఖర్చవ్వాల్సిన బీజరూపంలో ఉన్న సంస్కారాలను యోగ సాధన ద్వారా తొలగించుకుంటూ, కొత్త సంస్కారాలు ఏర్పడకుండా ఉండే విధమైన జీవన విధానాన్ని అవలంబించాలి. అటువంటి జీవన విధానమే హార్ట్ఫుల్నెస్ జీవన విధానం. ఈ సంస్కారాలన్నీ బీజరూపంలో మన చేతనలో, సూక్ష్మ-కారణ శరీరాల్లో పొరలుపొరలుగా నిక్షిప్తమై ఉంటాయి.
ఇక అహంకారం: అంటే 'నేను', 'నాది' అనే స్పృహతో జీవించడం. దీన్ని వినయం ద్వారా అంటే, 'ఆయన', 'ఆయనది' అంటే భగవంతునిది అన్న స్పృహతో జీవించగలిగితే జీవితం డైవోన్ముఖం అవుతుంది.
ఈ విధంగా సగటు మానవ జీవన విధానంలో పరివర్తన తీసుకురాగలిగేది మన సంకల్ప శక్తి, మన కృషి ఇటువంటి జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా సుసాధ్యమవుతుంది; కనీసం రోజు-రోజుకూ మెరుగైన మనిషిగానైనా జీవించగలుగుతాం.
సరైన ధ్యానపద్ధతిని అనుసరిస్తే ఏమి జరుగుతుంది?
ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనం
ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనం
ప్రకృతి సిద్ధంగా, స్వతః సిద్ధంగా, ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, వివిధ సందర్భాలలో క్షణికంగా కళ్ళు మూసుకోవడం వల్ల కలిగిన మనశ్శాంతి, ఉపశమనం, ప్రశాంతత, స్పష్టత దీర్ఘకాలికంగా మరింత ఎక్కువగా అనుభూతి చెందాలంటే తెలిసి చేసే ధ్యానం అవసరం.
అసలు ధ్యానం అంటే ఏమిటి? ఆలోచన అనుభూతిగానూ, బుద్ధి వివేకంగానూ, అహం, అంటే నేను అనే స్పృహ, నీవు (భగవంతుడు) అనే స్పృహగానూ, వెరసి శుద్ధ చైతన్యంగా పరిణతి చెందే విధంగా చేసేదే ధ్యానం.
ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యాలు రెండు, అది యే రకమైన ధ్యానమైనా సరే :
1) చంచలమైన మనసును క్రమశిక్షణలో ఉంచడం
2) మనసుకు దాటి అతీతంగా వెళ్ళగలగడం.
మనసున్నవాడే మానవుడు. మనసును బట్టే మానవుడి మనుగడ. మనసు నాణ్యతను బట్టే మనిషి నాణ్యత. ఇక్కడ మనసు అంటే చేతనం అని కూడా అర్థం చేసుకోవచ్చు. మన ఆధ్యాత్మిక సాహిత్యంలో మనసు అంటే చేతనగా అర్థం చేసుకోవాలి. ఈ మనసులోనే, లేక ఈ చేతనలోనే, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇమిడి ఉన్నాయి. వీటిని ప్రధాన సూక్ష్మ శరీరాలు అని కూడా అంటారు. ఈ నాల్గింటినీ కలిపి అంతఃకరణ అని కూడా అంటారు.
మనిషి సమూలంగా మారాలంటే మనసు మారాలి. అంటే మనసు, బుద్ధి, అహంకారం చిత్తము, ముఖ్యంగా ఈ నాలుగూ శుద్ధి కావాలి. ఈ అంతఃకరణ శుద్ధి జరగాలి.
అయితే ఇవి కలుషితం ఎలా అయ్యాయి? మనలోనే ఉన్న కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే గాక, భయం, అలసత్వం (బద్ధకం) వల్ల మన మనసు, బుద్ధి, అహంకారం కలుషితమవడం వల్ల ఫలితంగా చిత్తం లేక చైతన్యం కూడా అశుద్ధమైపోయింది. ఈ కలుషితమైన చైతన్యమే మన జీవితాలను నడిపిస్తున్నది. ఇలా కలుషితమవడం వల్లే ఈ నాలుగు సూక్ష్మశరీరాలు ప్రభావితమై - ఆలోచనా క్రమం జటిలంగా తయారవుతుంది; దానితో మన మాటలు, చేతలు, అలవాట్లు, ప్రవర్తన, మన శీలం/వ్యక్తిత్వం అన్నీ జటిలంగా మారిపోతూ ఉంటాయి. ఇవే జటిల తత్త్వాలుగా మారతాయి. అరిషడ్వర్గాల ప్రభావంతోనే మనిషి జటిలంగా తయారవుతాడు.
అరిషడ్వర్గాలనే అశుద్ధాలు తొలగించుకుని, శుద్ధంగానూ, జటిల తత్త్వాలను తొలగించుకుని స్వచ్ఛంగానూ, తద్వారా ఈ చైతన్య శుద్ధి చేసుకున్నట్లయితే జీవితం కూడా క్రమక్రమంగా శుద్ధి అవుతుంది.
ఛాదస్తం
ఛాదస్తం మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడ...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
బాబూజీ చెప్పిన 7 శ్లోకాలు, పూజ్య దాజీ ద్వారా వెల్లడియైన 7 శ్లోకాలు 7 రత్నాలు: శ్లోకం 1 ప్రజాహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ...